Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనుకుంటాం గానీ… అసలు పాటే లేకుండా కృష్ణ డాన్స్ ఇరగేశాడు…

February 9, 2024 by M S R

Subramanyam Dogiparthi….   నిర్మాత డి రామానాయుడుకి తన సినిమాలో ఏదో ఒక అతిధి పాత్రలో నటించే సెంటిమెంట్ ఉందని మనందరికీ తెలిసిందే . డాక్టర్ గానో , పోలీసు ఆఫీసర్ గానో తళుక్కుమంటుంటాడు . ఈ సినిమాలో పెళ్ళి కొడుకుగా కనిపిస్తారు . విజయనిర్మలను పెళ్లి చేసుకుంటారు .

చక్కటి ఎమోషనల్ , సెంటిమెంటల్ సినిమా . ఓ చిన్న పాప కరుడుగట్టిన ముగ్గురు హంతకులలో ప్రేమను చిగురింపచేసి , మనుషులను చేసి , పోలీసులకు లొంగిపోయేలా చేస్తుంది . పాపగా బేబీ రాణి గొప్పగా నటించింది . పాప పెద్దయిన తర్వాత పెళ్లి కూతురుగా విజయనిర్మల అతిధి పాత్రలో నటించారు .

పాప తండ్రిగా అతిధి పాత్రలో కృష్ణ నటించారు . కృష్ణను హత్య చేసి , డబ్బులు నగలను దోపిడీ చేసి , పోయేటప్పుడు పాపను ఎత్తుకుపోతారు . హంతకులుగా సత్యనారాయణ , త్యాగయ్య , రామదాసు నటించారు . పాప ఆయాగా దేవిక , డాక్టరుగా జగ్గయ్య నటించారు . ముగ్గురు హంతకుల్లో ఒకరు హిందువు , ఒకరు ముస్లిం , ఒకరు క్రైస్తవుడు . ముగ్గురూ దేవుడి మీద నమ్మకం ఉన్నవారే . ముగ్గురూ పాపలో తమ తమ దేవుళ్ళని చూస్తారు .

ఈ సినిమాలో మధుమతి అని హిందీ నటి ఓ క్లబ్ డాన్సులో డాన్స్ చేస్తుంది . అచ్చం హెలెన్ లాగానే ఉంటుంది . హెలెన్ చెల్లెలు అనుకునేవారు ఆరోజుల్లో . రాజబాబు కూడా ఒక అతిధి పాత్రలో నటించారు . ధూళిపాళ , పద్మనాభం , రుష్యేంద్రమణి , అల్లు రామలింగయ్య , రావి కొండలరావు ప్రభృతులు నటించారు .

Ads

May be an image of 4 people and text

పెండ్యాల వారి సంగీతం శ్రావ్యంగా ఉంటుంది . కొండలపైన కోనలలోన గోగులు పూసే , నన్నే నన్నే చూడు ఉన్నాను సైదోడు , మనిషి మనిషికీ తేడా ఉంది తేడాలో ఒక పోలిక ఉంది , రాముడెందుకు పుట్టాడు , ఉల్లి పూల పడవా గట్టి మావా మల్లెపూల తెరను దించి పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . పాట లేకుండా కృష్ణ , వెన్నిరాడై నిర్మలకు డాన్స్ ఒకటి ఉంటుంది . దేవిక కూడా ఓ డాన్స్ వేస్తుంది . అన్ని డాన్సులూ బాగుంటాయి .

ఇదే సినిమాను రామానాయుడు తమిళంలో కుళంతైక్కాగ అనే టైటిల్ తో రీమేక్ చేసారు . వంద రోజులు ఆడి ఘన విజయాన్ని సాధించింది . ఇదే బేనర్ పై ఈ సినిమాను తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నన్హా ఫరిస్తా టైటిల్ తో , మళయాళంలో ఒమనక్కుంజు అనే టైటిల్ తో రీమేక్ చేసారు . జి వి ఆర్ శేషగిరిరావు దర్శకత్వంలో వచ్చిన మన తెలుగు సినిమా కూడా బాగానే ఆడినట్లు గుర్తు .

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . టి వి లో కూడా చూసా . యూట్యూబులో ఉంది . చూడతగ్గ సినిమా . టైం దొరికితే చూడండి . నటీనటులు అందరూ మట్టసంగా , చక్కగా నటించారు . చివరి సీన్లు హైదరాబాద్ గోల్కోండ ఖిల్లాలో షూట్ చేసారు .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #TeluguCinemaNews #telugucinema 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…
  • విశ్వనాథుడు కదా… జావళి పాటకీ జయమాలినితో డాన్స్ చేయించగలడు…
  • 132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
  • నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…
  • ప్రేక్షకులకు తగిలే చెప్పు దెబ్బల మాటేమిటో కూడా చెప్పు..!!
  • ఎట్టకేలకు GST మోత కాస్త తగ్గిస్తున్నారు ప్రభువులవారు..!!
  • ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!
  • తెలంగాణ చదరంగంలో ఇరువైపులా రేవంతే ఆడుతున్నాడు..!!
  • బతుకంతా గరళమే… దేహమంతా గాయాలే… చివరకు టీవీ వాళ్లకూ అలుసే…
  • బొడ్డు అంటేనే డంపింగ్ యార్డ్… పూలు, పళ్ళు కాదు… సీసాలు కూడా..

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions