ఒక పుస్తకం గురించి చెబుతాను… ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆధ్యాత్మిక అన్వేషణలో సాగించిన ఓ యాత్ర గురించిన పుస్తకం అది… స్వామి రాసిన అద్బుతమైన పుస్తకం తెలుగు ట్రాన్సలేషన్ కూడా తీసుకువచ్చారు… లాస్ట్ ఇయర్ ఇది నేషనల్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది… ఇండియాలో టాప్ పబ్లిషింగ్ హౌస్ లలో ఒకటైన Harper Collins Publishers వారి దగ్గర రైట్స్ తీసుకుని ఇంగ్లీష్ టు తెలుగు చేసారు. ఇప్పటికే ఈ పుస్తకం హిందీ, మరాఠీ, కన్నడ ఇలా వేర్వేరు భాషల్లో వచ్చింది…
ఈ పుస్తకంలో… ఓ సామాన్య సాఫ్ట్ వేర్ ఇంజినీర్ … ఆధ్యాత్మిక ప్రయాణం హిమాలయాల్లో సాగించిన వైనం అద్బుతం అనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా జగన్మాత దర్శనం ఎపిసోడ్ అయితే ఒళ్ళు గగుర్పొడిపిస్తుంది… అవే ఈ పుస్తకం తెలుగుకు తెచ్చేలా ప్రేరేపించాయి. డాక్టర్ గారు Sathya Karri చేసిన అనువాదం కూడా చాలా సింపుల్ గా ఆసక్తికరంగా ఉంది…
ఈ స్వామీజి బుక్ అనువాదం చేసిన డాక్టర్ గారి (Dr. Satyanarayana K. MD (Gen) DM (Gastro) …. ఇంటర్వూ ఇలా ఉంది…
Ads
స్వామీజి గురించి మీకు మొదట ఎప్పుడు తెలిసింది… ఆ అనుభవం..?
2016 లో quora లో “జెన్యూన్ స్పిరిచ్యువల్ మాస్టర్స్” అని సెర్చ్ చేస్తుండగా ఓం స్వామిజీ గురించి తెలిసింది. తర్వాత నేను ఇంగ్లీష్ లో పబ్లిష్ అయిన స్వామీజీ memoire చదివి అదే సంవత్సరంలో ఆశ్రమానికి వెళ్లి ఆయనను కలిశాను. అప్పట్లో స్వామీజీతో రెండు నిమిషాల పర్సనల్ మీటింగ్ కు అవకాశం ఉండేది.
.. ఎందుకు ప్రత్యేకంగా ఈ స్వామిజీ వైపు ఎట్రాక్ట్ అయ్యారు..?
ఆయన గురించి చదివి, విని, ఆ తర్వాత ఆయనను చూసాక, ఆయనలోని దివ్యత్వం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అన్న భావన కలిగి అట్రాక్ట్ అయ్యాను
.. మీరు డాక్టర్ కదా.. సైన్స్ కు ఈ వేదాంతానికి పొత్తు కుదురుతుందా.. ఎప్పుడూ ఇదో మూఢనమ్మకం అని మీ మనస్సు కొట్టిపారేయలేదా..?
ఈ కాన్సెప్ట్ ప్రాథమికంగా వెస్టర్న్ అనేది నా అభిప్రాయం. నా వరకైతే రెండింటి మధ్య విభేదం లేదు. వివేకానంద స్వామి అంతటివాడు తన స్వీయ అనుభవంతో నిర్ధారించి విభేదించనప్పుడు నేనెంత?
… స్వామిజీ ఆశ్రమానికి ఎప్పుడు వెళ్లారు.. తొలి సారి ఆయన దర్శనం లభించినప్పుడు మీ అనుభూతి..?
2016 లో… ఆయన దర్శనం.. దైవం మానుష రూపేణ.. అన్న భావనను జాగృతం చేసింది..
ఈ పుస్తకం ట్రాన్సలేట్ చేయాలని ఎందుకు అనిపించింది. ఎవరు చదవాలని ఈ పుస్తకం అనువదించారు..?
తెలుగు ప్రజలు, ముఖ్యంగా అన్ని వర్గాల వారు స్వామీజీ గురించి , ఆయన సాధన మొదలైనవి తెలుసుకోవాలని.., తద్వారా ఆయన అద్భుతంగా రూపొందించిన “sadhana” ఆప్ ను ఉపయోగించుకొని ప్రయోజనం పొందాలనేది నా ముఖ్య ఉద్దేశం… సనాతన ధర్మ పునరుద్దరణకు వారధిగా సాధన ఆప్ పనిచేసి అంతిమంగా సాధకుడ్నిఆత్మ సాక్షాత్కారానికి చేరుస్తుంది. ఇది స్వామీజీ ఆశయం అని నా అభిప్రాయం. తొందరలోనే sadhana app తెలుగు భాషలో కూడా అందుబాటులోకి వస్తుందని నా నమ్మకం.
… మీరు రోజు వారి ధ్యానం చేస్తారా.. స్వామిజీ మార్గంలో మీకు నచ్చినవి ఏమిటి.. మీరు అనుసరించేవి ఏమిటి..?
“జీవించండి, ప్రేమించండి, నవ్వండి, ఇవ్వండి (live, love, laugh, give )” ఇది ఆయన సందేశం. (ఫలానావి నాకు నచ్చినవి అని చెప్పే స్థాయి , అర్హత నాకు లేదు) స్వామీజీ రూపొందించిన “సాధన” ఆప్ ద్వారా కొంత మంత్ర సాధన చేసే ప్రయత్నంలో ఉన్నాను. Black Lotus app ద్వారా ధ్యానం కూడా చేయవచ్చు.
అనువాదం ఇదే మొదటి సారా.. ఇంతకు ముందు ఏమన్నా చేసారా..?
మొదటి సారి…
మొదటి సారైతే …ఇలాంటి ఆధ్యాత్మిక పుస్తకం కష్టమనిపించలేదా.. అందులోనూ చాలా పెధ్ద పుస్తకం..?
చాలా కష్టమనిపించింది. ఒక్కోసారి ఒక సెంటెన్స్ లోని అర్థం మారకుండా ట్రాన్స్లేట్ చెయ్యడానికి ఒకటి రెండ్రోజులు పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి
.. మీకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన అధ్యాయం ఏది… ఐ మీన్ హాంట్ చేసింది..?
13 చాప్టర్. హిమాలయ వనాలు
ఇంకా ఏమన్నా పుస్తకాలు రాసే లేదా అనువదించాలనుకుంటున్నారా..?
ఆలోచన ఉంది. ఆపై స్వామీజీ కృప , భగవదనుగ్రహం…
పుస్తకం కావాలి అనుకునే వాళ్లు పుస్తకం ఖరీదు 250 ప్లస్ పోస్టల్ ఛార్జెస్ 70 కలిపి ఈ పోన్ నెంబర్ 9704683520 కు జీ పే లేదా ఫోన్ పే ద్వారా చేసి, ఎడ్రస్ వాట్సప్ లో క్లియర్ గా పెట్టండి..
Share this Article