ముందస్తుగా ఓ డిస్‌క్లెయిమర్ :: మీడియా రాతలు, ప్రచారంతో ఎవరూ గెలవరు, ఎవరూ ఓడిపోరు… ప్రజలు వోట్లు వేయటానికి ఈ క్యాంపెయిన్స్‌ను ఏమీ పరిగణనలోకి తీసుకోరు… వాళ్ల లెక్కలు వేరు, కొలిచే ప్రమాణాలు వేరు… ఐనా సరే, ప్రతి పార్టీ, ప్రతి నాయకుడికీ మీడియా కావాలి… భజన కావాలి లేదా ప్రత్యర్థుల వాదనలకు కౌంటర్లు వేయాలి… వాయిస్ జనంలోకి పోవాలి, అందుకే మీడియా కావాలి… అంతకుమించి మీడియా ప్రభావం శూన్యం…
వైఎస్ సీఎం గాకుండా యెల్లో మీడియా ఏమీ అడ్డుకోలేకపోయింది… తరువాత జగన్ సీఎం గాకుండానూ ఆపలేకపోయింది… సేమ్, సాక్షి వంటి మీడియా చంద్రబాబు సీఎం గాకుండా అడ్డం పడలేకపోయింది… సేమ్, రేవంత్‌రెడ్డి సీఎం గాకుండా సోకాల్డ్ పింక్ మీడియా ఎంత తన్లాడినా సక్సెస్ కాలేదు… కేసీయార్‌ను కాపాడలేకపోయింది ఆ మీడియా… ఎస్, తెలంగాణ రాకుండా కూడా ఆంధ్రా మీడియా అడ్డుకోలేకపోయింది… ఏవో పనికిమాలిన ప్రచారాలు తప్ప…
Ads
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అవసరం ఏమిటయ్యా అంటే..? ఓ పే-ద్ద సైటు ‘రాజధాని ఫైల్స్’ సినిమా అనేది వెండితెర మీద ఓ విషప్రయోగం అని రాయడం విస్మయపరిచింది… నిజానికి ఆ సినిమా ట్రెయిలర్ చూస్తే అంత ఓవర్ రియాక్షన్ అవసరమా అనిపించింది కూడా… సరే, వాళ్ల పొలిటికల్ లైన్, వాళ్ల ఇష్టం… కానీ ఆ ట్రెయిలర్ చూస్తుంటే టీవీ5, ఏబీఎన్, ఈటీవీ, మహాన్యూస్ వంటి ప్యూర్ యెల్లో చానెళ్ల స్టోరీల్లాగే అనిపిస్తోంది… అంతకుమించి పెద్దగా నాణ్యత లేదు, పంచూ లేదు…
కాకపోతే లీగల్ కాంప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఒరిజినల్ పేర్లు, జెండాలు గట్రా లేకుండా… జాగ్రత్తగా అమరావతి ఇష్యూస్‌ను హైలైట్ చేయడానికి ప్రయత్నించారు… సరే, అది చూసేవాళ్లకు జగన్ వ్యతిరేక సినిమాగా అర్థమవుతుంది… ఐనా సరే దాని ప్రభావం జనం మీద ఏదో ఉంటుందని అనుకోలేం… అంత సీన్ లేదందులో… అఫ్‌కోర్స్, ఆ సినిమా రిలీజు గాకుండా జగన్ క్యాంపు ప్రయత్నిస్తుంది… డౌట్ లేదు…
ఇది తెలుగువన్ వాళ్లు తీశారు… జగన్ కాన్వాయ్ వస్తుంటే పోలీసులు ఆపసోపాలు పడుతూ అమరావతి దీక్షలకు అడ్డంగా గ్రీన్ కార్పెటు పట్టుకుని నిలబడటం వంటి సీన్లు పర్లేదు… బాగానే వచ్చాయి… సెన్సార్ ఏమంటుందో చూడాలి… అఫ్‌కోర్స్, సెన్సార్ వోకే చెప్పినాసరే, కోర్టుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి…
నిజానికి ఈ క్యాంపెయిన్‌లో జగన్ క్యాంపే ముందు వరుసలో ఉంది… రాంగోపాలవర్మతో రెండు భాగాల సినిమా తీయించడానికి సిద్దపడ్డారు… వ్యూహం సినిమా రెడీ అయ్యింది… చంద్రబాబు క్యాంపు అడ్డుపడింది… సినిమా కోర్టులో చిక్కుకుంది… దాని భవిష్యత్తు ఏమిటో వేచి చూడాలి… తరువాత పోలింగ్ నాటికి దాని రెండో భాగం కూడా రెడీ అయిపోవాలి… కాకపోతే వర్మ ప్రజెంటేషన్లు ఇప్పుడు మరీ నాసిరకంగా, షార్ట్ ఫిలిమ్‌ల రేంజులో ఉంటున్నాయి… దాంతో జగన్‌కు ఫాయిదా ఏదో ఉంటుందనీ అనుకోలేం… ఏమో, కౌంటర్ ప్రొడక్ట్ కూడా కావచ్చు…
కానీ యాత్ర-2 కాస్త బెటరేమో… జగన్ అధికార ప్రస్థానం కథ కాబట్టి సోనియా, చంద్రబాబు, యెల్లోమీడియాలను విలన్లుగా చూపిస్తారు… సో, దాన్ని కూడా చంద్రబాబు, కాంగ్రెస్ క్యాంపులు ఎలా అడ్డుకుంటాయో చూడాలి… కాకపోతే లీగల్ ఇష్యూస్ రాకుండా ఒరిజినల్ పేర్లు లేకుండా జాగ్రత్తపడ్డారు… కానీ పలుచోట్ల జగన్ యాత్రల తాలూకు ఒరిజినల్ ఫీడ్ వాడుకున్నట్టున్నారు… ‘బతికి ఉన్న వ్యక్తులను హర్ట్ చేయడం, కించపరచడం’ అనే పాయింట్‌ను కోర్టులు ఎలా స్వీకరిస్తాయో చూడాల్సి ఉంది…
అబ్బే, ఏముంది..? వర్మ సినిమాలకన్నా ట్రెయిలర్లే బాగుంటయ్, సినిమాల్లో ఏమీ ఉండదు, సో, వ్యూహం కూడా బిట్లుబిట్లుగా చేసి షార్ట్స్, రీల్స్, యూట్యూబ్ వీడియోస్‌గా జనంలోకి తీసుకెళ్లినా వాళ్ల లక్ష్యం నెరవేరుతుంది… రేప్పొద్దున రాజధాని ఫైల్స్‌ను అడ్డుకున్నా వాళ్లూ అదే పనిచేసే అవకాశమైతే ఉంది… మరి యాత్ర-2..? వేచి చూడటమే ఇక… మరోసారి చెబుతున్నా… మీడియా రాతలు, చూపే సీన్లు, పెట్టే డిబేట్లకన్నా ఈ సినిమాలు ఏమీ ప్రమాదకరం కాదు… అనవసరంగా మెదళ్లు చించుకోవడం, అడ్డుకునే ప్రయత్నాలు చేయడం శుద్ధదండుగ యవ్వారం…!!
Share this Article