Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండి కూటమికి తాజా వరుస షాకులు… మమత చెప్పిందే జరగబోతున్నదా ఏం..?!

February 6, 2024 by M S R

1) ఇన్నాళ్లూ సమాజ్‌వాదీ పార్టీతో ఉన్నఅజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ ఇండి కూటమికి ఝలక్ ఇచ్చి, ఎన్డీఏలో చేరిపోతోంది… దానికి యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు ఉనికి ఉంది…

2) ఆల్రెడీ జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ఇండి కూటమిలో చేరడానికి సుముఖంగా ఏమీ లేడు…

3) బీహార్‌లో ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితిశ్ తన మాజీ భాగస్వాములు కాంగ్రెస్, ఆర్జేడీలకు జెల్ల కొట్టి ఎన్డీయేలో చేరిపోయాడు…

Ads

4) ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆల్రెడీ పాగా వేసి, ఈసారి లోకసభ సీట్లను కూడా అధికంగా ఆశిస్తున్న ఆప్ పార్టీ తను సొంతంగా పోటీచేసే ఆలోచనల్లో ఉంది…

5) ఇప్పటికే శివసేన పార్టీ అధినేత ఠాక్రేకు ఎన్నికల సంఘం జెల్లకొట్టి, షిండే వర్గానిదే శివసేన అని చెప్పేసింది కదా… తాజాగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలికవర్గానిదే ఎన్సీపీ పార్టీ అని చెప్పింది… శరద్ పవార్ తెల్లమొహం వేశాడు… బాగా డిమోరల్ అయిపోయాడు…

6) కొన్నాళ్లు కాంగ్రెస్‌తో అంటకాగిన జనతాదళ్ సెక్యులర్ పార్టీ కర్నాటకలో దాన్ని వదిలేసి ఎన్డీయే వైపు మొగ్గు చూపిస్తోంది… మైసూరు ఏరియాలో దానికి చెప్పుకోదగిన బలమే ఉంది… ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు ఆపసోపాలు పడుతూ, చాలా చిక్కులను ఎదుర్కుంటూ ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరుగుతోంది…

7) జార్ఖండ్‌లో జేఎంఎం బాస్ హేమంత్ సోరెన్ జైలుపాలయ్యాడు… అంతర్గత చిక్కులతో సతమవుతున్న పార్టీ ఇండి కూటమిలో కొనసాగుతుందో లేదో ఇప్పుడే చెప్పలేని దుస్థితిలో ఉంది…

8) ఇప్పుడున్న స్థితిలో తెలంగాణలో బీజేపీ 8 సీట్ల వరకూ గెలిచే అవకాశమున్నట్టు ఇటీవల జరిగిన ఓ రహస్య సర్వేలో తేలింది… కేసీయార్ పట్ల జనంలో వ్యతిరేకత ఇంకా బలంగా, అలాగే ఉంది… లోకసభ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం హఠాత్తుగా ఏదో కృష్ణా బోర్డు, ప్రాజెక్టులు అని రాగం అందుకున్నా అది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చేదు ఫలితం చవిచూడబోతోంది… అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల ఫలితాల్లో ఆశ్చర్యకరమైన షిఫ్ట్ కనిపించబోతోందంటున్నారు…

9) ఏపీలో జగన్ ఆశించిన స్థాయి మంచి ఫలితాలు ఏమీ రాబోవడం లేదని ఫీల్డ్ రియాలిటీ చెబుతోంది… తెలుగుదేశం, జనసేనలతో దాదాపుగా బీజేపీ సయోధ్య, అవగాహన కుదరబోతోంది… జగన్ వ్యతిరేక వోటు కన్సాలిడేటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి…

10) ఇంట్రస్టింగు విషయమేమిటంటే… ఇండి కూటమిలో బలమైన భాగస్వామి స్టాలిన్… అవినీతి ఆరోపణలున్న ఇద్దరు మాజీ మంత్రులపై విచారణ, దర్యాప్తులను సూమోటోగా చేపట్టాలని హైకోర్టు భావిస్తోంది… సుప్రీం కూడా అదే చెబుతోంది… పార్టీలో అంతర్గతంగా ఈ పరిణామాలు స్టాలిన్‌ను డిమోరల్ చేస్తున్నాయి…

11) ఆల్రెడీ మమత తాను సొంతంగా పోటీచేస్తాననీ, ఇండి కూటమితో కలిసి పోటీచేసేది లేదని చెప్పేసింది… అంతేకాదు, ఇదిలాగే కొనసాగితే కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని శాపనార్థాలు కూడా పెడుతోంది…

12) రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను తీవ్ర నైరాశ్యంలో పడేశాయి…

13) ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఏ కూటమి వైపూ రానని చెప్పేస్తున్నాడు… అక్కడ కాంగ్రెస్ చాలా మైనసులో ఉంది, బీజేపీ పుంజుకుంది…

14) అయోధ్య రాముడి గుడి, దేశవ్యాప్తంగా అక్షితల పంపిణీ బీజేపీకి చాలా పాజిటివ్ అంశాలుగా మారాయి…

15) రాహుల్ స్వయంగా యాత్ర చేపట్టినా సరే, ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద బజ్ ఏమీ రావడం లేదు… సీట్ల సంఖ్య, పొత్తు ఒడంబడికల దగ్గరికి వచ్చేసరికి లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్‌కు చుక్కలు కనిపించబోతున్నాయి… ప్రత్యేకించి కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో…

… ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే… మోడీ నిన్న చెప్పాడు కదా… మాకే సొంతంగా 370 వస్తాయి, ఎన్డీయేకు 400 సీట్లు వస్తాయి అని… స్థూలంగా చూస్తే అతిశయోక్తి అనిపిస్తోంది… కానీ ఆ సంఖ్యలో రాకపోయినా సరే, దేశవ్యాప్తంగా వరుస సంకేతాలన్నీ బీజేపీకి అనుకూలంగా, ఇండి కూటమికి ప్రతికూలంగా మాత్రం మారుతున్నాయి… మూడోసారి అధికారంలోకి రావడమే కాదు, వెయ్యేళ్లకు సరిపడా మార్పులకు బాటలు వేయబోతున్నామని మోడీ ధీమాగా చెబుతున్నది ఇందుకే… ఎస్, ప్రజెంట్ సిట్యుయేషన్ బీజేపీకే అనుకూలం… కానీ ఎన్నికల వరకూ ఇలాగే ఉంటుందా..? ఈ ప్రశ్నకు కాలమే సమాధానమివ్వాలి…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions