Nationalist Narasinga Rao……. ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడం / రాజీపడటమ్ అనే నెరేషన్ బిల్డప్ చేయాలని అనే దృక్పథం ఎందుకు …?
నిజంగా ముఖ్యమంత్రి కేంద్రంతో ఫైట్ చేసి ఏం సాధిస్తాడు? గుజరాత్ కు 12 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా అప్పుడు అన్ని అంశాలలో కేంద్రంతో విభేదించి ఫైట్ చేయలేదు కదా….కేంద్రానికి అయినా రాష్ట్రానికి అయినా ఇచ్చి పుచ్చుకునే దోరణి ఉండటం ఫెడరల్ సిస్టంలో మంచిది…
రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు వేరు… అవినీతి కేసుల మీద చర్యలు తీసుకోవడం వేరు… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధం వేరు… వీటన్నింటినీ వేరు వేరుగా చూడాలి కానీ ఒకే గాటలో కలిపి చూసి, రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం అని కానీ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకుంటున్నాయి అని వ్రాయడం సబబు అనిపించుకోదు అనుకుంటా…
Ads
నిజంగా అలాగే జరిగితే జ్యోతిబసు, మాణిక్ సర్కార్, నరేంద్ర మోడీ ( 10 ఏండ్లు), మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కెసిఆర్ ( వరుస రెండు టర్మ్ లు) సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళే కాదు కదా…
మనకు ఇన్ని ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నా కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి ఆదివారం కొత్తపలుకుల నెగటివ్ నేరేషన్ బిల్డప్ చేయాలని వ్రాశాడు… ఇక్కడ అందరి గురించి ప్రస్తావించి నవీన్ పట్నాయక్ పేరు అసలు ప్రస్తావనలోకే తీసుకొని రాలేదు… ఆయన రాజీ పడటం, ఎదిరించడం అని కాకుండా నిజమైన ఫెడరల్ స్ఫూర్తికి ఉదాహరణగా ఉన్నాడు కాబట్టే ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు…
కొత్త పలుకులో రాధాకృష్ణ. శరద్ పవార్ ప్రస్తావన చేస్తూ మోడీని వ్యతిరేకించిన కారణాల వల్ల తన పార్టీని కూడా కోల్పోయాడు అని వ్రాశాడు….. ఇదే నిజమా? కాదు కదా…. ప్రజలు ఎన్నుకున్న కూటమిని కాదని, మనకు బలం ఉంది కదాని కూటమిలో ఉన్న శివసేనతో ప్రభుత్వం ఏర్పాటు చేశాడు…. బిజెపి వాళ్ళు అదును కోసం చూసి వాళ్ళ టైం రాగానే వాళ్ళ పని వాళ్ళూ చేశారు…
ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిని చేసేటప్పుడు అంత అనుభవం ఉన్న శరద్ పవార్… శివసేన, NCP, కాంగ్రెస్ నడుమ భావజాల తేడాలు ఉన్నాయి … మాకు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోమని, అంతవరకు మాత్రమే సీట్లు ఇచ్చారు, మేము ఈ టర్మ్ లో ప్రతిపక్షంలో ఉంటాం అని అంటే పవార్ ఖ్యాతి ఎంతో పెరిగేది… పవార్ రాజకీయం చేశాడు, బిజెపి కూడా రాజకీయం చేసింది టిట్ ఫర్ టాట్…
ఇక తమిళనాడు మంత్రులు, ఢిల్లీ ఇద్దరు మంత్రుల ప్రస్తావన తీసుకొస్తూ కేజ్రీవాల్ కూడా రాబోయే రోజుల్లో అరెస్ట్ అవుతున్నాడు అని వ్రాశాడు… స్టాలిన్ దగ్గర కానీ, కేజ్రీవాల్ దగ్గర కానీ ఇతర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ ఎవరి మీద కేసులు లేనిది ఈ ముగ్గురు మీదనే ఉన్నాయి ఎందుకు అని మాత్రం రాధాకృష్ణ ఆలోచన చేయడం లేదు… వీళ్ళు తప్పు చేశారు న్యాయస్థానాలకు వెళ్లారు … కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో ఉన్నారు… కొత్త పలుకులో ఈ లాజిక్ కూడా మర్చిపోయి కేవలం చంద్రబాబుకు కావలసిన అంశాలు మాత్రమే టచ్ చేశాడు…
ఈ వెర్షన్‌ను ‘ముచ్చట’ మరింత పొడిగిస్తోంది ఇలా… వోకే, రాజకీయ కారణాలతోనే తమిళనాడు, ఆప్ మంత్రులు జైళ్లలో ఉన్నారు అనుకుందాం కాసేపు… వాళ్లేమీ శుద్ధపూసలు కాదు కదా… పొలిటికల్ కారణాలతోనైనా సరే కొందరు అక్రమార్కులు కటకటాల వెనక్కి వెళ్లడం మంచిదే కదా… తమిళనాడు మంత్రుల గురించి సుప్రీం మొన్న ఏమన్నదో చదివావా రాధాకృష్ణా..? అరెస్టయిన హేమంత్ సోరెన్ అక్రమాల గురించి చదివావా..?
అప్పట్లో గుజరాత్ అల్లర్ల వేళ వాజపేయి నరేంద్ర మోడీ తల నరకబోయి, అద్వానీ మద్దతు ఇచ్చేసరికి… ఫో ఫోయి, చంద్రబాబుకు చెప్పుకోపో అన్నాడట వాజపేయి.., సదరు మోడీకి చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదట… మరి ఇప్పుడు ఎందుకీ నిజపాద దర్శనాల వెంపర్లాట..?
సరే, తరువాత టీడీపీతో దోస్తీ చేశాడు కదా, తరువాత వెన్నుపోటు పొడిచిందెవరు..? మోడీ భార్యను కూడా రాజకీయాల్లోకి తెచ్చి తూలనాడింది, మోడీ అంతు చూస్తామన్నది ఎవరు..? టీడీపీకి బీజేపీ అవసరం లేదట, కానీ ఎన్నికలు సజావుగా జరగాలంటే బీజేపీతో దోస్తీ అవసరమట… అందుకని ఫాఫం చంద్రబాబు రాజీపడి, బీజేపీతో దోస్తీకి తహతహలాడిపోతున్నాడట… మరీ దరిద్రమైన వాదన… పిచ్చి తర్కం, నాడు రాహుల్‌తో చేతులు కలిపి, ఇది దేశం కోసం అని రాసుకొచ్చింది యెల్లో మీడియా… తప్పలేదట.., ఇప్పుడేమో రాష్ట్రం కోసం మళ్లీ బీజేపీతో దోస్తీ తప్పడం లేదట…!!
Share this Article