మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు! అలాగే తన శాససభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు!
తన రాజీనామా లేఖను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ను కలిసి అందచేశారు.
అశోక్ చవాన్ మహారాష్ట్రలోని భోకర్ (Bhokar) అసెంబ్లీ నియోజకవర్గంకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అశోక్ చవాన్ కనుక బీజేపీ లో చేరితే అది నాందేడ్ ప్రాంతంలో కాంగ్రెస్ కి చావు దెబ్బ అవుతుంది!
*****************
అశోక్ చవాన్ తండ్రి శంకర్ రావ్ చవాన్ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాందేడ్ రీజియన్ లో శంకర్ రావ్ చవాన్ కి ఎంత పట్టు ఉండేదో దానిని అశోక్ చవాన్ కొనసాగిస్తూ వచ్చాడు ఇన్నాళ్ళూ!
Ads
చవాన్ కుటుంబం నాందేడ్ రీజియన్ లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు సంపాదించి పెడుతూ వచ్చింది. నిజానికి శరద్ పవార్ కి చెరుకు పండించే ప్రాంతాలలో పట్టు ఉన్నా, అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడం వలన కొద్దో గొప్పో అక్కడ నిలబడి ఉంది.
ఇప్పుడు అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో విదర్భలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా పోయింది. నిజానికి ఇది మాస్టర్ స్ట్రోక్ అనే అనాలి. ఎందుకంటే ముందు విదర్భలో పట్టు ఉన్న శరద్ పవార్ NCP ను నిర్వీర్యం చేసింది బీజేపీ. ఇప్పుడు అశోక్ చవాన్ తో పూర్తిగా తుడిచేసింది బీజేపీ.
ఎన్నికలప్పుడు శరద్ పవార్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే వాడు. దాంతో విదర్భ ప్రాంతంలో NCP, కాంగ్రెస్ కి తప్ప ఇతర రాజకీయ పార్టీలకి అవకాశం ఉండేది కాదు! చివరికి శివసేన కూడా ఆ ప్రాంతంలో ప్రభావం చూపలేకపోయింది.
*******************
ముందు అజిత్ పవార్ ను శరద్ పవార్ నుండి వేరు చేసి శరద్ పవార్ కి పార్టీ మీద పట్టు లేకుండా చేయడంలో ఫడ్నవీస్ సఫలం అయ్యారు! అజిత్ పవార్ వర్గందే అసలయిన NCP అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సో! NCP NDA తో కలిసి పోటీ చేయడం జరుగుతుంది!
ఇప్పుడు అశోక్ చవాన్ ను కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడంతో మరో విజయం దక్కింది. ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఏమిటీ అని బుగ్గలు నొక్కుకొన్న బీజేపీ అభిమానులకి చిత్రం అర్థమవుతుంది ఇప్పుడు.
*********************
అయితే అశోక్ చవాన్ ను కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడంలో ఫడ్నవీస్ ఎలాంటి అనైతిక చర్యలకి పాల్పడలేదు. అశోక్ చవాన్ ను కాంగ్రెస్ దూరం పెట్టడంతో చాల కాలం నుండి అశోక్ చవాన్ అసంతృప్తితో ఉన్నాడు.
ముఖ్యంగా మహారాష్ట్ర PCC అధ్యక్షుడు అయిన నానా పటోలే (Nana Patole) తో అశోక్ చవాన్ కి తీవ్ర విభేదాలు ఉన్నాయి. అది అభ్యర్థుల ఎంపిక మీద! అశోక్ చవాన్ సూచించిన వారికి కాకుండా అతని ప్రత్యర్థులకు టికెట్ ఇవ్వాలని నానా పటోలే చేస్తున్న ప్రయ్నాలను అశోక్ చవాన్ సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
ఇది గమనించిన ఫడ్నవీస్ చవాన్ కి ఆఫర్ ఇచ్చాడు. ఇది ఎలాంటిది అంటే కొమ్మ నుండి రాలుతున్న పువ్వును దోసిలిపట్టి కింద పడకుండా చూడడం అన్నమాట!
**********************
అశోక్ చవాన్ విద్యార్థి దశలోనే కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసి ఆ తరువాత రెండు సార్లు ఉభయ సభలలో సభ్యుడిగా, మహారాష్ట్ర PCC అధ్యక్షుడుగా ఆపై మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ముంబయి టెర్రర్ ఎటాక్ తరువాత విలాస్ రావ్ దేశ్ ముఖ్ రాజీనామా చేసిన తరువాత అశోక్ చవాన్ ముఖ్యమంత్రి అయ్యాడు! అలాంటి వారిని నిర్లక్ష్యం చేయడం సోనియా రాహుల్ లది తప్పు. అఫ్కోర్స్! అశోక్ చవాన్ ఇంకా బీజేపీలో చేరలేదు.
***********************
ఢిల్లీలో కూర్చోని మైక్ పట్టుకొని పదే పదే బీజేపీనీ విమరిస్తూ ఉండే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మిలింద్ దేవరా నెల క్రితమే ఏకనాథ షిండే శివసేనలో చేరిపోయాడు! ఎందుకిలా?
ఢిల్లీలో ఉండి పార్టీ సమస్యల మీద దృష్టి పెట్టాల్సింది పోయి పాదయాత్ర చేస్తున్నాడు రాహుల్! ఆ స్థితికి తీసుకొచ్చింది బీజేపీ! అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నామ్ కే వాస్తే! నీ మాట ఎవరు వింటారు! మేము సోనియా లేదా రాహుల్ కి చెప్పుకుంటాం అనే ధోరణిలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు!
***************************
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్ బీజేపీలో చేరబోతున్నడా? సోనియాకి అత్యంత సన్నిహితుడు అయిన కమల్ నాథ్ అయోధ్య వెళ్లి మర్యాద పురుషోత్తమ రామ చంద్ర ప్రభువు దర్శనం చేసుకొని నేరుగా ఢిల్లీ వెళ్ళాడు. ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కమల్ నాథ్ బీజేపీలో చేరబోతున్నాడు అంటూ…
తనతో పాటు తన పుత్ర రత్నానికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నాడు కమల్ నాథ్! అయితే ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిణామం కాదు! గత అసెంబ్లీ ఎన్నికలకి ముందు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల హామీల లాంటివి కమల్ నాథ్ ముందు పెట్టారని, కానీ వాటిని తిరస్కరించి మధ్యప్రదేశ్ లో బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశాడని వార్త! బదులుగా శివరాజ్ సింగ్ చౌహాన్ కి మళ్లీ అవకాశం ఇవ్వలేదు చూశారా? శివరాజ్ సింగ్ చౌహాన్ – కమల్ నాథ్ ఉప్పు నిప్పు! బండి సంజయ్ – కెసీఆర్ ఉప్పు నిప్పు! కాకపోతే తెలంగాణ లో వ్యూహం ఫలించలేదు. మధ్యప్రదేశ్ లో ముందే ఒప్పందం అమలు జరిగింది!
*********************
జై రామ్ రమేష్! అశోక్ చవాన్ రాజీనామా చేయగానే అవినీతి పరులు బీజేపీలో చేరిన తరువాత వాషింగ్ మెషిన్ లో వేసిన బట్టలలాగా పరిశుభ్రం అయిపోతున్నారు అంటూ విమర్శ చేశాడు!
వాషింగ్ మెషీన్ ఉపమానం ఉప్మాలాగా బాగుంది జై రామ్ రమేష్ గారూ! ఒక పెద్ద తలకాయ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి రాబోతున్నది అని అభిజ్ఞ వర్గాల భోగట్టా! అఫ్కొర్స్! PTI ను ఉటంకించలేదు అనుకోండి!అది మీరేనా? ఎందుకంటే మిలిండ్ దేవరా కూడా మీలానే విమర్శలు చేశాడు నెల కిందటి వరకూ! ఇప్పుడు NDA లో ఉన్నాడు! జస్ట్ ఆస్కింగ్!
Share this Article