కనిపించడు గానీ మహానుభావుడు… కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య… హిందూ అనే పదం విన్నా, గుడి అనే పదం విన్నా పరమ చిరాకు మనిషికి… రాముడు అంటే మరీనూ… ఊచకోతల ఆ టిప్పు సుల్తాన్ అంటే కూడా మహాప్రీతి…
ఈమధ్య చికమగులూరు జిల్లా యంత్రాంగం ఓ చిత్రమైన నోటీసులు జారీ చేసింది… ఎవరికి..? గుళ్లలో పూజారులకు… ఏమనీ అంటే..? మీరు పూజలు చేస్తున్న గుళ్లల్లో ఆదాయం లేదు, సో, పదేళ్లలో మీకు ఇచ్చిన జీతం మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమకట్టండి అని… రామదాసును జైలులో పారేసిన గోల్కొండ తానీషా కూడా సిగ్గుపడేవాడేమో ఇది తెలిస్తే…
కన్నడలో రాముడి పూజలు చేస్తాడు ఓ పూజారి హిరేమగులూరు కన్నన్… ఆయన ఇలాంటి నోటీసే వచ్చింది… ఇంకొందరికీ వచ్చాయి… ఆయనకు ఇచ్చేది ఈ సోకాల్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్టు లక్షలు కాదు సుమా… నెలకు ముష్టి 4500… ఇలా పదేళ్లలో 4.74 లక్షలు ఇచ్చారట ఫాఫం… ఆ ఊరి శివారులోని కల్యాణ కోదండరాముడి గుడిలో 50 ఏళ్లుగా పూజలు చేస్తున్నాడాయన…
Ads
(చికమగుళూరు రాముడి గుడి)
అంతకుముందు పది వేలు ఇచ్చేవాళ్లు ఆయనకు… కానీ గుడికి భక్తులు రావడం లేదట, ఆదాయం రావడం లేదట,,. దాంతో పదేళ్ల క్రితం ఆ జీతాన్ని 4500 కు కోసేశారు… వాళ్లకు పీఆర్సీలు ఉండవు కదా, పైగా రెవిన్యూను బట్టి జీతం పద్ధతాయె… పాపం ఆ రాముడి దర్శనానికి భక్తులు రాకపోతే తనేం చేస్తాడు..? నో, సిద్ధరామయ్యకు అవన్నీ పట్టవు… కడతావా, రామదాసులాగే నిన్నూ జైలులో పారేయమంటావా అన్నట్టు మొండిగా ఉన్నాడు…
ఇంకో కేసు… ఇది మరీ చిత్రం… అయోధ్య రాముడంటేనే కాంగ్రెస్‌కు చిరాకు, పైగా ఈ సిద్ధరామయ్య మరీ వీర ఘోర క్రూర సెక్యులర్ కదా… నటరాజ్ శ్రీనివాస్ అనే చిన్న కంట్రాక్టరుకు 80 వేల జరిమానా వేసింది ఆయన ప్రభుత్వం… కారణమేమిటయ్యా అంటే… ఆయనకు మైసూరు సమీపంలోని గుజ్జెగౌడనపూర అనే గ్రామంలోని హెచ్‌రామదాసు అనే దళిత రైతు ఓ పని అప్పగించాడు… తన 2.14 ఎకరాల భూమిని సాగుయోగ్యం చేసుకుంటాననీ, రాళ్లను తొలగించాలని కంట్రాక్టు…
ఆ రాళ్లను తీస్తుంటే ఓ నల్ల రాయి బయల్పడింది… అది వందల ఏళ్ల నాటి కృష్ణ శిల… శిల్పాల తయారీకి మేలిమిబంగారం అది… బాలరాముడి విగ్రహం చెక్కడం కోసం అయోధ్య ట్రస్టు అరుణ్ యోగిరాజ్ అనే శిల్పికి బాధ్యత ఇచ్చింది కదా… ఆయన ఈ శిలను చూసి, నా బాలరాముడికి ఈ శిలే కరెక్టు అనుకుని సదరు నటరాజ్ శ్రీనివాస్ నుంచి ఎంతోకొంతకు కొనుక్కున్నాడు… ఆ పెద్ద శిలను మూడు ముక్కలు చేశారు… ఆ దళిత రైతు కూడా సంతోషించాడే తప్ప అభ్యంతరం చెప్పలేదు…
కానీ సిద్ధరామయ్య ప్రభుత్వానికి రాముడి పేరు అంటేనే చిరాకు, పైగా ఆ అయోధ్య రాముడికి కావల్సిన శిల… ఇంకేముంది..? ప్రైవేటు భూమిలో మైనింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ మైనింగ్ శాఖ ఆ నటరాజ్ శ్రీనివాస్‌కు 80 వేల పెనాల్టీ వేసింది… ఇక్కడ ప్రభుత్వానికి వచ్చిన తల్నొప్పి ఏమిటి..? ఆ రైతే ఆ కంట్రాక్టు ఇచ్చాడు, ఆ శిలను ఏం చేసుకోవాలనేది తన ఇష్టం… మా సెక్యులర్ ముఖ్యమంత్రి సాక్షాత్తూ ఆ బాబర్‌కు ఏ తరంలోనో చుట్టం అయి ఉంటాడు అని కాషాయశిబిరం సెటైర్లు వేస్తోంది సిద్ధరామయ్య మీద…
(nataraj srinivas)
అవునూ, ఆ కృష్ణ శిల నుంచి బాలరాముడి చిన్న విగ్రహాన్ని చెక్కాడు కదా… మరి మిగతా ముక్కలు ఏమయ్యాయి అంటారా..? హనుమంతుడితో కూడిన సీతారామలక్ష్మణ విగ్రహాలను విడిగా చెక్కాడు ఇలా…
Share this Article