Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Quake Proof… భూకంపాలొచ్చినా చెక్కుచెదరని అయోధ్య కట్టడ దృఢత్వం…

January 28, 2024 by M S R

భారతీయ ఆలయ నిర్మాణ పరిజ్ఞానం అపూర్వం అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు… వాస్తు, శిల్ప కళలే కాదు, ప్రకృతి విపత్తులను తట్టుకునే పరిజ్ఞానం ఇప్పటికీ అబ్బురమే… ఒక్క ఉదాహరణ చెప్పుకుని మనం అయోధ్య వార్తలోకి వెళ్దాం… వేయి స్తంభాల గుడి పునాదుల్ని సాండ్ బాక్స్ పద్దతిలో నిర్మించిన తీరు ఇంకెక్కడా మనం చూడలేం… ఎన్నో ఆలయాలు ఎన్నెన్నో విశిష్టతలు… వింతలు…

అయోధ్య విషయానికి వస్తే… శ్రీరామనవమి ఉదయమే సూర్యుడి కిరాణాలు ఏకంగా బాలరాముడి నొసటన తిలకమై మెరుస్తాయని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయం కూడా తీసుకున్నారని మనం వార్తల్లో చదివాం… కాకపోతే ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయ్యాక ఆ విశేషం మన కళ్లముందుకొస్తుంది… రాముడు సూర్యవంశ తిలకుడు కదా… అందుకే ఆ తిలకానికి సూర్యకిరణాల ప్రభ అన్నమాట…

తాజా వార్త ఏమిటంటే… CSIR-Central Building Research Institute (CSIR-CBRI) అని రూర్కీలోని సంస్థ… అది అయోధ్య గుడి నిర్మాణాన్ని పలు సాంకేతిక కోణాల్లో సైంటిఫిక్ స్టడీ చేసింది… అందులో తేలిందేమిటయ్యా అంటే… 2500 ఏళ్లకు ఒకసారి వచ్చే భారీ భూకంపం స్థాయిని కూడా అయోధ్య గుడి తట్టుకుంటుందట… అంత దృఢత్వం సంతరించుకున్నదట… ఏ సాధువో, ఏ సంఘీయో చెప్పడం లేదయ్యా… సాంకేతిక విజ్ఙాన సంస్థకు చెందిన సైంటిస్టులు చెబుతున్నారు…

Ads

India Tv - Ram Temple

అనేకరకాల స్టడీస్‌లో geophysical characterisation, geotechnical analysis, foundation design vetting, 3D structural analysis and design, structural safety వంటివెన్నో కోణాలున్నయ్… ఈ సంస్థ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, తరువాత ఆయన వారసుడు గోపాలకృష్ణన్ నేతృత్వంలో Centre of Excellence for Conservation of Heritage Structures విభాగానికి చెందిన సీనియర్ సైంటిస్టులు దేవదత్త ఘోష్, మనోజిత్ సమంత ఈ స్టడీస్ నిర్వహించారు…

India Tv - Ram Temple

దీనికి ఏయే రకాల సాంకేతికాంశాలను పరిగణనలోకి తీసుకున్నారనే డీప్ టెక్నికల్ టరమ్స్‌లోకి పోకుండా మనం చెప్పుకునేది ఏమిటంటే… ఈ దృఢమైన కట్టడం అత్యంత భారీ భూకంపాలను కూడా తట్టుకోగలదు అని..! ఇక్కడ గుర్తు చేసేది మరొకటుంది… ఈ గుడి నిర్మాణంలో అస్సలు ఇనుము వాడలేదు… ఐనా ఈ రేంజ్ దృఢత్వాన్ని ఆ గుడి నిర్మాణంలో సాధించారంటే… హేట్సాఫ్ టు కన్‌స్ట్రక్షన్ డిజైనర్స్… ఎల్అండ్‌టీ సంస్థ కదా కట్టింది… గుడ్…

India Tv - Ram Temple

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions