అటు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ… దేశమంతా సందడి… హంగామా… తరతరాల ఈ జాతిపురుషుడి కార్యక్రమమంటే ఓరకమైన పండుగే కదా… మరోవైపు భిన్నంగా ఓ కార్యక్రమ ఏర్పాట్లు జరిగిపోతున్నయ్… ఇంత హడావుడి, అట్టహాసం కాదు, లోప్రొఫైల్… 17 జనవరిన జరగబోయే ఈ కార్యక్రమం పేరు ‘శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప’
ఇది పూరీ జగన్నాథుడికి సంబంధించిన టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు… దీనికి శ్రీజగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SJTA) 90 ప్రధాన పుణ్యక్షేత్రాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించింది… కనుమ పండుగ తరువాత రోజున మెగా సెరిమనీ… ఈ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తగిన ఆధ్యాత్మిక తంతు ఆల్‌రెడీ 12న స్టార్ట్ చేశారు… ముఖ్య అతిథి, కర్త గజపతి మహారాజ దివ్యసింగ దేవ్… ఆయన నివాసం ‘శ్రీ నహర్’… రేపు ఇక్కడ మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు… ఆయన ఎవరంటే..? 12వ శతాబ్దంలో పూరీ ఆలయాన్ని నిర్మించిన రాజవంశం వారసుడు…
ఇది అయోధ్య కార్యక్రమానికి పూర్తి భిన్నం… ఆల్‌రెడీ అంకురోపన్, అంకుర్ పూజ 13న స్టార్ట్ చేశారు, దీని తరువాత ఆదివారం యజ్ఞఅధివాస్… 15న అఖండదీపం వెలిగించడం, 3 రోజుల మహాయజ్ఞం అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ కారిడార్‌లో నడిచి, ఉత్తరపార్శ్య మఠం సమీపంలోని పోడియం మీద నుంచి శంఖం ఊది, ఈ కారిడార్‌ను భక్తులకు ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటిస్తాడు…
Ads
(ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… రాముడి గుడి పునర్నిర్మాణం పూర్తిగాకుండానే ప్రాణప్రతిష్ఠ చేయడం శాస్త్రవిరుద్ధం అంటూ కొందరు రాగద్వేషులైన శంకరాచార్యులు వక్రబాష్యాలు చెబుతున్నారు కదా… ఏ గుడైనా సరే, ఇదుగో నిర్మాణం పూర్తయింది అని చెప్పే దశ ఉండదు… నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి, పునర్నిర్మాణం, పునరుద్దరణ వంటి దశలు అనంతం… నో ఎండింగ్…)
అసలు ఏమిటి ఈ శ్రీమందిర్ పరిక్రమ ప్రాజెక్టు..? దర్శనానికి నేరుగా ప్రవేశం… దశలుండవు… 943 కోట్ల అంచనా ఖర్చు… 3000 కోట్లకు చేరినట్టు చెబుతున్నారు… ఇది 7 మీటర్ల బఫర్ జోన్, 10 మీటర్ల పాదచారుల మార్గం కలిగి ఉంటుంది… గుడి చుట్టూ అడ్డదిడ్డంగా ఉన్న చిన్న చిన్న దుకాణాలను, నివాసాలను తొలగించారు… (సేమ్, వారణాసి, ఉజ్జయిని) ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న హెరిటేజ్ సెంటర్‌గా మార్చారు…
(క్లారిటీ కోసం దిగువన ఇచ్చిన యూట్యూబ్ లింక్ ఓపెన్ చేయండి…) దీని ప్రారంభోత్సవానికి దేశంలోని ముఖ్య ఆలయాలకే కాదు, నేపాల్ సహా పలు దేశాల హిందూ గుళ్లకూ ఆహ్వానాలు పంపించారు… (నిజానికి అయోధ్య వైశిష్ట్యం, ప్రాముఖ్యత, సందర్భం, పునర్నిర్మాణ నేపథ్యం వేరు… కానీ పూరీ గుడి కూడా హిందూ ఆధ్యాత్మిక పరంపరలో ప్రధానమైన ఆలయమే…)
గుడి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రంజన్ కుమార్ దాస్ ‘‘ఒడిశాలోని 857 గుళ్లతోపాటు దేశంలోని కామాఖ్య, వైష్ణోదేవి, షిరిడిసాయి, చార్ ధామ్ వంటి 180 ప్రధాన గుళ్లకూ ఆహ్వానాలు పంపించాం… ఈ గుడి మీద విశేష హక్కులు కలిగిన నేపాల్ రాజకుటుంబాన్ని కూడా ఆహ్వానించాం… కనీసం 5 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నాం…’’ అని వివరించాడు…
వీవీఐపీలు వస్తున్నారు కాబట్టి భారీ సంఖ్యలో సెక్యూరిటీని మొహరిస్తున్నారు… సముద్రం వైపు నుంచి రక్షణ ఇండియన్ కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసు చూసుకుంటారు… 44 ప్లాటూన్ల పోలీసులను వినియోగిస్తున్నారు…
ఏ గుడైనా సరే, హిందూ మత కార్యక్రమం ఏదైనా సరే మేం చేయాల్సిందే అనే భావనతో ఉన్న ఒడిశా బీజేపీ అక్కడక్కడా సన్నాయి నొక్కులు నొక్కినా నవీన్ పట్నాయక్ పట్టించుకోలేదు… ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడ్డంకులు, అభ్యంతరాలకు దిగినా బేఖాతరు చేశాడు… ఈసారి ఒడిశాలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఆశ… బీజేపీ బాటలోనే చెక్ పెట్టాలని నవీన్ పట్నాయక్ అడుగులు…
ఓ నలుగురు శంకరాచార్యులూ… ప్రధాని మోడీ పెళ్లయ్యీ, సతిని వీడి సన్యాసిగా మారాడు… కానీ నవన్ పట్నాయక్ సతి చేయినే పట్టని బ్రహ్మచారి… మరి ఇంకా మొదలుపెట్టలేదా..? సతీరహితులు ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అంటూ..!!
Share this Article