ఆయనే సీసీఎల్ఏ, ఆయనే చీఫ్ సెక్రెటరీ… ఫార్మాసిటీ ప్రకటనకు ముందే భార్య పేరిట 25 ఎకరాలు, బావమరిది 100 ఎకరాలు, బంధువులకూ భూకొనుగోళ్లు… వందల కోట్ల విలువ చేసే ఆ భూములే కాదు, ఓ ఐపీఎస్ ఏకంగా 200 ఎకరాలు కొన్నాడట… వీళ్లందరూ చాలా చౌకగా కొనుగోలు చేయడం అంటే ఆ రైతులను నిండా ముంచేయడం… దీన్ని మించిన మోసం మరొకటి ఉంటుందా..?
వీళ్లే కాదు, నాయకులు, సీనియర్ అధికారులు కూడా ఎడాపెడా కొనేశారు… అందుకే రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లో ఫార్మాసిటీ రద్దు అనగానే ఉలిక్కిపడింది ఈ మాఫియా… పైగా ఈ భూములకు రైతుబంధు కూడా ఇచ్చింది కేసీయార్ ప్రభుత్వం… కేసీయార్ నిజంగానే సిగ్గుపడాల్సిన పథకం ఆచరణ అది… సోమేష్ కుమార్ అక్రమాల్ని తవ్వేకొద్దీ ఇంకా ఎన్ని బాగోతాలు బయటపడతాయో…
ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం రెరా బాలకృష్ణుడు అస్సలు నోరు విప్పడం లేదట… క్రైమ్ పోలీసులను రంగంలోకి దింపితే గానీ తెలంగాణను భ్రష్టుపట్టించిన ఎందరి రహస్యాలో బయటపడతాయి… చాలా పెద్ద తలకాయలతో సహా…! హార్ష్‌గా ఉన్నా సరే… వీళ్లు నయీంకన్నా ఏం తక్కువ..? తను చేయాల్సిందేదో స్ట్రెయిట్‌గా చేశాడు… కానీ వీళ్లు..?
Ads
పోనీ, రేవంత్ సర్కారైనా ఏం చేయగలదు..? కరెంటు ప్రభాకరరావు ఆల్మోస్ట్ తప్పించుకున్నట్టే ఇక… కరెంటు కొనుగోళ్లు సహా బోలెడు అక్రమాలు ఆ కరెంటు సంస్థల్లో… సింగరేణి శ్రీధర్ తప్పించుకున్నట్టే… సింగరేణి బాగోతాలన్నింటికీ బాధ్యుడు కాడా..? టీఎస్పీఎస్సీ జనార్దన్‌రెడ్డి తప్పించుకున్నట్టే… వేలాది మంది నిరుద్యోగులను నిలువునా మోసగించాడు కదా… హెటెరో పార్థసారథి వంటి వేల కోట్ల మేతగాళ్లు ఎందరు లేరు…? మెల్లిమెల్లిగా కాలేశ్వరం, ధరణి వంటి అన్ని బాగోతాల అధికారులు, ఇంజినీర్లూ తప్పించుకుంటారు… ఈ సోమేష్ అండ్ కో కూడా… రక్షించడానికి ఎన్ని మార్గాలు లేవు..?
అధికార పార్టీ పెద్దలు కూడా ఈ మేతగాళ్ల బాగోతాల్లో భాగస్వాములు కాబట్టి వీళ్ల అక్రమాలు అలా నడుస్తూ పోయాయి… రిటైరవుతారు, అవే పోస్టులో లేదా సలహాదారుల పాత్రల్లో అలాగే అధికారాలతో కొనసాగుతూ ఉంటారు… మళ్లీ చెబుతున్నా… కేసీయార్ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతిని బహుశా తెలంగాణ మళ్లీ చరిత్రలో చూడదేమో… కేసీయార్ తెలంగాణకు వరమా..? శాపమా..? ఓ దిక్కుమాలిన నాయకగణాన్ని తెలంగాణ మీద రుద్దింది ఆయన ఉద్యమం… అక్షరాలా నిజం…
వీళ్లకుతోడు అధికారులు… నాయకులైతే రోజూ ఖర్చు, ఎన్నికల ఖర్చు, మళ్లీ ఎన్నికవుతామో లేదోననే భయాలు, సందేహాలు… మరి ఐఏఎస్, ఐపీఎస్‌లకు..? బొచ్చెడు అధికారులు, జీవితాంతం ఫుల్లు జీతాలు, పెన్షన్లు… ఇళ్లల్లో చాకిరీకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు, వాహనాలు, వైభోగాలు, పెత్తనాలు… నాయకులు కూడా కుళ్లుకునే రాచరికం… చివరకు కోర్టు ఖర్చులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది… ప్రైవేటు కేసులకు కూడా… ఉదాహరణ, స్మిత సభర్వాల్…
సగటు ఉద్యోగులకు కనీసం ఏసీబీ భయం… విజిలెన్స్ భయం, కటకటాల భయం… వీళ్లకు సీబీఐ భయం కూడా లేదు… దానికి అంత సిబ్బందీ లేదు… వీళ్లపై నిఘాలు వేసి ఎప్పటికప్పుడు అక్రమార్కులను ఏరేయాల్సిన డీవోపీటీ మన వ్యవస్థలో అది పెద్ద ఫెయిల్యూర్… దానంత మోస్ట్ హోప్‌లెస్ విభాగం మరొకటి లేదు…
నిజానికి ఐఏఎస్ ఎంపికే పెద్ద లోపభూయిష్టం… వాళ్లకు శిక్షణ కూడా అంతే… మనం బోలెడు సక్సెస్ స్టోరీలు రాస్తుంటాం… వీళ్లేమో కొలువులో చేరింది మొదలు సొసైటీని కుళ్లబొడుస్తుంటారు… నిజానికి మన భారతీయ సమాజానికి అసలు సిసలు శత్రువులు సివిల్ సర్వీసు అధికారులే… బోలెడు ఉదాహరణలు… ఇక అధికార పార్టీ మద్దతు కూడా తోడైతే… ఇంకేముంది..? అందుకే ఒక్క మాట… వీళ్లందరికన్నా నయీంలు నయం కాదా..!! ఫార్మాసిటీ మరో అమరావతి బాపతు ఇన్‌సైడ్ ట్రేడింగ్ కుంభకోణం కాదా..!?
Share this Article