Pardha Saradhi Potluri……… PayTm Payment Bank చిక్కుల్లో పడ్డది!
రిజర్వు బ్యాంక్ PayTm Payment Bank మీద ఆంక్షలు విధించింది!
ఫిబ్రవరి 29 తరువాత ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు జరపకుండా నిషేధం విధించింది!
ఎందుకు?
ప్రాథమికంగా దొరికిన సమాచారం ప్రకారం:
ఒకే పాన్ కార్డుతో 1000 కి పైగా UPI అకౌంట్లు ఉన్నట్లు RBI గుర్తించింది!
ఇదెలా సాధ్యం అవుతుంది?
అంటే PayTm యాజమాన్యంకి తెలిసే ఇది జరిగిందా?
ఏదో ఒకటికి రెండు అకౌంట్లు ఒకే pan నంబర్ మీద ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఏకంగా 1000 అకౌంట్లు ఒకే పాన్ కార్డుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అంటే మనీ లాండరింగ్ జరిగిందా?
********
RBI ఇంత తీవ్రమైన చర్య తీసుకోవడానికి కారణం ఉంది.
2021 లో RBI ఆడిట్ లో PayTM Payment Bank Ltd (PPBL) నో యువర్ కస్టమర్ (KYC – Know Your Customer) విషయంలో నిబంధనలు పాటించడం లేదని గుర్తించి హెచ్చరిక చేసింది.
అంతే కాదు RBI మనీ లాండరింగ్ నిబంధనలని PayTm సరిగ్గా పాటించలేదని గుర్తించి హెచ్చరిక జారీ చేసింది.
అప్పట్లో కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నా తిరిగి పాత పద్ధతిలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.
మూడు రోజుల క్రితం RBI PayTm మీద ఆంక్షలు విధించింది.
గత సంవత్సరం మార్చి నెలలో PayTm బ్యాంక్ మీద ఆంక్షలు విధిస్తూ కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని చెప్పినా వినకుండా… రిఫర్ యువర్ ఫ్రెండ్ అంటూ మెసేజెస్ పంపిస్తూనే ఉంది అంటే PayTm ఖాతాదారుడు కొత్తగా ఎవరినన్నా చేరిస్తే 100 రూపాయలు క్యాష్ బాక్ ఆఫర్ ఇస్తుంది అన్నమాట.
అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ఏకంగా లైసెన్స్ కాన్సిల్ చేస్తుందా అనేది కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.
Ads
************
RBI తాను గుర్తించిన PayTm లో జరిగిన అవకతవకల విషయం మీద ప్రధాని కార్యాలయానికి, కేంద్ర హోమ్ శాఖకి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకి రిపోర్టు చేసింది.
అయితే ED కనుక కేసు తీసుకుని విచారణ చేస్తే మరిన్ని అవకతవకలు బయటపడే అవకాశం ఉంది.
ఇప్పటికే PayTm వాలెట్ ద్వారా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది RBI.
బహుశా గత డిసెంబర్ నెలలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో PAYTM వాలెట్ ద్వారా డబ్బు పంపిణీ జరిగి ఉండవచ్చు !
*******
అసలు డిజిటల్ పేమెంట్స్ భారత్ లో మొదలు పెట్టింది PayTm దశాబ్దకాలం కిందట!
మొదట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ 2016 లో నోట్ల రద్దు తరువాత UPI ను వాడడం మొదలు పెట్టారు.
అయితే భారత్ లో తన UPI app గురించి paytm కరో అనే నినాదంతో ప్రచారం చేసినా Phone pay, Google pay లు PayTm ను వెనక్కి నెట్టేశాయి.
అయితే PayTm అనేది బ్యాంక్ కాబట్టి వేరే బ్యాంక్ తో అనుసంధానం చేయనవసరం లేకుండా నేరుగా PayTm లోనే జమ అవుతుంది, అయితే అవసరం అనుకుంటే PayTm ను వేరే బ్యాంక్ తో అనుసంధానం చేసుకోవచ్చు.
కానీ Phone pay, Google pay లు బ్యాంకులు కావు కానీ మన బ్యాంక్ కి అనుసంధానంగా పనిచేస్తాయి.
PayTm బ్యాంక్ అయినా ప్రజలు మూడో స్థానం ఇచ్చారు.
UPI లావాదేవీల విషయంలో మొదటి స్థానంలో PHONE pay ఉండగా, రెండో స్థానంలో గూగుల్ పే ఉంది. మూడో స్థానంలో PayTM కొనసాగుతున్నది.
****
ఇప్పుడు బయటపడిన అవకతవకలతో మరింత దిగజారే అవకాశం ఉంది.
ఇంతకీ PayTm ఖాతాదారుల పరిస్థితి ఏమిటీ?
1. ఫిబ్రవరి 29 వరకు లావాదేవీలు జరుపుకోవచ్చు, అంటే PayTm ద్వారా నగదు స్వీకరించవచ్చు మరియు నగదు పంపవచ్చు.
2. ఫిబ్రవరి 29 తరువాత PayTm బ్యాంక్ పనిచేయదు కాబట్టి ఏదో ఒక బ్యాంక్ తో లింక్ చేసుకొని వాడుకోవచ్చు.
3. PayTm తో లింక్ ఉన్న క్రెడిట్ కార్డ్ చెల్లింపులు చేయలేరు.
4. PayTm ద్వారా FastTag (టోల్ ఫీ) చెల్లించలేరు.
5. PayTm wallet ద్వారా చేసే అన్ని లావాదేవీలు జరగవు.
6. PayTm బ్యాంక్ లో డిపాజిట్లు చేయలేరు. ఏవన్నా డిపాజిట్లు ఉంటే వాటిని ప్రభుత్వ రంగ బాంకులకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
7. PayTm ద్వారా గోల్డ్ లోన్ తీసుకోలేరు.
*******
ఇక వ్యాపార సంస్థలు నిర్వహించే PayTm లావాదేవీలు యధాతథంగా కొనసాగుతాయి కానీ RBI పూర్తి స్థాయి నిషేధం విధిస్తే మాత్రం ఆ అకౌంట్స్ ను కూడా వేరే బ్యాంక్ తో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతానికి పనిచేస్తాయి. మీ వ్యక్తిగత PAYTM అకౌంట్స్ లో కనుక డబ్బు ఉంటే వాటిని ఈ నెల 29 లోపు వాడుకోవాలి లేదా వేరే బ్యాంక్ కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి….
Share this Article