ఇది చాన్నాళ్లుగా ఉన్నదే… దక్షిణ భారతానికీ, ఉత్తర భారతానికీ నడుమ పోలికలు, తేడాలు చెప్పుకోవడం… అనేక అంశాల్లో…! మత ఆచరణ, దేవుడు, భక్తి అనే విషయాలకు వస్తే దక్షిణ భారతంలో హేతువాదం, నాస్తికత్వం, ఆధునిక లౌకికవాదం గట్రా ఎక్కువనీ, కానీ ఉత్తర భారతంలో మూఢభక్తి, భక్తి, మతతత్వం, సంప్రదాయ ధోరణులు అధికమనే వాదనలు వినిపిస్తుంటాయి… అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ చర్చ మళ్లీ మొదలైంది… కానీ… నిజమేనా..?
దిప్రింట్ వెబ్‌సైట్ దీనిపై ఓ ఆసక్తికరమైన కథనాన్ని పబ్లిష్ చేసింది… దాన్ని ఓసారి తెలుగులో చెప్పుకుందాం… సదరు సైట్ సౌజన్యంతో… ‘‘ఓ శాస్త్రీయ పరిశీలన ఉత్తర, దక్షిణ భారతాల నడుమ ఈ తేడా పెద్ద అబద్ధమని కొట్టిపారేస్తుంది… 2020-2021 సంవత్సరంలో దేశవ్యాప్తంగా PEW International అనే సంస్థ ఈ మత విశ్వాసాలు- పద్దతుల మీద ఓ సర్వే నిర్వహించింది… మత ఆచరణ తంతులు, పద్ధతుల్లో కాసింత తేడా తప్ప స్థూలంగా ఉత్తరం, దక్షిణం అనే తేడా పెద్దగా ఏమీ లేదని ఆ సర్వేలో తేలింది…
హిందూ మత ఆచరణ పద్దతులు దేశవ్యాప్తంగా దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి… విశ్లేషణ కోసం బీహార్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కశ్మీర్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఉత్తర ప్రాంతంగా (హిందీ నార్త్ బెల్ట్) తీసుకుందాం… అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు దక్షిణ భారతం కిందకు వస్తాయి… ఇప్పుడిక హిందూ మత విశ్వాసాలు, ఆచరణ తీరులను ఓసారి చూద్దాం…
Ads
(courtesy :: The Print)
రెండో అంశం చూద్దాం… తమ భక్తి, మతానికి సంబంధించిన తంతులు, ఆచరణలు… హిందీ బెల్ట్‌లో 81 శాతం మంది, సౌత్ బెల్ట్‌లో 72 శాతం మంది వారానికి కనీసం ఒక్కసారైనా ఇంట్లో పూజ చేస్తామని చెప్పారు… సౌత్‌లో కాస్త తక్కువ అనిపించినా, మత ఆచరణలో ఇది తక్కువ సంఖ్యేమీ కాదు… ఇంట్రస్టింగ్…
మూడోది… సౌత్ ఇండియన్స్ ఇళ్లల్లో పూజలు చేయడంలో ఉత్తరాదితో పోలిస్తే తక్కువే కావచ్చుగాక… కానీ గుళ్లకు వెళ్లడంలో మాత్రం ముందంజ… 62 శాతం మంది వారానికి కనీసం ఒకసారైనా గుళ్లకు వెళ్తామని చెప్పారు… ఇది హిందీ నార్త్ బెల్ట్‌లో కేవలం 57 శాతం మాత్రమే… సౌత్‌లో ఈ శాతం అధికంగా ఉండటానికి కారణం ఏమంటే, ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో బీసీలు, దళితులు గుళ్లకు వెళ్లడం ఎక్కువే… ఉదాహరణకు నార్త్‌లో 51 శాతం మంది బీసీలు మాత్రమే వారానికి కనీసం ఒక్కసారైనా గుళ్లకు వెళ్తుంటారు… ఈ సంఖ్య దక్షిణాదిలో 60 శాతం…
నాలుగోది… మతపరమైన, కుటుంబపరమైన, ఇతర ఇంపార్టెంట్ కార్యక్రమాలకు సౌత్‌లో దాదాపు 90 శాతం ప్రజలు ముహూర్తాలు, తిథులు, వర్జ్యాలు, లగ్నాలు, దుర్దినాలు, నక్షత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు… కానీ నార్త్‌లో వీరి సంఖ్య కేవలం 84 శాతం మాత్రమే… అంటే, ఒకరకంగా ఉత్తరాదివారికన్నా దక్షిణాదివారిలోనే ఈ నమ్మకాలు ఎక్కువ…
చివరిది, ముఖ్యమైనది ఏమిటంటే… మతపరమైన ఉపవాసాల విషయంలో ఉత్తరాది ప్రజల్లో 85 శాతం మంది ఉపవాసాలు, దీక్షలు చేస్తారు… దక్షిణంలో ఈ సంఖ్య జస్ట్ 68 శాతమే… అంటే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాన గుళ్లకు వెళ్లి దండం పెట్టుకోవడమే పెద్ద మత ఆచరణ… కాకపోతే ముహూర్తబలాల మీద నమ్మకాలు చాలా ఎక్కువ… సో, ఏతావాతా తేలేది ఏమిటంటే… దేవుడు, మతం, భక్తి, విశ్వాసం వంటి విషయాల్లో దక్షిణం, ఉత్తరం తేడాలేమీ లేవు…!!
Share this Article