Pardha Saradhi Potluri ….. ఫిబ్రవరి 6, 2024… ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధమీ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
భారత్ లో UCC ను ప్రవేశ పెట్టిన మొదటి రాష్ట్రం అయ్యింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత, తిరిగి గవర్నర్ దగ్గరికి వెళ్లి ఆమోదం పొందిన తరువాత చట్టం అమలులోకి వస్తుంది. ఉత్తరాఖండ్ UCC బిల్లు అమలులోకి వస్తే ఎలాంటి చట్ట పరమయిన మార్పులు వస్తాయి?
1.UCC అమలులోకి వస్తే హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం రద్దు అవుతాయి.
Ads
2. క్రైస్తవ వివాహ చట్టం మరియు విడాకుల చట్టం రద్దు అవుతాయి.
3. పార్సీ వివాహ మరియు విడాకుల చట్టం రద్దు అవుతాయి.
4. ముస్లిం పర్సనల్ లా (షరియ) అప్లికేషన్ యాక్ట్ 1937 చట్టం రద్దు అవుతుంది.
5. నిఖా హలాల లేదా ఇద్దత్ (ముస్లిం మహిళ భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్నా నిర్ణీత సమయం తరువాత మాత్రమే తిరిగి వివాహం చేసుకునే విధానం) ఇప్పుడు క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ కేసులు నమోదు అవుతాయి.
6. అన్ని మత విశ్వాసాలలో ఉన్న బాలికల వివాహం ఒకే రీతిన జరగాలి అంటే బాలికల వివాహ వయస్సు 18, యువకుల వివాహ వయస్సు 21 గా ఉండాలి. మతం ఏదైనా సరే వివాహాలను రిజిష్టర్ చేయాల్సి ఉంటుంది.
7. పోలిగమి (Polygamy) అంటే భార్యకి విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకోవడం నేరంగా పరిగణిస్తూ కేసులు నమోదు చేస్తారు.
8. విడాకుల విషయంలో భార్య, భర్తల కారణాలు సమంగా ఉండాలి.
9.సహ జీవనం (Live-in relationship) చేసే వారు కూడా తమ బంధాన్ని తప్పనిసరిగా రిజిష్టర్ చేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు సంబంధాలు పెట్టుకుంటే నేరంగా పరిగణిస్తారు.
10. ఆడ మగ లేదా LGBT లు అయినా సరే రిజిష్టర్ చేయాల్సి ఉంటుంది.
11. వారసత్వ హక్కులు, పిల్లలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. పిల్లలు చట్టబద్ధమైన భార్య ద్వారా కలిగిన వారికి, అక్రమ సంబంధం ద్వారా కలిగిన వారికి కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది.
12. సంపాదిస్తున్న కొడుకు చనిపోతే అతని భార్యతో పాటు తల్లిదండ్రులకు సమాన హక్కులు ఉంటాయి.
13. షెడ్యూల్ జాతుల వారికి UCC వర్తించదు. వారి వారి ఆచారాలు, సాంప్రదాయాలు ఇదివరకటి లాగే కొనసాగుతాయి.
***********************
ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన UCC బిల్లుని సుప్రీమ్ కోర్టులో ఛాలెంజ్ చేస్తే నిలుస్తుందా? నూరు శాతం సుప్రీం కోర్టు సమర్ధిస్తుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన UCC బిల్లుపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లని కొట్టివేసింది. సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది UCC అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉండాల్సిందే అని… ఏ రాష్ట్ర ప్రభుత్వమూ UCC ను విస్మరించడానికి వీలు లేదు.
****************
UCC అనేది రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ వాడుకుంటున్నదా? ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉంటాయి? అన్ని మత విశ్వాసాల వారికి ఒకే రకమయిన హక్కులు, బాధ్యతలని ఇస్తున్నప్పడు ? Dr బాబా సాహెబ్ అంబేద్కర్ UCC ను అమలు చేయాలి అని గట్టిగా వాదించాడు.
***************
మోడీ, అమిత్ షా లు కలిసి చాలా శ్రద్ధగా UCC విధి విధానాలు రూపొందించడానికి కృషి చేశారు. ఎలా? రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ అధ్యక్షతన 5 గురు సభ్యుల ప్యానెల్ UCC విధి విధానాలు రూపొందించింది. వివిధ వర్గాల నుంచి అందిన 2 లక్షల 33 వేల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని వాటిని సమగ్రంగా పరిశీలించిన తరువాతే విధి, విధానాలు రూపొందించారు! ఇది చాలా కాలం పాటు కొనసాగిన సుదీర్ఘ ప్రక్రియ. అందుకే UCC అమలు చేయడానికి ఇంత సమయం పట్టింది.
*************
ఇప్పటికే గోవాలో UCC అమలులో ఉంది, పోర్చుగీసు చట్టం 1867 నుండి. ఉత్తరాఖండ్ మొదటి రాష్ట్రం అవుతుంది భారతీయ UCC ను అమలు చేస్తున్న రాష్ట్రం. ఉత్తరాఖండ్ తో పాటు అస్సాం, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నారు. మోడీ 3.0 అంటే 2024 జనరల్ ఎలక్షన్స్ తరువాత మిగతా రాష్ట్రాలలో అమలు చేస్తారు…
(యూనిఫాం సివిల్ కోడ్ అనేది సామాజిక విషయాలకు సంబంధించిన భారతీయ చట్టం. ఇది వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం మొదలైన అంశాలలో అన్ని మతాల ప్రజలకు సమానంగా వర్తిస్తుంది. అంటే, భారతదేశం అంతటా భిన్న సంస్కృతులు, మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే న్యాయాన్ని అందించడానికి వీలు కల్పించడం అన్నమాట)
Share this Article