Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పుడు కాదు… నిజంగా ఈ అక్కినేని సినిమా ఇప్పుడు అవసరం…

February 14, 2024 by M S R

Subramanyam Dogiparthi….. అప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరమయిన సంచలనాత్మక , సందేశాత్మక చిత్రం . ప్రతీ పాఠశాలలో , కళాశాలలో , యూనివర్సిటీలో , ఇంట్లో అందరూ అప్పుడప్పుడూ చూడాల్సిన చిత్రం . సరదాకి , మెంటల్ కి , బలిసిన ఒంటికి , డబ్బెక్కువ చేసి , అధికారం నెత్తికెక్కి , చట్టం అంటే భయం లేక హత్యలు , మానభంగాలు చేయటం సాధారణ విషయమయిపోయిన 21 శతాబ్దానికి అవసరమైన సినిమా .

అక్కినేని , ఆదుర్తిల ప్రయోగాత్మక సినిమా . డిటెక్టివ్ పుస్తకాలు , బూతు పుస్తకాలు చదివి పాడయిపోయే 1960 రోజుల్లో వచ్చిన సినిమా . ANR పాత్ర , నటన సూపర్బ్ . కోర్టులో సుకన్య నటన చాలా బాగుంటుంది . తేనె మనసులు సినిమాలో నటించిన రామ్మోహన్ , సంధ్యారాణి , పుష్పకుమారి ప్రభృతులు ఇందులో కూడా కనిపిస్తారు . కాంతారావు కుమారుడు రాజా ANR కుమారుడిగా కనిపిస్తాడు . విజయచందర్ మొదటి సినిమా . అక్కినేని వెంకట్ , నాగార్జున అతిధి పాత్రల్లో దర్శనమిస్తారు .

May be a doodle of 5 people and text

Ads

ఈరోజుల్లో చాలామంది యువతీయువకులకు స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర తెలియదు . అలాంటి వారు ఈ సినిమాలో బుర్రకధ కం నాటకం చూస్తే కాస్తయినా అర్థం అవుతుంది . ఆ వీడియోని నా వాల్ మీద షేర్ చేసా . యన్ ఆర్ నంది డైలాగులు చాలా బాగుంటాయి . ఆదుర్తి దర్శకుడు . కె విశ్వనాధ్ స్క్రీన్ ప్లే సమకూర్చారు . కె వి మహదేవన్ సంగీత దర్శకులు . సినిమాలో కనిపించే ANR ఇల్లు ఆయనదే అనుకుంటా . 1969 జనవరిలో P.U.C విద్యార్ధిగా కాలేజి టూర్లో ఆయన్ని ఇంట్లో కలిసాం . లీలగా గుర్తుంది .

జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు , ఉత్తమ చిత్రంగా నంది అవార్డు , ఫిలిం ఫేర్ అవార్డు , మాస్టర్ రాజాకు అవార్డులు వచ్చాయి . తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్లో , మన దేశంలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది .

మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . టి విలో కూడా చూసా . యూట్యూబులో ఉంది . తప్పక చూడవలసిన సినిమా . స్లోగా ఉంటుంది . కషాయం తియ్యగా ఉండదు కదా ! స్లో అయినా చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #TeluguCinemaNews #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions