‘ఈ రూమ్‌లో ఉన్న మనం, ప్రధాని ఆఫీసులోని ఒకరిద్దరు కోర్ మెంబర్స్, అంతేతప్ప చివరకు ప్రధాని పీఏకు కూడా సైతం మన ప్లాన్ ఏమిటో తెలియవద్దు’… ‘ఈ ప్రధాని మరో పదిసార్లు పీఎం అయినా సరే ఆర్టికల్ 370 మీద చేయి వేయలేడు’… ‘చరిత్రలో లిఖించబడాలీ అంటే ఎవరో ఒకరు చరిత్రను లిఖించాలి కదా’… ఇలా కొన్ని డైలాగ్స్ ఏకంగా ప్రధాని కార్యాలయాన్నే సినిమాలోకి లాగుతాయి… సినిమా పేరు ఆర్టికల్ 370…
నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నానా చెత్తా రొటీన్ హీరోల ఇమేజ్ బిల్డప్పుల సొల్లు తప్ప ఎప్పుడూ ప్రయోగాల జోలికి పోదు… టేస్టు లేదు, ధైర్యమూ లేదు… మన సౌత్ విషయానికి వస్తే మలయాళం, తమిళ సినిమాలు పలు సామాజిక ఇతివృత్తాల్ని టచ్ చేస్తాయి, డిబేట్ పెడతాయి… అక్కడి హీరోలు కూడా సహకరిస్తారు… మన వాళ్లకు మాత్రం ఆ స్టెప్పులు, భీకరమైన ఫైట్లతోనే జీవితాలు తెల్లారిపోతుంటయ్, చల్లారిపోతుంటయ్…
మరోవైపు బాలీవుడ్ దేశానికి సంబంధించిన పలు సున్నితమైన ఇష్యూస్ కూడా టేకప్ చేసి, తెరపై ధైర్యంగా ప్రజెంట్ చేస్తోంది… అనేక సినిమాలు వచ్చాయి ఈ అయిదూ పదేళ్లలో… దేశరక్షణ, ఆర్మీ, ఉగ్రవాదం ఎట్సెట్రా చాలా అంశాలు… హిమాలయాల ఎత్తుల్లో, సరిహద్దుల్లో రిస్క్ తీసుకుని నిర్మిస్తున్నారు… మనవాళ్లు మాత్రం స్మగ్లర్లను హీరోలుగా చేసి, కీర్తిస్తూ… ఊ అంటావా ఊఊ అంటావా అని ఊగిపోతున్నాం… బాలీవుడ్ దేశం సెంట్రిక్ సినిమాల్ని ట్రై చేస్తుంటే మనం ఇంకా యాత్రలు, వ్యక్తి భజనల్లో తేలిపోతున్నాం…
Ads
ఆర్టికల్ 370 సినిమా ట్రెయిలర్ ఇంప్రెసివ్‌గా ఉంది… బాగుంది… మన లీడర్లు చాలామంది ఈ పదాన్ని ఉచ్చరించడానికే సంకోచిస్తుంటారు… కానీ జియో స్టూడియోస్ ఏకంగా ఓ సినిమాయే తీసేసింది… ఇందులో యామీ గౌతమ్ బాగా లీనమై నటించినట్టు కనిపిస్తోంది… ఆమెదే ప్రధాన పాత్ర… తోడుగా మన ప్రియమణి కూడా ఉంది… అరుణ్ గోయల్ గుర్తున్నాడు కదా… నాటి డీడీ రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రధారి… ఇందులో ప్రధాని మోడీ పాత్ర చేశాడు… పెద్దగా సూటైనట్టు కనిపించడం లేదు… బట్ సినిమా చూస్తే తెలుస్తుంది ఇంకాస్త…
యామీ గౌతమ్ చాన్నాళ్లుగా ఫీల్డ్‌లో ఉంది గానీ పేరు తెచ్చిన పాత్రలు పెద్దగా ఏమీ లేవు… ఈ సినిమాలోని పాత్ర ఆమె కరువును తీర్చే చాన్స్ ఉంది… కథ విషయానికి వస్తే యురి ఉగ్రవాద దాడి నుంచి… ఉగ్రవాద సానుభూతిపరుల రాళ్ల దాడులు, ఎన్‌కౌంటర్లు, పేలుళ్లు, మారణకాండ, కశ్మీర్ రాజకీయాలు, పార్టీలు, సర్జికల్ స్ట్రయిక్స్ దాకా మొత్తం ఆర్టికల్ 370 చుట్టూ తిప్పినట్టు కనిపిస్తోంది… ఎనీవే గుడ్ అటెంప్ట్…
ట్రెయిలర్‌లోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాత్రధారి ‘ఆప్ క్యా బాత్ కర్ రహే, పీవోకే, ఆక్సాయ్‌చిన్ ఇస్ దేశ్‌కా హిస్సా నయ్ మాన్‌తే… పూరాకాపూరా కశ్మీర్ హమారా దేశ్‌కా హిస్సా థా, హై, రహేగా’ అని (ఏం మాట్లాడుతున్నారు మీరు..? పీవోకే, ఆక్సాయ్‌చిన్ ఈ దేశంలోని ప్రాంతాలు కావు అంటున్నారా..? మొత్తం కశ్మీర్ ఈ దేశంలో భాగంగానే ఉంది, ఉంటోంది, ఉంటుంది) సీరియస్‌గా ప్రశ్నిస్తున్నాడు పార్లమెంటులో… ఎన్నికలకు ముందు ప్రత్యేకించి కాంగ్రెస్, కమ్యూనిస్టు ప్రతిపక్షాలను అడుగుతున్నట్టుగా..?
Share this Article