50 ఏళ్ల క్రితం… అర్ధరాత్రి, రహస్యంగా, ఒక అభిరామదాస్ ఆ కట్టడంలోకి రామ్‌లల్లాను తీసుకెళ్లిన క్షణం నుంచి… నిన్నటి ప్రాణప్రతిష్ఠ దాకా… ఎందరో అయోధ్య ఉద్యమంలో అసువులు బాశారు… కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు అన్నీ… సమీపచరిత్రలో యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించిన మొదటి హిందూ ఆధ్యాత్మిక సంబరం నిన్న…
ఎవడు ఏడ్చినా, ఎవడు శాపనార్థాలు పెట్టినా, ఎవడు కుళ్లుకున్నా సరే… దాదాపు ప్రతిచోటా హిందూ సమాజం నిన్న పండుగ చేసుకుంది… నాట్యాలు, దీపాలు, పూజలు, ముగ్గులు, నినాదాలు, ఓ ఉత్సవ వాతావరణం… కానీ ఒక్కటే అందరిలోనూ కలుక్కుమనే చిన్న సంగతి… ఇంత పెద్ద సందర్భంలో అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది… కానీ నిజం నిజమే…
స్థూలంగా చూస్తే, అంతటి భారీ భవ్యమందిర చరిత్రలో అద్వానీ ఒక ఇటుక మాత్రమే కావచ్చుగాక… కానీ జ్వాలను రగిలించింది తనే… సేనానిగా దండు నడిపించింది తనే… రాముడి గుడి నా జాతి ఆకాంక్ష అని బలంగా ప్రపంచానికి చాటింది తనే… అద్వానీ అంటే ఓ ఇగ్నిషన్… కానీ ఏడీ, ఎక్కడ… ఎవరు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారనేది పక్కన పెడదాం… కన్నీళ్లతో ఆ ప్రాణప్రతిష్ఠను తాదాత్మ్యతతో గమనించే అద్వానీని ఆ వేడుకలో చూడలేకపోవడం ఒక మరక…
Ads
కాషాయ శిబిరం ఎన్ని కారణాలను చెప్పుకున్నా సరే… అద్వానీ అక్కడ లేకపోవడం ములుకులా గుచ్చుకునేదే… ఆ రథయాత్ర సేనాని ఎక్కడ..? తన వెంట సహాయకుడిగా నిలిచిన మోడీ తనే ప్రాణప్రతిష్ఠ చేయడం ఏమిటి..? అదే సేనాని అజ్ఞాతంలో టీవీలో వేడుక చూస్తూ కన్నీళ్లు పెట్టుకునే దృశ్యం ఎక్కడ..? ఎస్, దీన్నే డెస్టినీ అంటామేమో… ఏమో, ఆ అద్వానీయే వైరాగ్యంతో చెప్పినట్టు… ఆ రాముడే తన ప్రధాన కర్తను ఎంచుకున్నాడేమో…!
సమర్థన కారణాలెన్నున్నా అంగీకరిద్దాం… ఎలాగంటే..? ప్రాణప్రతిష్ఠ వంటి అరుదైన భాగ్యాన్ని ఎవరు వద్దనుకుంటారు..? అన్నీ తానై వేడుకలు జరిపించిన యోగికి లేదా ఆ కోరిక..? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌కు లేదా ఆ కోరిక..? ఆ ట్రస్టు చైర్మన్‌కు లేదా ఆ కోరిక..? అయోధ్య కమిట్మెంట్ ఉన్న ప్రతి హిందువుకూ ఉన్న కోరికే… మరి మోడీకే ఎందుకు దక్కింది..? ఇదీ ప్రశ్న…
- తను పాలక స్థానంలో ఉన్నాడు… అది అల్టిమేట్ రీజన్… 2. ఒకసారి మోడీ పేరు రాగానే మిగతా వారంతా సైలెంట్… 3. ట్రస్టు, ఆర్ఎస్ఎస్, ఆచార్యగణం, సాధుగణం, రాజకీయం అన్నీ అనివార్యంగా ఆమోదించాల్సి వచ్చింది… 4. మత ఆచరణలో తను సన్యాసి… 5. అయోధ్య ఉద్యమకారుడు… 6. తన పాలనకాలంలోనే తీవ్ర అడ్డంకులన్నీ తొలగిపోయాయి…
కాషాయశిబిరంలో ప్రస్తుతం అద్వానీ ఏ పొజిషన్‌లోనూ లేడు, తను వానప్రస్థంలో ఉన్నాడు, పగ్గాల్ని తన తరువాత తరం తీసేసుకుంది… అయోధ్యకు తను వెళ్తే, ఆహ్వానిస్తే రామ వ్యతిరేకుల కువిమర్శలకు ఓ చాన్స్ ఇచ్చినట్టవుతుంది…. ఇదుగో, ఇన్ని కారణాలు చెప్పింది కాషాయశిబిరం… అబ్బే, వీహెచ్ఫీ ఆహ్వానించింది, ప్రత్యేక ఫ్లయిట్ పెడుతున్నారు అని ఏవేవో కథలు చెప్పారు గానీ అవన్నీ ఏమీ లేవు…
అద్వానీకి అవమానం, అగౌరవం అనే పెద్ద మాటలు కావు గానీ… తనను ట్రస్టే సగౌరవంగా తోడ్కొని రావల్సింది… ఓ చిన్న ఎన్‌క్లోజర్‌లో ఈ వేడుకకు ప్రత్యక్ష సాక్షిగా కూర్చోబెట్టాల్సింది… మరొక్క మాట… ఈరోజు వాజపేయి గనుక బతికి ఉండి ఉంటే. ఆరోగ్యం సహకరిస్తూ ఉండి ఉంటే… కథ వేరుగా ఉండేదేమో…! ప్రాణప్రతిష్ఠకు ప్రధానకర్తగా మోడీ ఉండేవాడా అనేది పెద్ద ప్రశ్న…!!
Share this Article