Jagannadh Goud…… అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నాడు. ఎగిరెగిరి దంచినా, ఎగరకుండా దంచినా చివరికి ఒకటే అని ఒక ముతక సామెత. ఇది ఇంతకాలం ఎగిరెగిరి పడిన రామస్వామికి కరక్ట్ గా సరిపోతుంది. అయితే అమెరికా లో వచ్చే నవంబర్ లో ఎన్నికలు జరగబోతున్నై (నవంబర్ 2024). ఇక్కడ ప్రధానం గా డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఉన్నై. రిపబ్లికన్ పార్టీ నుంచి ఎక్కువ ప్రెసిడెంట్ అభ్యర్ధులు ఉండగా వాళ్ళలో వాళ్ళకి రాష్ట్రాల వారిగా వాళ్ళ పార్టీ అభ్యర్ధులు వోట్ వేసి ఫైనల్ గా ఒకర్ని తమ పార్టీ నుంచి అధ్యక్ష బరిలోకి పంపుతారు.
డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఒక్కరే వస్తున్నట్లు ఉంది కాబట్టి వాళ్ళ క్యాండిడేట్ పేరు ఎన్నికల ముందు బయటికి వస్తుంది.ఒకవేళ డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఎక్కువ అభ్యర్ధులు ఉంటే ఆయా అభ్యర్ధుల రాష్ట్రాల్లో పోటీ లొ ఉన్న వారికి వచ్చిన సొంత పార్టీ వోట్స్ ఆధారం గా ఒక్కరిని ఫైనల్ గా అధ్యక్ష బరిలోకి పంపుతారు (డెమొక్రాటిక్ పార్టీ లో కూడా ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్ భైడెన్ తో పాటు ఇంకో ఇద్దరు ఆసక్తి చూపుతున్నారు: మేరియానా విలియం సన్, డీన్ ఫిలిప్స్ – మిగతా ఇద్దరూ డ్రాప్ కాకుంటే వీళ్ళలో కూడా సొంత డెమోక్రాటిక్ పార్టీ లో ఎన్నికలు పెట్టి ఒకర్ని ఫైనల్ చేస్తారు)
Share this Article
Ads