ముందుగా షర్మిల మాటల మంటలు ఓసారి చూడండి… ‘‘కడప జిల్లా నాకు పుట్టిల్లు – వైఎస్సార్, జగన్ పుట్టిన జమ్మలమడుగు ఆసుపత్రిలోనే నేనూ పుట్టాను – వైసీపీ ఉనికి పోతుందనుకున్న రోజుల్లో ఆ భారం అంతా నా భుజన వేసుకుని మోశాను – అలాంటి పార్టీలో ఎదిగిన నేతలు వ్యక్తిగతంగా నాపై దాడి చేస్తున్నారు –
నాకు పదవీ కాంక్ష ఉంటే.. మీ కోసం పాదయాత్రలు ఎందుకు చేస్తా? – నాకు సీఎం పదవి కావాలని నా భర్త అడిగినట్లు మీరు నిరూపిస్తారా? – భారతీరెడ్డితో కలిసే అనిల్ వెళ్లి కాంగ్రెస్ నేతలను కలిశారు – నాకు పదవి కావాలని అడిగినట్లు భారతీరెడ్డితో చెప్పిస్తారా? – మీ జోకర్లతో నన్ను తిట్టిస్తే ఏమొస్తుంది? –
సాక్షి మీడియా నా మీద రెచ్చగొట్టే పనులు చేయిస్తోంది – తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వారికి ఫోన్లు చేసి, మీరు మాట్లాడండి.. మేము కవరేజీ ఇస్తామని రెచ్చగొడుతోంది – పదవుల కోసం ఇంతలా దిగజారాలా? – సాక్షిలో జగన్‍కు ఎంత భాగముందో.. నాకూ అంతే భాగం ఉంది – వైఎస్సార్ ఉన్నప్పుడు జగన్‍కు ఎంత ఇచ్చారో.. అంతే నాకూ ఇచ్చారు – అలాంటి సాక్షిలో నా మీద తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు? – బుద్ధి, జ్ఞానం ఉంటే ఇలా చేస్తారా? – విలువలు, విశ్వసనీయత ఉంటే ఇలా చేస్తారా? ’’ ఇవీ ఆమె వ్యాఖ్యలు…
Ads
ఆమె తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్టీపీ అని పార్టీ పెట్టుకుని తిరుగుతున్నప్పుడు జగన్ క్యాంపు ఏమీ పట్టించుకోలేదు… కానీ ఎప్పుడైతే కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఏకంగా ఏపీసీసీ అధ్యక్షురాలిగా తిరుగుతూ జగన్ మీదే దాడి మొదలుపెట్టిందో, ఇక హఠాత్తుగా వైఎస్ జగన్ క్యాంపుకి షర్మిల అంటే మండుతోంది… భీకరంగా ట్రోల్ చేస్తోంది… ఆమె వైఎస్ పేరు పెట్టుకోవద్దు, చెప్పుకోవద్దు, ఆమె మొగుడి ఇంటి పేరు మొరుసుమల్లి, అదే చెప్పుకోవాలంటూ హుకుం జారీ చేస్తోంది… ఆమె పేరు మొరుసుమల్లి షర్మిలా శాస్త్రి అంటోంది… నేను వైఎస్ బిడ్డను, నా కొడుకు పేరు పెట్టింది నా తండ్రి… బరాబర్ నేను వైఎస్ షర్మిలారెడ్డినే అని స్థిరంగా, ధాటిగా బదులిస్తోంది ఆమె… సరే, అన్నాచెల్లెళ్ల పంచాయితీకి అసలు కారణాలేమిటో, ఎక్కడ బెడిసికొట్టిందో, అసలు ఇదంతా నిజమేనో కాదో పక్కన పెడదాం కాసేపు… (అప్పుడప్పుడూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పే వివరాలు తప్ప)…
సాక్షిలో జగన్ ఎంతో నేనూ అంతే, తండ్రి ఉన్నప్పుడు జగన్‌కు ఎంతిచ్చాడో నాకూ అంతే ఇచ్చాడు అనే వ్యాఖ్య ఇంట్రస్టింగ్ అనిపించింది… నిజమేనా..? సాక్షి పత్రిక ప్రారంభం నుంచి గానీ, సాక్షి టీవీ ప్రారంభం నుంచి గానీ ఆమె ఎప్పుడూ ఎక్కడా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ఆఫీసుల్లోకి అడుగుపెట్టినట్టు తెలియదు… జర్నలిస్టు సర్కిళ్లకు, సాక్షి ఉద్యోగులకు కూడా ఇది కొత్త విషయం… అసలు సాక్షిలో ఆమె పేరే ఎక్కడా వినిపించదు… ప్రస్తుతం సాక్షి డైరెక్టర్లలో కూడా ఆమె పేరు కనిపించదు… గతంలో జగన్, ఇప్పుడు భారతి చైర్మన్లు… ఇండియా సిమెంట్స్, హెటెరో, అరవిందో వంటి ఇన్వెస్టర్ల పేర్లు తప్ప ఆమె పేరు ఎక్కడా కనిపించదు…
అప్పట్లో క్విడ్ ప్రోకో కింద వైఎస్ చేసిన సర్కారీ మేళ్లకు ప్రతిగా పలువురు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇందులో పెట్టుబడులుగా డబ్బు ప్రవహింపచేసినట్టు సీబీఐ, ఈడీలు కేసులు పెట్టి మరీ ప్రజలకు చెప్పాయి… అది నాట్ లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ కాబట్టి అందులోని వాటాదార్ల పేర్లు, వారి వాటాల వివరాలు అంత సులభంగా బయటపడవు… మరి తనకూ సాక్షిలో జగన్‌తో ఈక్వల్ వాటాలున్నప్పుడు ఇన్నేళ్లూ షర్మిల ఎందుకలా దాన్ని వదిలేసినట్టు..? ఈ ప్రశ్నకు మళ్లీ ఆమే జవాబు చెప్పాలి… తన మీద దుష్ప్రచారానికి సాక్షి మీడియా పాల్పడుతున్నప్పుడు, తను కూడా జగన్‌కు సమాన భాగస్వామిని అని చెప్పుకునే షర్మిల ఆర్వోసీకి వెళ్తుందా..? ఇంకేమైనా లీగల్ యాక్షన్‌కు వెళ్తుందా..? అన్నాచెల్లెళ్ల పంచాయితీ చాలా టర్నులు తీసుకుంటోంది…
Share this Article