గీతా ప్రెస్… యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఉన్న ఈ ప్రింటింగ్ ప్రెస్ 1923లో ఏర్పాటైంది… ఈరోజుకూ ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిషర్స్‌లో ఒకటి… 15 భాషల్లో 95 కోట్ల పుస్తకాలు పబ్లిష్ చేసింది ఈ ప్రెస్… ఇదీ దీని చరిత్ర… వరదలా వచ్చిపడుతున్న ఓ పుస్తకం ఆర్డర్లకు తగినట్టు ప్రింట్ చేయలేక సతమతం అవుతోంది మొదటిసారి… దాంతో తొలిసారిగా ఎవరైనా సరే ఆ పుస్తకాన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ప్రకటించింది… మంచి సందర్భం, మంచి పేరు వదులుకోవడం ఇష్టం లేక…
ఈ పుస్తకాల గురించి ఓసారి సంక్షిప్తంగా చెప్పుకోవాలి ఇక్కడ… వివిధ దేవుళ్ల పారాయణాలు చేసేవారు ఏం కోరుకుంటారంటే… ఆ కంటెంట్ అక్షరాలు స్పష్టంగా ఉండాలి, మంచి నాణ్యత కలిగిన పేపర్ ఐఉండాలి, అన్నింటికీ మించి భాషాదోషాలు, తప్పులు ఉండకూడదు… మంత్రాలైనా, పారాయణ సారాంశమైనా సరే తప్పులుగా ఉంటే, భక్తులు వాటిని యథాతథంగా ఉచ్చరిస్తే రావల్సిన లాభం రాకపోగా ఉల్టా నష్టం తప్పదు… ఈ గీతా ప్రెస్ ఆధ్యాత్మక పుస్తకాల్నే పబ్లిష్ చేస్తుంది…
చాలామంది చేస్తారు, కానీ గీతా ప్రెస్ ఒకటిపదిసార్లు ప్రూఫ్ రీడింగ్ చేయిస్తుంది… ప్రామాణికమైన గ్రంథాల నుంచే కంటెంట్ తీసుకుంటుంది… పుస్తకాల ధర కాస్త అటూఇటూ వాణిజ్య పబ్లిషర్లలాగే ఉంటుంది కానీ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేస్తుంది… అందుకే ఆ పుస్తకాలంటే జనం ఎగబడతారు… ఏటా డిమాండ్ ఉన్న పుస్తకాల్లో శ్రీరామచరితమానస్ కూడా ఒకటి… తులసీదాస్ రచించిన ఈ గ్రంథానికి హిందూ ఆధ్యాత్మిక సాహిత్యంలో ప్రాధాన్యం చాలా ఎక్కువ…
Ads
ఎప్పటిలాగే 75 వేల కాపీలు ప్రింట్ చేస్తోంది… 2022లో ఆ సంఖ్యలోనే అమ్మింది… కానీ ఎప్పుడైతే అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠను ప్రకటించారో ఈ పుస్తకం డిమాండ్ అనేక రెట్లు పెరిగిపోయింది… 4 లక్షలకు పైగా పుస్తకాలకు ఆర్డర్లు వచ్చిపడ్డయ్… ఈ సంఖ్యలో ప్రింట్ చేయలేకపోతోంది… మహా అయితే లక్ష కాపీలను తమతో వ్యాపార సంబంధం ఉన్న బుక్ స్టోర్లకు పంపిస్తున్నారు… ఒక్క జైపూర్ నుంచే 50 వేల కాపీల ఆర్డర్ వచ్చింది…
ఈ గిరాకీని సొమ్ము చేసుకోవడానికి కమర్షియల్ పబ్లిషర్లు ప్రయత్నిస్తారు… ఏదో చెత్తను పబ్లిష్ చేసి అమ్ముతారు… అందుకని స్పిరిట్యువల్ బుక్ పబ్లిషింగే ప్రధానంగా వ్యవహరించే గీతా ప్రెస్ ఓ పనిచేసింది… తొలిసారిగా ఓ పుస్తకాన్ని తమ వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తోంది… 15 రోజుల గడువు… 50 వేల డౌన్ లోడ్లకు అవకాశం… ఎవరైనా సరే ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు… వాటినే కలర్ ప్రింటవుట్లు తీసుకుని లేదా నార్మల్ ఔట్‌పుట్ తీసుకుని, బుక్ బైండింగ్ చేసుకోవచ్చు…
నో కాపీ రైట్స్… ‘ఇంకా ఆర్డర్లు వస్తూనే ఉన్నయ్… మొదట 50 వేల కాపీల డౌన్ లోడ్స్ చాలు అనుకున్నాం కానీ సరిపోవు… లక్ష కాపీలు ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవడానికి అనుమతి ఇద్దామని, డౌన్ లోడ్ గడువు పెంచుదామనీ అనుకుంటున్నాం’ అంటున్నాడు గీతా ప్రెస్ మేనేజర్ త్రిపాఠీ… రామభక్తగణం ఇంటింటికీ అక్షింతల పంపిణీని చేపట్టింది కదా, వాటితోపాటు కొందరు రాముడి బొమ్మల్ని, శ్రీరాం నినాదాలున్న స్టిక్కర్లను, ప్రత్యేకించి హనుమంతుడి స్టిక్కర్లను, కాషాయ జెండాలను, టోపీలను కూడా పంపిణీ చేస్తున్నారు పలుచోట్ల…
నార్త్ ఇండియాలో ఎక్కువగా రామచరితమానస్, హనుమాన్ చాలీసా, సుందరకాండ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు… దాంతో డిమాండ్ బాగా పెరిగిపోయింది… ప్రత్యేకించి రామచరితమానస్ పుస్తకాన్ని ఒక ‘ప్రసాదం’లాగా పంచుతున్నారు… మామూలు రోజుల్లో ఈ పుస్తకాన్ని ఇదే గీతాప్రెస్ 15 భాషల్లో ప్రింట్ చేసి 2500 బుక్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అమ్ముతూ ఉంటుంది… మొత్తానికి అయోధ్య ఉత్సవం దేశంలో మునుపెన్నడూ లేని ఓ ఆధ్యాత్మిక జోష్ క్రియేట్ చేస్తోంది…
Share this Article