రజినీకాంత్ ఇమేజీ అసాధారణం… ప్రేక్షకులు తన నుంచి ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తారు… థియేటర్ విజిళ్లతో దద్దరిల్లిపోవాలి… దశాబ్దాలుగా తనను చూస్తూనే ఉన్నా సరే… తన డైలాగులు, తన మేనరిజమ్స్, తన ఎలివేషన్, ఎమోషన్స్ ఎట్సెట్రా కావాలి… ఏమాత్రం తగ్గినా సరే సినిమా ఢమాల్… ఈ అతి అంచనాలే రజినీకాంత్ సినిమాలకు బలం, బలహీనత కూడా…
తను మారలేడు… జనం మారనివ్వరు… అలాగని రొటీన్ మొనాటనస్ సినిమాలు తీస్తే క్రమేపీ తన మీద న్యూట్రల్ ఆడియెన్స్ ఆసక్తిని చంపేసుకుంటున్నారు… వయస్సు మీద పడింది… ఏ పాత్రలు కావాలో, ఏవి చేయాలో తెలుసుకోలేక రజినీ కెరీర్ అత్యంత సందిగ్ధావస్థలో ఉంది… నిజానికి తను రిటైరయిపోయి విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సు… ఇంకా ఏదేదో చేసేయాలని అనుకుంటున్నాడు…
లాల్ సలాం సినిమాలో తనది గెస్ట్ రోల్‌కు ఎక్కువ, కేరక్టర్ ఆర్టిస్టుకు తక్కువ… ఎడాపెడా ఎమోషన్స్‌తో యాక్షన్ సీన్లతో ఆడుకునే పాత్ర కాదు… ఆయన బిడ్డ ఐశ్వర్య తన డాడీని ఏదో కొత్తగా చూపిస్తున్నాను అనుకుంది… ఈ పాత్ర గురించి విని, నేనే చేస్తాను అని ముందుకొచ్చాడు మా మంచి నాన్న అని గొప్పగా చెప్పుకుంది… తను పోషించిన మొయిద్దీన్ పాత్రను ఎలివేట్ చేయడం కోసం, అబ్బే, అందరూ అలా అంటారు గానీ మా నాన్న సంఘీ కాదు అన్నట్టుగా, సంఘీ అంటే అదేదో తిట్టుపదం అన్నట్టుగా ప్రెస్ మీట్లలో మాట్లాడింది…
Ads
నిజానికి ఆమె దర్శకత్వమే ఈ సినిమాకు పెద్ద మైనస్… ఏదో సామాజిక సందేశం ఇస్తూ నాన్న ఇమేజీని డిఫరెంటుగా బాగా పెంచుతున్నట్టు ఫీలైంది… కానీ హిందూ ముస్లిం మనస్పర్థలు… మతంకన్నా మానవత్వమే మిన్న అనే సందేశాత్మక సినిమాలు ఇప్పటికే లక్షాతొంభయ్యారు వచ్చాయి… అంతెందుకు, అదే సంఖ్యలో తెలుగు టీవీల్లో ఖడ్గం అనే సినిమా వచ్చింది… పాపం శమించుగాక… లాల్ సలాంలో రజినీకన్నా ఖడ్డంలో ప్రకాష్ రాజ్ డైలాగ్స్ థియేటర్లలో బాగా పేలాయి, చప్పట్లు కొట్టించుకున్నయ్…
‘ఏం చంపేస్తారా..? ఈ దేశం మాది కాదా..? ఇక్కడే పుట్టాం, ఇక్కడే చస్తాం, ఇది మాదేశమే’ అని ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ అల్టిమేట్… ప్యూర్ ఇండియన్ ముస్లిం పాత్ర… ఏదో ఊళ్లో రెండు క్రికెట్ టీమ్స్ నడుమ స్పర్థ… దానికి మతం రంగు పూసి ఏదో కథ చెప్పబోయింది ఐశ్వర్య… కానీ అంతగా వర్కవుట్ కాలేదు… ఐనా, సాదాసీదాగా ఓ టీవీ సీరియల్‌లాగా కథ నడిస్తే అందులో రజినీయే ఎందుకు..? కపిల్ దేశ్ అతిథి పాత్ర, జీవిత రాజశేఖర్ రీఎంట్రీ వంటివీ ఇట్టే తేలిపోయాయి…
విష్ణు విశాల్, విక్రాంత్ మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆనరు… ఎక్కడో చదివాను… ఏమాత్రం బజ్ లేదు, ప్రేక్షకులు లేరు, దాంతో పలు థియేటర్లలో మార్నింగ్ షోలను రద్దు చేశారు అని… ఒక్కసారి ఊహించండి… ఎక్కడి రజినీకాంత్..? ఇదెక్కడి షోల రద్దు… అదీ ఫస్ట్ డే… ఫాఫం… రజినీ… అటు రాజకీయాలకు పనికిరానని నువ్వే చెప్పావు… ఇంకా ఎందుకు నీకు ఇలాంటి సినిమాలు భాయ్..? ఓ ఫ్యాన్‌గా సారీ టు ఆస్క్ … ఇది మన రజినీకాంత్ సినిమాయేనా…!! నిజం చెప్పు ఐశ్వర్యా…!!
చివరగా… లాల్ సలాం అని టైటిల్ చూసి, ఇదేదో ఎర్ర సినిమా అనుకుని వెళ్తారేమో… కమ్యూనిస్టులూ, అంత సీన్ లేదు… తమాయించుకొండి…
Share this Article