చూడకపోతే పోయేదేమీ లేదు, అంత ఆసక్తి రేపే సినిమా ఏమీ కాదు… అలాగని ఏమీ చెడగొట్టలేదు… ఉన్నంతలో పండుగ ఉత్సాహాన్ని, గ్రామీణ వాతావరణాన్ని ఇంకాస్త పెంచే సినిమా… మరీ మాస్ మసాలా పెడపోకడలు కూడా ఏమీ లేవు… సో, ఫ్యామిలీలతోసహా వెళ్లి చూడవచ్చు… అలాగని ఏదో కొత్తదనం కోరుకోవాల్సిన పనిలేదు…
జస్ట్, ఓ సినిమా.., వెళ్లాం, చూశాం, వచ్చాం… టైమ్ పాస్ పల్లీ బఠానీ యవ్వారం.., నిజానికి నాగార్జునలో ప్రయోగప్రియుడు ఏనాడో కనుమరుగయ్యాడు… గతంలో నాగార్జున అంటే ఓ కొత్తదనం, ఓ ప్రయోగం, ఓ సాహసం… ఇప్పుడేవీ లేవు… ఏవో చెత్తాచెదారం సినిమాలు తీస్తున్నాడు… ఆ బిగ్‌బాస్ హోస్టే నయం, ఒక్క సినిమా హిట్టయి ఎన్నేళ్లయిందో ఫాఫం…
ఈ దశలో ఈ సినిమా కాస్త నయం… బిజినెస్ బాగా జరిగింది, సినిమా కూడా పర్లేదు స్థాయిలోనే ఉంది… ఎలాగూ పండుగ బరిలో ఉన్న సైంధవ, గుంటూరుకారం టాక్ బాగాలేదు కాబట్టి హనుమాన్ టికెట్లు దొరకనివాళ్లకు ఈ నాగార్జున సినిమాయే దిక్కు… వద్దనుకుంటే పెద్ద నష్టమూ లేదు… ఓ ఊరు… ఇద్దరు అనాథలు, ఓ పెద్ద మనిషి… వాళ్ల నడుమ బాండింగ్… నాగార్జునకు ఓ ప్రేమ యవ్వారం, కానీ ఆమెకు వేరే పెళ్లి చేసుకోవాలనుకునే పేరెంట్స్…
Ads
మరో జంట కారణంగా రెండూళ్ల నడుమ గొడవలు… చివరకు అంతా సుఖాంతం… అబ్బే, ఇలాంటి కథలు ఎన్నో చూశాం అంటారా..? అవును, సాదాసీదా కథ… అదీ ఏదో మలయాళ సినిమా కథ, దానికి ఇది రీమేక్… కాస్త ఉడికీఉడకని కామెడీ, నాగార్జున- నరేష్ నడుమ కుదిరిన బాండింగ్, కీరవాణి సంగీతం ఎట్సెట్రా కాస్త బెటర్… అన్నింటికీ మించి ఆ హీరోయిన్ బాగుంది, బాగా చేసింది… కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్… మొహంలో కాస్త ఉద్వేగాలు కనిపిస్తున్నాయి… పర్లేదు, మంచి పాత్ర పడితే ఇంకా క్లిక్కవుతుంది… ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా ఏమీ కాదు, అమిగోస్ సినిమాలో కూడా చేసింది… (బిగ్‌బాస్ నడుస్తున్నప్పడు ఓరోజు ఈమెను ప్రమోషన్ కోసం తీసుకొచ్చి హౌజుకు పరిచయం చేశాడు, కన్నడ కదా, వెంటనే శోభ, ప్రియాంకతో మాటలు కలిపేసింది… గుర్తొచ్చింది…)
అవునూ, ఇకపై ఎప్పుడు కీరవాణి పేరు వేసినా ఆస్కార్ విజేత అని రాయాల్సిందేనా..? చంద్రబోస్ ఆ అవార్డు తీసుకుని ప్రతి టీవీ ప్రోగ్రామ్‌కూ తిరిగినట్టు… రామజోగయ్యశాస్త్రి సరస్వతీపుత్ర అని తనే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నట్టు…! ఒకే ఒక పాట కాస్త బెటర్, మిగతావి సోసో, కీరవాణి ఎవరో అసిస్టెంట్లకు అప్పగించేసినట్టున్నాడు… అంతేలెండి, అంతటి ఆస్కార్ వచ్చాక కూడా ఆఫ్టరాల్ నాసామిరంగ వంటి సినిమాలకూ మనసు పెట్టి చేస్తాడా ఏం..?
నటనలో నాగార్జున నాగార్జునే, పల్లెటూరి కేరక్టర్ దొరికితే ఉత్సాహంగా దూరిపోతాడు… నరేష్ వోకే… రాజ్‌తరుణ్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం ఏమీ లేదు… మిర్నా అని మరో అమ్మాయి కూడా… ఉందంటే ఉంది… మిగతావాళ్లు పాత్రలకు తగ్గట్టు నటిస్తూ పోయారు… అవునూ, నాగార్జున ఇద్దరి కొడుకులకూ బ్లాక్‌బ్లస్టర్ అంటూ లేదు కెరీర్‌లో… చిన్నోడయితే మరీనూ… మరోవైపు నాగార్జునకు కూడా మాంచి వైవిధ్యమున్న పాత్రలు, ప్రయోగాల మీద ఆసక్తి పోయింది… ఏదో కథ నడిపిస్తున్నాడు… పిల్లల పెళ్లిళ్లు మరో కథ… ఏమిటో మరి… నాగార్జునకు ఏదో మునిశాపం ఉన్నట్టుంది…! అప్పట్లో, ఏడేళ్ల క్రితం వసివాడి తస్సాదియ్యా అంటూ సోగ్గాడే చిన్ని నాయనా ఓ మోస్తరు హిట్… అంతే, మళ్లీ ఇన్నాళ్లకు కాస్త కళ..!!
Share this Article