రాజకీయం అంటే డబ్బుతో పని… ఎన్నికలంటే డబ్బుతో పని… గెలుపు గుర్రాల పేరిట పార్టీలు అంగబలం, అర్థబలం ఉన్న బలాలూ బలగాలూ లెక్కలేసి బరిలో దింపే రోజులివి… ప్రతి సీటూ ప్రతిష్ఠాత్మకమే ఈరోజుల్లో… దేన్నీ తేలికగా తీసుకునే సీన్ లేదు… ఏపీలోనే కాదు, ఎక్కడైనా ఇదే స్థితి…
పర్లేదు, మనవాడే కదా, మనల్ని నమ్ముకుని ఉన్నవాడే కదా, మనతో నడుస్తున్నవాడే కదా, మనకు విధేయుడు కదా అని టికెట్లు ఇచ్చే సిట్యుయేషన్ లేదు… సిట్టింగులు ఎలా ఉన్నా, జనంలో వ్యతిరేకత ఉన్నా సరే టికెట్లు ఇస్తే కేసీయార్‌లా కొంప మునిగిపోవడం ఖాయం… జగన్‌కు అది ఓ పాఠం నేర్పింది… సర్వేలతో జనాభిప్రాయం తెలుసుకుంటూ ఎడాపెడా మార్చేస్తున్నాడు… అది తన వ్యూహం, లాభనష్టాలకు తనదే బాధ్యత, తప్పుపట్టడానికీ ఏమీ లేదు…
కానీ కొన్నిసార్లు జగన్ నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి… తను టిక్ పెట్టే పేర్లు మొదట విస్తుపరుస్తాయి… ఏమిటీ జగన్ మొండితనం, ధైర్యం అనుకునేలా చేస్తాయి… నేను గెలిపించుకుంటాను కదా అనేది జగన్ ధీమా కావచ్చు, కానీ కొన్ని సీట్లపై తన నిర్ణయాలు, నమ్మకాలు భలే అనిపిస్తాయి… గెలుపో ఓటమో జానేదేవ్… ఇలాంటివి సగటు మనిషి కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ కావాలి… ఆ సీటు పేరు మడకశిర… అనంతపురం జిల్లా…
Ads
ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గం… అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని జగన్ మార్చేశాడు… సరే, తన కారణాలు తనకున్నయ్… ఆ ప్లేసులో ఎవరికీ పెద్దగా తెలియని ఈర లక్కప్ప అనే ఓ సాధారణ వ్యక్తిని ఇంఛార్జ్ గా నియమించాడు… దీంతో అసలు ఈ ఈర లక్కప్ప ఎవరని ఆరా తీయటం మొదలు పెట్టారందరూ… అప్పుడు వెలుగులోకి వచ్చాయి కొన్ని వాస్తవాలు…
ఈర లక్కప్ప మాజీ సర్పంచ్. లక్కప్ప స్వగ్రామం గుడిబండ మండలం పలారం. తండ్రి దివంగత లక్కప్పది సాధారణ వ్యవసాయ రైతు కుటుంబం… ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు… లక్కప్పకు మద్దతుగా 74 మంది పంచాయతీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మద్దతుగా నిలిచారు. టికెట్ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు…
ప్రతీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తూ సామాన్యుడిలా అందరితోనూ కలిసిపోయే ఈర లక్కప్ప ఎంపిక ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది. లక్కప్పకు ఉన్నది స్థానికంగా మద్దతు మాత్రమే. ఇక్కడ మరో విషయం ఏంటంటే సీటు కోసం లక్కప్ప ఏనాడు సీఎంను కలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న కార్యకర్త…
జగన్ లెక్కల్లో ఎక్కడో లక్కప్ప పేరు క్లిక్కయింది… ఇంకేం, టికెట్టు ఒడిలో వాలబోతోంది… గుడ్… ఈసారి అభ్యర్దుల ఖరారులో పార్టీలో కింది స్థాయిలో పని చేసిన నలుగురు జెడ్పీటీసీలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా జగన్ అవకాశం ఇవ్వబోతున్నాడు… ఇంట్రస్టింగు,..
Share this Article