ఒక వార్త… ఏదో పత్రికలో కనిపించింది… ఎన్నికల వేడిలో చాలా గాసిప్స్ వస్తుంటాయి, చదవాలి, వదిలేయాలి… కానీ ఇది కాస్త ఇంట్రస్టింగు… ఎందుకంటే… మొన్ననే పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం… అదే అందరికీ హాశ్చర్యం… సాధారణంగా పద్మవిభూషణ్ ఇస్తున్నారంటే ఏదో హిడెన్ ఎజెండా ఉంటుంది… ఊరికే పంచిపెట్టరు కదా… పైగా అయోధ్యకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు…
మరి బీజేపీ ఆశిస్తున్న ఫాయిదా ఏముంది అనేది చివరకు బీజేపీ ముఖ్యులకు కూడా అంతుపట్టడం లేదు… అసలు బీజేపీ హైకమాండ్ చిరంజీవి నుంచి ఏం ఆశిస్తోంది..? ఈ సందేహాలు ఇలా వ్యాప్తి చెందుతుండగానే ఈ ప్రచారం మొదలైంది… చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు అట… వోకే, ఇవ్వొద్దని ఏముంది..? విజయేంద్రప్రసాద్‌కు ఇచ్చి ఏం లబ్ధి పొందింది బీజేపీ అని అడక్కండి… హైకమాండ్ కదా అలా అనాలోచితంగా తాము వ్యూహాలు, ఎత్తుగడలు అనే భ్రమల్లో కొన్ని నిర్ణయాలు అలా తీసేసుకుంటుంది…
Ads
సరే, చిరంజీవి దగ్గరకే వద్దాం… అక్కడా ఇక్కడా కాదు, ఏకంగా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తారట… అవును, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎలాగూ చాన్స్ లేదు… కర్నాటకలో గిరాకీ ఎక్కువుంది… రాజ్యసభ ఇవ్వడమే కాదు, కేంద్ర మంత్రిగా కూడా తీసుకుంటారట… సరే, చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి కొత్తేమీ కాదు… రాజ్యసభ కూడా కొత్తేమీ కాదు… ఆల్రెడీ అన్నీ అనుభవించి, ఇక ఈ రాజకీయాలు నాకు సరిపడవు అనుకునే కదా మళ్లీ వెండితెరకు అంకితమైపోయి, స్టెప్పులు, నరుకుడు ఫైట్లకు అంకితం చేసేసుకున్నాడు…
పోనీ, కాపు వోట్ల కోసం ఎర వేస్తుందీ అనుకుందాం… జగన్ రెడ్డి, చంద్రబాబు చౌదరిలకు ప్రత్యామ్నాయంగా కాపు చిరంజీవిని చేరదీస్తున్నారు అనుకుందాం… కానీ ఆల్రెడీ అదే చిరంజీవి తమ్ముడు తమతో పొత్తులోనే ఉన్నాడు కదా… తనకు కాపు వోట్లు కన్సాలిడేట్ అవుతాయని బీజేపీ విశ్వసించడం లేదా..? మరి చిరంజీవికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు..? అదీ ప్రశ్న… పోనీ, పవన్ కల్యాణ్ టీడీపీతో అంటకాగుతున్నాడు, మనకు టీడీపీతో కుదరదు, సో, పవన్ కల్యాణ్‌ను కూడా వదిలేసి, చిరంజీవిని యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకురావాలనేదా బీజేపీ ప్లాన్..?
అబ్బే, తమ్ముడిని ఉన్నత స్థానంలో చూడాలని బలంగా కోరుకునే అన్న చిరంజీవి తన తమ్ముడిని అలా వదిలేస్తాడా..? నెవ్వర్… పోనీ, చిరంజీవి మోడీ సూచనల్ని పాటిస్తాడనే అనుకుందాం కాసేపు… కానీ ఈరోజుకూ ఆయన రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే ఆసక్తి ఉన్నట్టు చెప్పాడా ఎక్కడైనా..? లేదు కదా… అసలు చాన్నాళ్లు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నాడనే అనుకున్నారందరూ…
కానీ తను ఆ పార్టీలో ఉన్నానని చెప్పలేదు, కాంగ్రెస్‌ను వదిలేశాననీ చెప్పలేదు… రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా లేడు… మరి తన స్టాండ్ ఏమిటి..? ఏమో, మోడీ చెవిలో తను ఏం చెప్పాడో… ఆయన అమిత్ షాకు ఏం చెప్పాడో… తెలియదు… అసలు బీజేపీ ఆలోచనలు మస్తు పదునుగా ఉంటాయని అనుకోవడమే గానీ… తెలంగాణ, ఆంధ్రాల్లో బీజేపీ ఆలోచనలన్నీ ఉత్త బేకార్ అడుగులు… బీజేపీ ముఖ్యులే అంగీకరిస్తారు ఆఫ్ ది రికార్డుగా…!!
లోకసభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదు అని తెలంగాణ బీజేపీ పెద్దమనిషి మొన్న ఎక్కడో చెప్పినట్టు గుర్తు… మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకూ ఈ లోకసభ ఎన్నికలకూ నడుమ ఎందుకీ జ్ఞానోదయం..? ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుందా పొత్తుల యవ్వారం… ఐనా ఈ తెలుగు రాష్ట్రాల బీజేపీ ఆశల్ని, ఆకాంక్షల్ని బీజేపీ హైకమాండ్ ఎప్పుడు సరిగ్గా అర్థం చేసుకుంది..!?
Share this Article