నో డౌట్… ఇండియన్ టీవీ తెరలపై సినిమా సంగీత ప్రియులను బాగా ఆకర్షించేది, అలరించేది ఇండియన్ ఐడల్ షో… సరే, దాని నిర్వహణలో టీఆర్పీల కోసం కొన్ని వేషాలు వేస్తుంటారు నిర్వాహకులు… ఐనా సరే, ఇతర భాషల్లో వచ్చే బోలెడు ప్రోగ్రామ్స్‌తో పోలిస్తే ఇండియన్ ఐడల్ షో బెటర్… కంటెస్టెంట్ల ఎంపిక, ఆర్కెస్ట్రా, జడ్జిల ఎంపిక, హోస్ట్, ఏ అంశం తీసుకున్నా అది సోనీ స్టాండర్డ్‌కు తగినట్టే…
ప్రస్తుతం 14వ సీజన్ నడుస్తోంది… ఆసక్తికరంగా, వీనులవిందుగా ఉంది… నేహా కక్కర్ స్థానంలో శ్రేయో ఘోషాల్ ఒక జడ్జిగా వచ్చింది… మరో జడ్జి విశాల్ దడ్లానీ సేమ్… హోస్ట్ ఆదిత్య నారాయణ్ ప్లేసులో హుసేన్ కువజేర్వాలా వచ్చాడు… ఇక హిమేష్ బదులు కుమార్ సాను జడ్జి స్థానంలోకి వచ్చాడు… కానీ సౌత్ ఇండియా నుంచి ఒక్కరే… మొదటి వారమే ఎలిమినేటెడ్… కొచ్చి సింగర్…
అదే మనం చెప్పుకోబోయేది… 13 వ సీజన్‌లో ఎవరూ సౌత్ సింగర్స్ లేరు… 12 వ సీజన్‌లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు మన తెలుగు వాళ్లు… ఇద్దరూ వైజాగ్ నుంచే షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల (ఈమె సోదరి సౌజన్య తెలుగు ఇండియన్ ఐడల్ గత సీజన్ విజేత)… నిజానికి షణ్ముఖప్రియ బలమైన పోటీ ఇచ్చింది గానీ నార్త్ ఇండియన్ నెటిజన్ల నెగెటివిటీ కారణంగా ఆరో ప్లేసులో నిలబడాల్సి వచ్చింది…
Ads
10, 11వ సీజన్లలో సౌత్ సింగర్స్ లేరు… 9వ సీజన్ మళ్లీ మన తెలుగు వాళ్లకు కాస్త నయం… రేవంత్ విన్నర్ కాగా, రోహిత్ సెకండ్ రన్నరప్… జూనియర్స్ సీజన్2 లో ముగ్గురు, సీజన్1లో ఒక్కరు సౌత్ ఇండియన్స్… సీజన్1 విజేత కూడా… 6వ సీజన్‌లో సౌత్ కంట్రిబ్యూషన్ లేదు… 5వ సీజన్‌లో మన శ్రీరామచంద్ర విన్నర్… 2వ సీజన్‌లో మన కారుణ్య ఫస్ట్ రన్నరప్… ఫస్ట్ సీజన్‌లో ఒకరే సౌత్ సింగర్…
సో, మొత్తం 14 సీజన్లకు గాను మొత్తం సౌత్ నుంచి పాల్గొన్నది కేవలం 12 మంది… అందులో ఆరుగురు మన తెలుగువాళ్లే… ఇంట్రస్టింగు… మన సౌత్ వాళ్లు హిందీని ఓన్ చేసుకోరు ఎక్కువగా.., మన దక్షిణ యాస (సాంబార్ యాస)ను హిందీ శ్రోతలు కూడా పెద్దగా ఓన్ చేసుకోరు… అంతటి ఎస్పీ బాలుయే భారీ వివక్షను ఎదుర్కున్నాడు… ఇదేకాదు, హిందీ ఇండస్ట్రీకి మన హీరోయిన్లు మాత్రమే కావాలి… కానీ మన సింగర్స్, మన హీరోలు అవసరం లేదు… రానివ్వరు…
ఇతర దక్షిణ రాష్ట్రాలతో పోలిస్తే, మరీ ప్రత్యేకించి కేరళ, తమిళనాడులతో పోలిస్తే మన తెలుగువాళ్లు నయం… అచ్చంగా హిందీని ఔపోసన పట్టి, అచ్చం హిందీ సింగర్లలాగే పాడుతూ, హిందీ మాతృభాష కలిగిన సింగర్లకు మంచి పోటీ ఇస్తారు… కేరళ, తమిళనాడుల్లో హిందీ ద్వేషం ఎక్కువ… వాళ్లంటే హిందీ శ్రోతలకూ అంతే… ఇప్పుడు కర్నాటక కూడా సేమ్ బాట… ఎటొచ్చీ మన హైదరాబాద్, మన వైజాగ్ కాస్త భిన్నం… మనవాళ్లలో కల్పన వంటి మంచి విద్వత్తు ఉన్న సింగర్స్ కూడా ఇండియన్ ఐడల్ జోలికి ఎందుకు పోలేదో అర్థం కాదు… ఏమో, ప్రయత్నించీ ఫెయిలయ్యారేమో కూడా…!!
Share this Article