Shrinivas Beebireddy……. అయోధ్య వెళ్లేవారికి, వచ్చే వారికి సమాచార నిమిత్తం… వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి, మిగతాదంతా కాకానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు…
ట్రైన్ సమయం కంటే రెండు గంటల ముందు వెళ్ళండి, స్టేషన్ లో ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు, ఆ ఐడి కార్డు ఉంటేనే ట్రైన్ లోకి అనుమతి…
ట్రైన్ లో మనకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇస్తారు, కానీ కూరలో ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు వెంట తెచ్చుకోండి, వంట నార్త్ వాళ్ళ లాగా ఉంటుంది. తెచ్చుకునే వాళ్ళు పచ్చళ్లు తెచ్చుకోండి…
Ads
మనకు ట్రైన్ లో బెడ్ షీట్, దుప్పటి, దిండు (pillow) వాళ్లే ఇస్తున్నారు. ట్రైన్ లో వసతిలో, ముఖ్యంగా చద్దర్లు వాళ్లే ఇస్తారు కాబట్టి ఎక్కువ తక్కువ తెచ్చుకోకండి.
ట్రైన్ కూడా చాలా నీటిగా మెయింటైన్ చేస్తున్నారు. ట్రైన్ లో వెళ్తున్న రామభక్తులకు VIPల కంటే ఎక్కువ భద్రత ఇస్తున్నారు పోలీసులు. ట్రైన్ ఆగే స్టేషన్లలో పోలీసులు ప్రతి బోగీ దగ్గర ఎవరూ ఎక్కకుండా, ఎవరు దిగకుండా పహారా కాస్తున్నరు. మనల్ని అయోధ్యకి 16 కిలోమీటర్ దూరంలో ఉన్న సాలర్ పూర్ దగ్గర దింపుతున్నారు. అక్కడి నుండి మనల్ని బస్సు లో (ఫ్రీ) తీసుకెళ్లి అయోధ్యకు 3,4 కిలోమీటర్ దూరంలో మనకు ఏర్పాటు చేసిన వసతి దగ్గర దింపుతారు…
అక్కడ మనకు 200 మందికి కలిపి ఒక హాల్ ఏర్పాటు చేసారు. మగవారికి, ఆడవారికి వేర్వేరు. ఆ వసతి ఏర్పాటు చేసిన హాల్ లోపలికి వెళ్ళడానికి ఐడి కార్డు తప్పనిసరి. ఆ హాల్ లో 200 బెడ్లు, బెడ్ షీట్, దుప్పటి, దిండు ఇస్తున్నారు మరియు బాత్రూం, వాష్రూమ్ ఏర్పాటు చేసారు…
ఎవరి దర్శనానికి వారు వెళ్లడమే… ప్రత్యేక దర్శనం అంటూ ఏమీ లేదు… ఎంత మంది ఉన్నా 2 గంటల్లోపు ఆ రామయ్య దర్శనం మనకు అవుతుంది… రామ్ మందిర్ దర్శనం కంటే ముందు హనుమాన్ గర్హి (హనుమంతుని ఇల్లు) దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది
గుడికి వెళ్లే దారిలో చాలా మంది దొంగలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వెండి, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులు తీసుకురాకపోవడం ఉత్తమం…
ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నందున దొంగలు కలిసిపోయారు జనాలలో… దర్శనం చేసుకున్న తర్వాత చాలా సమయం ఉంటుంది, వెళ్లాలనుకున్న వారు కాశి లేదా లోకల్ టెంపుల్స్ తిరిగి రావచ్చు… మళ్ళీ తరవాత రోజు ట్రైన్ సమయం కంటే 2 గంటల ముందు మనకు వసతి ఏర్పాటు చేసిన స్థలానికి బస్సు లు వస్తాయి… ఆ బస్సులు మళ్ళీ తిరిగి మనల్ని సాలర్ పూర్ రైల్వే స్టేషన్ దగ్గర దింపుతారు…
తిరిగి ట్రైన్ ఎక్కేటప్పుడు ఐడి కార్డు కూడా తప్పనిసరిగా అడుగుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఐడి కార్డును పోగొట్టకూడదు. ఐడి కార్డు మనకు ట్రైన్ టికెట్…
ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత అంతా సేమ్ టు సేమ్, మళ్ళీ తిరిగి మనల్ని మనం ఎక్కిన స్టేషన్ లో దింపుతారు. బంగారం మాత్రం ఎవరూ తీసుకురావద్దు. మహిళలు దర్శనానికి వెళ్ళేటప్పుడు మంగళ సూత్రం కవర్ అయ్యేలా కొంగు వేసుకోవాలి…
రోజుకు 8 లక్షల మంది జనాభా వస్తున్నారు. మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా తీసుకునే స్టేజ్ లో పోలీస్ వ్యవస్థ ఉండదు. మనమే జాగ్రత్త పడడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా గ్రూప్ గా ఉండండి. బాల రాముని దర్శనం చేసుకొని రండి…
Share this Article