Pardha Saradhi Potluri… పార్లమెంట్ కాంటీన్ లో మోడీ ముచ్చట్లు! నేను మిమ్మల్ని కాసేపు విసిగిస్తాను… మోడీ!
నిన్న పార్లమెంట్ కాంటీన్ లో భోజనం చేస్తున్న పార్లమెంట్ సభ్యులతో హఠాత్తుగా అక్కడికి చేరుకున్న మోడీ అన్న మాటలు అవి! సహచర సభ్యులతో కలిసి భోజనం చేసిన మోడీ సరదాగా వారితో సంభాషించారు! ఇదెలా జరిగింది అంటే…..
భోజనం చేయడానికీ కాంటీన్ కి వచ్చిన మోడీ అప్పటికే అక్కడున్న పలువురు పార్లమెంట్ సభ్యులతో ‘కాసేపు మిమ్మల్ని విసిగిస్తాను, నాతో కలిసి భోజనం చేయండి’ అంటూ నవ్వుతూ చమత్కారంగా ఆహ్వానించారు! మోడీ తనతో కలిసి భోజనం చేయండని ఆహ్వానించిన సభ్యులు ఎవరంటే.,.
Ads
రామ్ మోహన్ నాయుడు… టీడీపీ
రితేష్ పాండే…. బీఎస్పీ
జమ్యాంగ్ నంగ్యాల్ … లాదక్ బీజేపీ
ఎల్. మురుగన్… కేంద్ర మంత్రి
సస్మిత్ పాత్ర… బిజూ జనతాదళ్
హీనా గవిట్… బీజేపీ మహారాష్ట్ర
********************
అన్నం, పప్పు, కిచిడీతో పాటు నువ్వులతో చేసిన లడ్డులని వడ్డించారు శాఖాహార భోజనంలో… మొత్తం 45 నిముషాలపాటు ఆ సహచర సభ్యులతో కలిసి భోజనం చేసిన మోడీసహచర సభ్యుల ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు ఛలోక్తులతో !
భోజనాలయ్యాక కాంటీన్ బయటికి వచ్చిన ఒక సభ్యుడు వార్తా సంస్థ విలేఖరి అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ… ‘‘మేము అస్సలు ఊహించని పరిణామం ఇది… మోడీజీ మమ్మల్ని తనతో కలిసి భోజనం చేయండి పిలుస్తారు అని అనుకోలేదు. మేము మన దేశ ప్రధానితో కలిసి భోజనం చేస్తున్నట్లుగా అనిపించలేదు. ఒక స్నేహితుడితో కలిసి భోజనం చేసిన అనుభూతిని పొందాము’’ అన్నాడు.
విలేఖరి: మీరేమన్నా ప్రశ్నలు అడిగారా మోడీని..?
సభ్యుడు : అడిగాము, మోడీజీ, మీరు ఉదయం నిద్ర లేవగానే ఏమేమి పనులు చేస్తారు? చాలా బిజీ షెడ్యూల్ ఎలా పూర్తి చేయగలుగుతున్నారు అని? భగవంతుడు శక్తిని ఇచ్చాడు, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నంత వరకు నేను అలిసిపోను అన్నారు మోడీజీ
విలేఖరి: మీతో ఇంకా ఏమన్నా మాట్లాడారా..?
సభ్యుడు: మోడీజీ తన ఆశ్చర్యకరమయిన పాక్ పర్యటన గురించి, ఆపై నవాజ్ షరీఫ్ తో భేటీ అవడం గురించి చెపుతూ, ఇప్పుడు మళ్లీ నవాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గురించి,తన విదేశీ పర్యటనల గురించి మాట్లాడారు.
2018 లో అబుధాబి పర్యటనలో తాను హిందూ దేవాలయానికి శంఖుస్థాపన చేశాననీ, వచ్చే వారం ఆ గుడి ప్రారంభోత్సవానికి వెళుతున్నాననీ, అది సంతోషకరమైన వార్త అనీ అన్నారు.
******************
మోడీ అడుగుల్లో ఏదో ఉంటుంది… అలాగే ఈ భోజన ముచ్చట్లు యాదృచ్ఛికం కాకపోవచ్చు… మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ మోడీ ఆలోచిస్తున్న ఇంకేదో ప్రణాళికకు ఇది శ్రీకారం కావచ్చు..!!
Share this Article