Priyadarshini Krishna ………. OTT movies report of the month
1. Indian Police Force- by Rohith Shetti – బడ్జెట్ ఫుల్, ఎఫెక్ట్ నిల్… టైం వేస్ట్… ఇంక వేరే option లేదంటే టైంపాస్ కి చూడొచ్చు…
Ads
2. Devil- కళ్యాణ్ రామ్ నటించిన సినిమా చాలా మంది చూసి వుండరు. సర్‌ప్రైసింగ్లీ బావుంది… నాకు నచ్చింది. చాలా మైండ్‌లెస్ సినిమాలకంటే బెటర్‌గా వుంది. చూడొచ్చు.
3. కోటబొమ్మాళి- శ్రీకాంత్ నటించిన ఈ రీమేక్ ఇప్పటికే అందరూ చూసివుంటారు. మళయాళంలో కూడా ఇప్పటికే అందరూ చూసే వుంటారు. చూడనివారు చూడొచ్చు. ఓకే ఓకే..
4. సహస్ర కాలింగ్- సుడిగాలి సుధీర్ నటించిన ఈ సినిమా ఇంకేం పనిలేదు, సబ్‌స్క్రిప్షన్ కట్టాం కదా అనుకుంటే చూడండి.. నాకైతే నచ్చలేదు..
5. My name is Shruthi- హన్సిక నటించిన ఈ క్రైం సస్పెన్స్ ఓకే ఓకే… టూ మెనీ విషయాలు పెట్టారు… స్క్రీన్‌ప్లే గందరగోళం చేసారు… అదే వారి కొత్తదనం అయుంటుంది… ఇది కూడా టైం పాస్, ఇంత వేరే పనేం లేదు కళ్ళునొప్పులు తెచ్చుకోడానికి అనుకుంటే చూడండి…
6. సర్కారు నౌకరీ- సింగర్ సునీత కొడుకు నటించిన సర్కార్ నౌకరీ గురించి గొప్పగొప్పోళ్ళు చాలా రాశారు. అవన్నీ విని చూడాలని అనుకుంటే మీ ఇష్టం. శుద్ధ వేస్టాఫ్ టైం…
7. ట్రూ- మాదాల సత్యం డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2021 లోనిదే ఐనా నాకు నిన్నే కనపడింది. స్టోరీ పరంగా బాగుంది. స్క్రీన్‌ప్లే డైరెక్షన్ చాలా తడపడ్డాడు. ఓవరాల్‌గా బాగానే ఉంది. ఓపిక వుంటే చూడండి…
8. ట్రయల్- రాం గని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. అటు A content లేదు, అలాగని మనం చూసి, పోన్లే, మంచి సినిమా అనుకునేలాంటి సినిమా కూడా కాదు. టైం పాస్ అంతకంటే కాదు..
*******
ఎందుకమ్మా, ఈ పనికిమాలిన సినిమాల రివ్యూలు మాకు అంటారా… నాకు అదో తుత్తి. చిన్న సినిమాలు చూడరు, ప్రోత్సహించరు అని గుండెలు బాదుకునే వారి కోసం ఇదంతా… చాల్లేవమ్మా అసలు తెలుగంటేనే వేస్టు అంటారా… సరే, పోయి మాడిపోయిన మళయాలం, పాచిపోయిన తమిళం సినిమాలు చూసుకోండి…
Edit: అన్నట్లు…. కన్నడ సినిమా ‘స్వాతి ముత్తిన మాలే హనియే’ గురించి, హిందీ ‘Three of Us’ గురించి డిటైల్‌గా రాస్తాను. అవి కూడా వేస్టాఫ్ టైం సినిమాలే కానీ మేథావివర్గం వాటిని ఆహా ఓహో అంటుంటే నా వ్యూ ఏదో రాయాలని వుంది…
Share this Article