వేరే మతానికి చెందిన వ్యక్తులు ఓ గుడి ఆవరణలోకి ప్రవేశించి, చేతుల్లో తమ పవిత్ర గ్రంథాన్ని పట్టుకుని ప్రార్థనలు చేయడానికి ప్రయత్నించారు… ఓ పిక్నిక్‌కు వచ్చినట్టుగా ఫోటోలు తీసుకుంటూ అక్కడే భోజనాలు చేయడానికి ప్రయత్నించారు,.. తమిళ మీడియాలో కూడా ఈ వార్తలు వచ్చాయి… అలాంటి పరమతస్తులను ఇదేమిటని ప్రశ్నిస్తే నాన్-హిందూస్ రావొద్దని ఎక్కడైనా రాసి ఉందా అని ఎదురు ప్రశ్నించారు…
దీంతో సెంథిల్ కుమార్ అనే పిటిషనర్ కోర్టుకెక్కాడు… దుండిగల్ జిల్లాలోని అరుల్‌మిగు పళని దండాయుధపాణి గుడిలోకి గానీ, దాని ఉప ఆలయాల్లోకి గానీ వేరే మతస్తులు రాకుండా తీర్పు వెలువరించాలని కోరాడు… దీనిపై మధురై హైకోర్టు బెంచ్ జస్టిస్ శ్రీమతి ఓ తీర్పు చెబుతూ ‘గుళ్లు పిక్నిక్ స్పాట్స్ కావు, టూరిస్ట్ ప్లేసులు కావు’ అని వ్యాఖ్యానించారు…
అంతేకాదు, హిందూ ఆలయాల్లో ధ్వజస్తంభం దాటి పరమతస్తులు ప్రవేశించకూడదని సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని తమిళనాడు దేవాదాయ శాఖను ఆదేశించింది… ఈ తీర్పును కేవలం పళని ఆలయాలకు మాత్రమే వర్తింపచేయాలని లేకపోతే ఇతరుల మనోభావాలు గాయపడతాయని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరినా సరే జడ్జి అంగీకరించలేదు… హిందూ మతస్తులు తమ గుళ్లల్లో ఎవరి జోక్యం లేకుండా తమ మత ఆచరణను సాగించుకునే హక్కు ఉందని తీర్పు చెబుతోంది…
Ads
గుళ్లల్లో ధ్వజస్తంభం దగ్గరే కాదు, కీలకమైన ప్రాంతాల్లో ‘ఇతర మతస్తులకు ప్రవేశం లేదు’ అనే సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది… ఒకవేళ పరమతస్తులు ఎవరైనా దేవుడిని దర్శించుకోవాలని కోరుకుంటే… హిందూ మతంపై విశ్వాసం ఉందని, గుడి సంప్రదాయాలన్నీ పాటిస్తామని అండర్ టేకింగ్ ఇవ్వాలని సూచించింది…
ఆలయాల నిర్వహణ కమిటీలకు ఆయా గుళ్ల ఆగమాలు, పద్ధతులు, సంప్రదాయాల్ని మెయింటెయిన్ చేయాల్సిన బాధ్యత ఉందనీ, ఈ తీర్పు అన్ని గుళ్లకూ వర్తిస్తుందనీ చెప్పింది… మతేతర కార్యక్రమాల కోసం ఇతర మతస్తులు గుళ్లలోకి ప్రవేశిస్తున్న సంఘటనలకు కూడా తీర్పు ఉదహరించింది… దేవాదాయ శాఖ (HR & CE Department) హిందువుల మతహక్కుల్ని పరిరక్షించే బాధ్యత కలిగి ఉందని స్పష్టం చేసింది… హిందూ ఆధ్యాత్మిక, మత పద్ధతులను తీవ్రంగా ద్వేషించే డీఎంకే నేతల స్పందన ఇంకా తెలియరాలేదు… (Source :: India Today)
Share this Article