మహేశ్ బాబు చెప్పిందీ అబ్సర్డ్‌గానే ఉంది… సోషల్ మీడియా, మీడియా దాన్ని రాస్తున్న తీరూ అలాగే ఉంది… తనేమన్నాడు… ‘‘నెక్కిలీసు, కుర్చీ మడతపెట్టి సాంగ్స్ రెండూ సినిమాల్లో ఉండాలని ముందే అనుకున్నాం… నా కెరీర్ బెస్ట్ డాన్స్ కంపోజ్ చేయాలని శేఖర్ మాస్టర్‌కు చెప్పాం… ముందుగా శ్రీలీల పక్కన మ్యాచయ్యేలా ఆ స్టెప్పులు వస్తాయా అనుకున్నాం గానీ, చివరకు అనుకున్నట్టే బాగా వచ్చింది… ఎందుకంటే, మళ్లీ ఇప్పట్లో తెలుగు సినిమాల్లో అలా చేసే చాన్స్ వస్తుందో రాదో…’’
ఇదీ తన మాటల సారాంశం… అంటే తన ఉద్దేశం… అలాంటి డాన్సులు చేసే సాంగ్స్ ఉండే సినిమా వస్తుందో రాదో అని… యాంకర్ సుమ ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది… ఇక మహేశ్ బాబు వ్యాఖ్యల్ని ఎడాపెడా రాసేస్తున్నారు అందరూ… ఇలా…
‘‘గుంటూరుకారం తన చివరి సినిమా అని మహేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇక మహేశ్ బాబు తెలుగు సినిమాలు చేయబోవడం లేదు… ఇదే తన ఆఖరి సినిమా అని మహేశ్ బాబు ప్రకటించేశాడు…’ యూట్యూబ్ చానెళ్లను, సినిమా సైట్లను వదిలేయండి, చివరికి ఆచితూచి కవర్ చేయాల్సిన మెయిన్ స్ట్రీమ్ మీడియా బాపతు సైట్లు కూడా అలాగే థంబ్ నెయిల్స్ పెట్టి రాసేశాయి, స్తున్నాయి…
Ads
ఎస్… మహేశ్ బాబు రాబోయే రెండుమూడేళ్లు రాజమౌళి సినిమాకే అంకితం చేయాల్సి వస్తుంది… ఒకసారి రాజమౌళి సినిమా షూటింగ్ మొదలైతే ఇక తను మరో సినిమా షూటింగుకు వెళ్లనివ్వడు… అది ముందుగానే ఒప్పందాల్లో ఉంటుంది… ఈసారి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా చేస్తానంటున్నాడు కదా, పర్‌ఫెక్షనిస్టు… సో, అదెప్పుడు పూర్తవుతుందో చెప్పలేరు ఎవరూ…
ఇప్పటికే తనకు 48 ఏళ్లు… ఇంకా ఆ తరువాత ఇలా రగ్గడ్ స్టెప్పులు వేసే మాస్ పాత్ర చేస్తానో లేదో, సో, ఇలాంటి స్టెప్పుల్ని వేస్తానో లేదో, అందుకే ఇప్పుడు రెండు పాటల్లో కుమ్మేయాలని అనుకున్నాం అనేది మహేశ్ బాబు ఉద్దేశం… అంతే తప్ప ఇక తెలుగు సినిమాలు చేయను అని కాదు… పోనీ, రాజమౌళి సినిమా తరువాత కేవలం పాన్ ఇండియా సినిమాలే తప్ప తెలుగు సినిమాలు చేయలేకపోవచ్చు అనే విశ్లేషణలూ నిజమే అనుకుందాం కాసేపు ఫర్ డిస్కషన్ సేక్…
అదీ కరెక్టు కాదు… రాజమౌళి సినిమా తన మార్కెటింగ్ తెలివితేటల పుణ్యమాని ఎక్కడికో తీసుకుపోతాడు, తన ట్రాక్ రికార్డ్ అది… అవసరమైతే మళ్లీ ఆస్కార్ వైపు లాబీయింగులు మళ్లీ చేస్తాడు… కానీ తరువాత పాన్ ఇండియా మాత్రమే చేస్తాడు మహేశ్, తెలుగు సినిమాలు చేయడు అనేది రాంగ్ విశ్లేషణ… పాన్ ఇండియా అంటే తెలుగు సినిమా ఉండదా అందులో..? తనేమీ బాలీవుడ్‌కు మారిపోడుగా… తెలుగులో తీసి, ఇతర భాషల్లోకి డబ్ చేయడమే కదా ‘తెలుగు పాన్ ఇండియా’ సినిమా అంటే… సో, ఆ కోణంలో చూసినా తెలుగు సినిమా చేయడు అనేది తప్పదు…
ఏమో, మళ్లీ కావాలని తెలుగులో గుంటూరుకారం వంటి మరో మసాలా సినిమా చేయాల్సి వస్తుందేమో… శ్రీలీల కాకపోతే మరో లీల ఎవరితోనో ఇదే శేఖర్ మాస్టర్ గెంతులు వేయించాల్సిన పనిపడొచ్చు… ఎందుకంటే రాజమౌళి సినిమా తరువాత ఆ హీరోలకు ఓ విచిత్రమైన గ్యాప్ వస్తుంది… ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాదు, జనం ఏ సినిమా పడితే ఆ సినిమా రిసీవ్ చేసుకోరు… సో, పాన్ ఇండియా సినిమా తీసినా సరే, తెలుగు ఆత్మతో మాత్రమే తీయాలి…
పైగా ఆ సినిమాలకూ తెలుగు మార్కెట్ ప్రాణంగా ఉంటుంది… ప్రభాస్ బాహుబలి తరువాత సాహో సేమ్ పాన్ ఇండియా… కానీ హిందీ, తెలుగులో తప్ప ఇంకెక్కడా పెద్దగా ఆడలేదు… రాధేశ్యాం, ఆదిపురుష్ డిజాస్టర్ల గురించి చెప్పనక్కర్లేదు… సలార్‌తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు… రానా అయితే వెబ్ బూతు సీరీసులు చేసుకుంటున్నాడు… రాంచరణ్‌కు మళ్లీ ఇప్పటికి ఆ రేంజ్ సినిమా పడలేదు, శంకర్ సినిమా చూడాలిక… జూనియర్ ఎన్టీయార్ సినిమా లేదు ఇప్పటికి… సోకాల్డ్ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయినా సరే, తెలుగు మార్కెటే వాటికి ప్రాణం…
పుష్ప తరువాత బన్నీ ఏం సినిమా తీస్తాడో చూడాల్సి ఉంది… కార్తికేయ-2 తరువాత నిఖిల్ ఏదో సినిమా చేస్తే ఢమాల్ అనేసింది… సో, పాన్ ఇండియా తరువాత ఏమిటనేది పెద్ద క్వశ్చన్ మార్క్… కాపాడేది మళ్లీ తెలుగే… తాజా ఉదాహరణ… హనుమాన్… దాని విజయానికి కారణాలు అనేకం… తెలుగు, హిందీల్లో తప్ప ఇంకెక్కడా అది ఆడటం లేదు, తరువాత ఈ రేంజ్ సినిమా చేయడం తేజ స్టామినాకు కష్టం… సో, మహేశ్ బాబు మళ్లీ మాస్ స్టెప్పులు, ఐటమ్ సాంగ్స్ చేయాల్సిన తెలుగు సినిమా చేస్తానో లేదో అనే భావన కూడా కరెక్టు కాదు… కాలం తేలుస్తుంది..!!
Share this Article