ఒక ప్రాణికి మరో ప్రాణి ఆహారం… అది ప్రకృతి నిర్దేశించిన జీవావరణ బ్యాలెన్స్ మెకానిజం… రోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల జీవులు తెగిపడతయ్, ముక్కలవుతయ్, ఉడుకుతయ్, కాలుతయ్, వేగుతయ్, కొన్ని సజీవంగా పెద్ద జీవుల కడుపుల్లోకి చేరిపోతయ్, జీర్ణమవుతయ్… ఇది నేచర్, ఇదంతా నేచురల్… అంతేతప్ప ఇదేదో క్యూయెల్టీ టు యానిమల్స్ వంటి చట్టాల బాపతు క్రూరత్వం లేదు, నేరమూ లేదు…
కరీంనగర్ కేసు తీసుకుందాం… ఎవరో బస్సులో కోడిని మరిచిపోయారు… సహజం… ఎవరో నెల్లూరాయన కరీంనగర్ జిల్లాలో మేస్త్రీ పని చేస్తుంటాడట, పొరపాటున కోడిని మరిచిపోయాను అంటున్నాడు… సరే, కోడిని చూడగానే ఎవరో మరిచిపోయారు అనుకుని డిపోలో అప్పగించారు… (ఇదే చెబితే ఓ మిత్రుడు ఇక్కడే కండక్టర్, డ్రైవర్ తప్పుపని చేశారు, ఆఫ్టరాల్ కోడి, రోజూ కొన్ని లక్షల కోళ్లు తెగుతయ్, ఈ ఒక్క దానికొచ్చిన విశేషం ఏమిటట, కోసి కూరొండుకుంటే పోయేది అన్నాడు…)
సరే, డిపో వాళ్లు మరింత ఓవరాక్షన్… దానికి వేలం వేస్తామని ప్రకటించారు… వేలం దేనికి..? ఎవరైనా ఓనర్ తిరిగి వస్తే అప్పగిద్దామనే సద్భావన ఉన్నప్పుడు వేచి చూడాలి, వేలం ఎందుకు పాడాలి..? ఎవరికో ఎందుకు కట్టబెట్టాలి..? ఆ సొమ్ము ఎక్కడ జమచేస్తారు..? ఏ పద్దు కింద..? పోనీ, కోడిని తీసుకుపోయి పోలీసులకు అప్పగిస్తే… వాళ్లు ఓ చూపు చూసుకునేవాళ్లు… అదీ లేదు…
Ads
ఈ దశలో పత్రికల్లో వార్తలు చూసి నాగార్జున పెళ్లాం, బ్లూక్రాస్ సొసైటీ ఫౌండర్ అక్కినేని అమల స్పందించిందట… వేలం పాట ఆపి కోడిని రక్షించాలని కరీంనగర్ తమ శాఖను ఆదేశించిందట… వాళ్లు వెళ్లి ఈ వేలం పాట వన్యప్రాణి నిబంధనలకు విరుద్ధమని వాదించారట, అంతేకాదు, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ కిందకు వస్తుందన్నారట…
వెంటనే కరీంనగర్ డిపో-2 అధికారులు భయపడిపోయి, బెంబేలెత్తిపోయి కోడిని వాళ్లకు అప్పగించారట… దాన్ని మాదాపూర్ బ్లూక్రాస్ సొసైటీకి తరలిస్తారట… ఈలోపు దాని ఓనర్ తెర మీదకు వచ్చి నా కోడి నాకు కావాలి, మా నాన్న గుర్తు అని చేతులెత్తి మొక్కుతున్నాడు… అసలు ఇక్కడ బ్లూక్రాస్ సొసైటీ సిగ్నిఫికెన్స్ ఏమిటి..? వాళ్లకు ఆర్టీసీ అధికారులు కోడిని అప్పగించడం ఏమిటి..? అసలు వన్యప్రాణి నిబంధనల కిందకు ఈ కేసు ఎలా వస్తుంది..? వేలం వేస్తే క్రూయెల్టీ ఏమిటి..?
రోజూ తెగిపడే లక్షల కోళ్ల మాటేమిటి..? పెటా, బ్లూక్రాస్‌ల పాత్ర ఏమిటి..? వాళ్లేమైనా అన్ని ప్రాణుల రక్షణకు బాధ్యులా..? జవాబుదారీలా..? వాళ్లకు కోడిని అప్పగించడంలో ఔచిత్యం లేదు, అదేమీ చట్టపరమైన కర్తవ్యం కూడా కాదు… కోడి అంటే కోసుకుతినేదే… అంతకుమించి దాని జన్మకు వేరే సార్థకత ఏమీ లేదు… తెల్లారితే అది కూయాలి, ఆ గంట దాటితే దాన్ని ఓనర్ కోయాలి… ఈమాత్రం దానికి ఇంత సీన్ అవసరమా..? అందరూ అమలలు అయిపోతే కష్టం బాసూ… This version is not at all in-sensitive, Sensible…
Share this Article