ఈ కేసు 1970 నుంచీ కొనసాగుతోంది… 1970లో బర్నావా నివాసి ముకీమ్ ఖాన్ మీరట్‌లోని సర్దానా కోర్టులో వక్ఫ్ బోర్డు అధికారి హోదాలో కేసు వేశాడు… ఐతే ఇది లక్షగృహ ఆనవాళ్లు అనీ, హిందువులకే చెందాలని లక్షగృహ (లక్క ఇల్లు) గురుకుల స్థాపకుడు కృష్ణదత్ మహారాజ్ ఈ కేసులో చేరాడు… లక్షగృహ దిబ్బపైనే షేక్ బద్రుద్దీన్ సమాధి, పెద్ద శ్మశానవాటిక ఉన్నాయని తన వాదన… కానీ ఈ స్థలంపై వక్ఫ్ బోర్డుకు హక్కులు ఉన్నాయనీ, కానీ హిందువులు ఆ శ్మశానవాటికను ధ్వంసం చేసి, హిందువుల పుణ్యక్షేత్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ముకీమ్ ఖాన్ ఆరోపణ…
ముకీమ్ ఖాన్ లేడు ఇప్పుడు… కృష్ణదత్ కూడా లేడు… ఇద్దరూ మరణించారు… కానీ వాళ్లిద్దరి తరఫున కేసు కొనసాగుతూనే ఉంది… హిందువుల వాదన ఏమిటంటే..? పాండవుల లక్క ఇల్లు ఇక్కడే ఉండేదనీ, దాన్ని తగులబెట్టి వాళ్లను హతమార్చే కుట్ర నుంచి ఒక సొరంగం ద్వారా పాండవులు తప్పించుకున్నారనీ, చాలా తవ్వకాల్లో ఆధారాలు కూడా దొరికాయని హిందూ పక్షం వాదన… అవన్నీ వేల ఏళ్ల నాటివి, హిందూ నాగరికత ఆనవాళ్లు అనేది ఆ వాదన సారాంశం…
Ads
ఆర్కియాలజికల్ సర్వే 1952లో తవ్వకాలు జరిపితే 4500 ఏళ్ల నాటి కుండలు లభ్యమయ్యాయని చెబుతారు… మహాభారత కాలం కూడా అదేనని హిందువులు నమ్ముతారు… ఈ గుట్ట కింద ఓ గుహ కూడా ఉంది… 2018లో అక్కడ తవ్వకాలు జరిపితే మానవ అస్థిపంజరాలు, ఇతర మానవ అవశేషాలు బయటపడ్డాయి… ఓ భారీ ప్యాలెస్ గోడలు, నివాసాలు కూడా బయటపడ్డాయనే వార్తలు కూడా వచ్చాయి…
మీకు లక్క ఇల్లు కథ తెలుసు కదా… దుర్యోధనుడు అధికారం తనకే దక్కాలనీ, పాండవులు బతికి ఉన్నంతకాలం తనకు ముప్పేనని భావించి, పాండవులను కాల్చి చంపాలని ప్రణాళిక వేస్తాడు… తన మంత్రి చేత ఓ లక్క ఇల్లు నిర్మిస్తాడు… లక్క, మైనం, నెయ్యి, నూనె కలిసి నిర్మిస్తారు దాన్ని… వారణావతంలో నిర్మించిన ఈ ఇంట్లో పాండవులు నివసిస్తుంటారు… ఓ రాత్రి ఆ ఇంటిని తగులబెట్టిస్తాడు దుర్యోధనుడు… అయితే కురురాజ్యం ప్రధాని విదురుడు ఈ సమాచారాన్ని ముందే కుంతికి అందించడంతో, ఓ సొరంగం తవ్వించి పెడుతుంది ఆమె… ఆ మంటల నుంచి తప్పించుకుంటారు… ఇదీ కథ… (పార్థసారథి పోట్లూరి)
Share this Article