వైఎస్ ముఖ్యమంత్రి… హైదరాబాద్‌లో ప్రవాసీదివస్… అన్ని రాష్ట్రాలకూ ప్రత్యేకంగా విభాగాలు… ప్రవాస భారతీయులతో తమ రాష్ట్రాల గుడారాల్లో భేటీలు… గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ పాల్గొన్నాడు… దద్దరిల్లిపోయింది… ఏపీ సహా మిగతా అన్ని రాష్ట్రాల గుడారాలు, ముఖ్య నేతల ప్రసంగాలు గట్రా వెలవెలబోయాయి… ఆరోజు నుంచీ మోడీ పెట్టుబడిదారులకు సన్నిహితుడు… గుజరాత్‌కు… ప్రధానిగా సైతం… ఒక వీడియో చూస్తుంటే నాటి హైదరాబాద్ ప్రవాసీ దివస్ గుర్తొచ్చింది…
సరే, నిన్నివాళ వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ జరుగుతోంది కదా… అందులో ముఖేష్ అంబానీ మాట్లాడుతున్న ఒక వీడియో చూస్తుంటే ఆశ్చర్యం వేసింది… రిలయెన్స్ అధినేత, ప్రపంచ కోటీశ్వరుల్లో టాప్ టెన్‌లో ఒకడు… భారత సమాజాన్ని శాసిస్తున్నవాడు… ఆ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో మాట్లాడుతున్నాడు… ఏ శషభిషలూ లేవు… స్రెయిట్‌గా ఓ గుజరాతీ బిడ్డగానే మాట్లాడుతున్నాడు… ఏ మొహమాటాలూ లేవు… దాచుకోళ్లు లేవు… తనది గుజరాతీ కంపెనీ అనే చెబుతున్నాడు…
పైగా మోడీని మోడీ భాయ్ అంటూ సంబోధిస్తున్నాడు… అది ప్రధానితో తన సాన్నిహిత్యాన్ని వరల్డ్ ఇన్వెస్టర్లకు చెప్పుకునే ప్రయత్నం కావచ్చు, లేదా నిజంగానే మోడీతో అంత దోస్తానా ఉంది కాబట్టి సంబోధిస్తూ ఉండవచ్చు… ‘‘ఎన్నో ఏళ్లుగా గుజరాత్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్లను చూస్తున్నాను, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను… నేనే, నా కంపెనీ ప్రథమ ప్రాధాన్యం గుజరాత్…
Ads
గుజరాత్ సమ్మిట్ అంటే వరల్డ్ లెవల్ సమ్మిట్… అంత ఇంపార్టెన్స్ ఉంటుంది… నేను గుజరాతీని అని చెప్పుకోవడానికి గర్విస్తాను… ఒకప్పుడు మోడీ గుజరాతీ లీడర్ కావచ్చు, కానీ ఇప్పుడు గ్లోబల్ లీడర్… మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా… మా విదేశీ స్నేహితులు అడుగుతుంటారు… మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే అంటుంటారు కదా, అదెలా అని అడుగుతారు…’’
ఈసమయంలో మోడీ ఆ సమావేశ మందిరంలో అడుగుపెడతాడు… పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు లేచి నిలబడి స్వాగతం చెబుతారు… తరువాత ముఖేష్ కొనసాగిస్తూ… ‘‘మోడీ ఏదైనా సంకల్పిస్తే దాన్ని సాధించడానికి నిజాయితీగా ప్రయత్నిస్తాడు… అందుకే మోడీ అనుకుంటే అసాధ్యమనేది కూడా సాధ్యమే అవుతుంది…’’
మా నాన్న ధీరూభాయ్ ఎప్పుడూ చెప్పేవాడు… ‘‘గుజరాత్ నీ మాతృభూమి మాత్రమే కాదు, ఇది నీ కర్మభూమి’’ అని… ఎస్, మాది గుజరాతీ కంపెనీయే… 150 బిలియన్ డాలర్లను ఇండియాలో మేం పెట్టుబడిగా పెట్టాం గత పదేళ్లలో… 12 లక్షల కోట్లు… అందులో మూడో వంతు గుజరాతీలోనే పెట్టాం… మరో పదేళ్లలో కూడా ఇదే కంటిన్యూ చేస్తాం… 5000 ఎకరాలు జామ్‌నగర్ గ్రీన్ గుజరాత్ ఈ ఏడాదే 5జీలో మా సక్సెస్ ఏమిటో ప్రపంచం చూసింది… చాలా రంగాల్లో గుజరాత్‌ను గ్లోబల్ లీడర్‌గా చేస్తాం… ఆర్టిఫిషియల్ ఫీల్డ్‌లోకి కూడా దూకుడుగా వెళ్లబోతున్నాం…’’
ఎప్పుడూ ఆదానీ ఇలాంటి ప్రసంగం చేసినట్టు వినిపించలేదు, కనిపించలేదు… ఇంత బహిరంగంగా నేను గుజరాతీ, నాది గుజరాతీ కంపెనీ, గుజరాత్ నా కర్మభూమి, గుజరాతీ డెవలప్‌మెంటే మా ప్రథమ ప్రాధాన్యం అని చెప్పుకోవడం విశేషమే అనిపించింది…
Share this Article