మీడియా అంటేనే ఇప్పుడు ప్రజలపక్షం కాదు… ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక నాయకుడికి ఊడిగం చేసే బాకా… అది క్లియర్… టీవీలు, పత్రికలు, వాటి అనుబంధ సైట్లు, సోషల్ మీడియా గ్రూపులు, ఎఫ్ఎం స్టేషన్లు, వినోద చానెళ్లు… అన్నింటిదీ అదే తోవ… ప్రజలకు కూడా ఇప్పుడు మీడియా నిష్పాక్షికత మీద భ్రమలేవీ లేవు… మరీ తెలుగు పత్రికలైతే రొచ్చులో పడి దొర్లుతున్నయ్… సరే, అదంతా వేరే చర్చ…
కొన్నిసార్లు నాయకుడిని మించి యాక్షన్ చూపిస్తుంటయ్ కొన్ని అనుకూల పత్రికలు… పార్టీని, నాయకుడిని మేమే నడిపిస్తున్నాం, నడిపిస్తాం, నడవాలి అన్నట్టే ఉంటుంది ఆ ధోరణి… ఆ ఓవరాక్షన్ కాస్తా కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది జాగ్రత్తగా లేకపోతే… ఇది సరిగ్గా గుర్తించలేకపోతే… జగన్‌ను సాక్షి ముంచేస్తుంది, కేసీయార్‌ను నమస్తే తెలంగాణ ముంచేస్తుంది… చంద్రబాబును ఆంధ్రజ్యోతి ముంచేస్తుంది…
Ads
ఈ స్టోరీ చూడండి… ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ ఫస్ట్ లీడ్… మొత్తం పరిచేశారు… ఏమిటయ్యా అంటే… నిన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడు కదా… అమిత్ షాతో భేటీ అట… పరస్పర అవగాహనతో కలిసి పనిచేస్తారట… అంటే ఏమిటో..? సరే, ఏపీ మీద బీజేపీది ఓ దిక్కుమాలిన ధోరణి కాబట్టి వదిలేద్దాం… ఈ సందర్భంగా జగన్ క్యాంపు ఫేక్ ఫోటోలతో చంద్రబాబు, అమిత్ షాల భేటీ మీద దుష్ప్రచారం చేసిందనేది ఆంధ్రజ్యోతి ఆరోపణ… మొన్నమొన్ననే కదా సొంత నాయకుడి చెల్లెలు అయినా సరే షర్మిల మీద నీచమైన ప్రచారం చేస్తున్నారని ఇదే ఆంధ్రజ్యోతి శోకాలు పెట్టింది… మరి అలాంటప్పుడు చంద్రబాబును, అమిత్ షాను ఎలా వదిలేస్తుంది ఆ బ్యాచ్..?
సరే, నీచంగానే ఉంది ఆ క్యాంపెయిన్… కానీ ఏ పార్టీ శుద్ధపూస…? ఎన్నికల వ్యూహకర్తల పేరిట కోట్లకుకోట్లు బొక్కుతున్న టీమ్స్ చేసే పనేమిటి..? ప్రత్యర్థులపై ఫేక్ జీవోలు, ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు, ముద్రలు… తమకు డబ్బిచ్చే ఆసాముల పేరిట బ్రాండింగ్స్, భజనలు… అవును, ఇదంతా నీచమైన పనే… ఖచ్చితంగా ప్రమాకరమే… ఈ టీమ్స్ గాకుండా ఆయా పార్టీలు, నేతల అభిమానులు, ఫ్యాన్స్ చేసే ట్రోలింగులు, చిల్లర ప్రచారాల మాటేమిటి..? ఎవడాపగలడు..?
అసలు విషయానికి వస్తే… వాళ్లేదో నీచమైన ప్రచారానికి దిగారు సరే… అమిత్ షా కాళ్లు చంద్రబాబు మొక్కుతున్నట్టు… మెట్రోలో మోడీ ఎదుట చంద్రబాబు నిల్చున్నట్టు… ఏవేవో రాతలు, కూతలు సరే… మరి ఆ ప్రచారమంతా ఆ బ్యాచ్ ఇంటర్నల్‌గానే తిరిగేది ఆ ఫేక్ ఫోటోలు, ప్రచారం… కానీ ఆంధ్రజ్యోతి అవన్నీ ఫస్ట్ పేజీలో ప్రయారిటీతో ముద్రించి మొత్తం జనంలోకి తీసుకుపోయింది ఆ ప్రచారాన్ని పరోక్షంగా… ఇది చంద్రబాబుకు మంచి చేసేదా..? చెడు చేసేదా..? పోనీ, కౌంటర్, నిజాలు చెప్పడం అవసరం అనుకుందాం… అదీ టీడీపీ సోషల్ మీడియా వింగ్ చూసుకుంటుంది కదా… హహహ… అందుకే పత్రికల్లో ప్రతి అక్షరం, ప్రతి వాక్యం ప్రచురణకు సంయమనం, విజ్ఞత, వివేచన అవసరం అనేది… అందుకే చెప్పింది, ఇలాంటి మీడియా భక్తుల ఓవరాక్షన్ ఎప్పుడూ బాస్ పట్ల కౌంటర్ ప్రొడక్టేనని..!!
Share this Article