ఓ వార్త కనిపించింది… ఏదో ఇంటర్వ్యూలో టీవీ కమెడియన్ వేణు మాట్లాడుతూ ‘‘బొమ్మ అదిరింది షో ఆగిపోలేదు, అది ప్రసారం అయ్యేది జాతీయ చానెల్ కదా, వాళ్ల పద్ధతి వేరే ఉంటుంది… ఆ షో ఫస్ట్ సీజన్ అయిపోయింది, సెకండ్ సీజన్ స్టార్ట్ కావల్సి ఉంది…’’ అన్నాడట… నవ్వొచ్చింది… నిజానికి నవ్వు కాదు, వేణును చూస్తే కాస్త జాలేసింది… వాస్తవానికి వేణు మంచి టైమింగ్ ఉన్న కమెడియన్… కానీ ఎక్కడో ఏదో భారీ తేడా కొడుతోంది… అందుకే ఎవరెవరో ఈటీవీ జబర్దస్త్ షోలోకి తిరిగి వస్తున్నా సరే, వేణుకు మాత్రం రీఎంట్రీ లేదు… తనే కాదు, ధనరాజ్కూ అంతే… ఏమో, జబర్దస్త్ షో వ్యవహారాలు చూసే ఓ పెద్దమనిషి ఉన్నాడు కదా, బహుశా తనతో వీళ్లకు పడటం లేదేమో… లేదా, తొక్కలో ఈటీవీ, తొక్కలో మల్లెమాల… ఆ క్యాంపుల్లో అన్నీ చంపుకుని ఎందుకు బతకాలి..? ఆత్మగౌరవం కంటే ముఖ్యం కాదు కదా, వాళ్లకు కట్టు బానిసల్లా ఎందుకు బతకడం అనుకున్నారేమో…!
వాళ్లకున్న చేదు అనుభవాలు తెలియదు గానీ… ఈ అదిరింది షో సంగతే చూద్దాం… అది స్టార్టయిందే జబర్దస్త్ అడుగు జాడల్లో… పక్కా కాపీ… పైగా దానికి వ్యతిరేకంగా… అంటే అదిరింది షో పుట్టుకలోనే ఓ లోపం ఉంది… మల్లెమాల టీంతో పడక నాగబాబు అక్కడి క్రియేటివ్ డైరెక్టర్లను, ఒకరిద్దరు కమెడియన్లను కూడా తీసుకుని బయటికి వచ్చాడు… ఈ షో స్టార్ట్ చేశాడు… కానీ ఏమైంది..? భజన… భజన… ప్రతి స్కిట్లోనూ తనకు బిస్కెట్లు వేయడమే… వేణు కీర్తనలు అయితే మరీ శృతిమించి… ధనరాజ్ స్కిట్లలో ఒక్కటంటే ఒక్కటీ నవ్వించలేదు ఎవరినీ… జస్ట్.., గల్లీ బాయ్స్, చమ్మక్ చంద్ర కాస్త బెటర్… చివరకు అసలు లోపాలెక్కడో తెలుసుకోలేక… ఆ చానెల్ యాజమాన్యం కళ్లకు గంతలు కడుతూ… యాంకర్ సమీరను తీసేశారు మొదట… తరువాత రవి, భానుశ్రీలను తీసేశారు… డీజే స్పీకర్ శ్రీముఖిని తెచ్చారు… నవదీప్‌ను తరిమేసి జడ్జిగా జానీ అనే కామెడీ మాస్టర్‌ను తెచ్చారు… కానీ స్కిట్లలో నాణ్యత పెరిగితే కదా… అందుకే రేటింగ్స్ దారుణంగా దెబ్బతీశాయ్…
Ads
ఇప్పుడేమైంది..? నాగబాబు అన్నీ వదిలేసి, అందరినీ నడిసంద్రాన ముంచేసి… ఓ యూట్యూబ్ చానెల్లో స్టాండప్ కామెడీ షో పెట్టేసి, చల్లగా జారుకున్నాడు… తనను నమ్మి, ఈటీవీని వదిలేసి వచ్చినవారు లబోదిబో… లక్కీగా మాటీవీ వాడు కామెడీ స్టార్స్ అంటూ ఓ కామెడీ షో స్టార్ట్ చేశాడు కాబట్టి, యాదమ్మరాజు, హరి, సద్దాం, చమ్మక్ చంద్ర తదితరులంతా అక్కడ చేరిపోయి, ఊపిరి పీల్చుకున్నారు… థాంక్స్ టు ఓంకార్ అని దండాలు పెట్టుకుంటున్నారు… కానీ వాళ్లు పొరపాటున కూడా ధనరాజ్‌ను, ఈ వేణును రానివ్వలేదు… కారణం..? అదే తెలియదు..! శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఈటీవీ వాడు ఇంకో దుకాణం పెట్టినా సరే, ఎవరెవరో కామెడీ తెలియని వాళ్లను తీసుకొస్తున్నారు గానీ వీళ్లకు మాత్రం చాన్స్ లేదు… కథ ఇలా ఉంటే… అదిరింది మళ్లీ వస్తుంది, సెకండ్ సీజన్ వస్తుంది అనే ఆశల్లో ఉండటం చూస్తేనే జాలేసింది, అంతే… నిజంగానే ఇప్పటికిప్పుడు అది మళ్లీ స్టార్టయినా సరే, ఆర్పీ, నువ్వు, ధనరాజ్ తప్ప ఇంకెవరూ లేరు వేణూ… ఆర్పీ స్కిట్లు ఎవడూ చూడడు, ధనరాజ్ స్కిట్లకు నవ్వురాదు, నీకు భజన తప్ప ఇంకేమీ తెలియదు… మరెలా బ్రదరూ..?! సెకండ్ సీజన్ స్టార్ట్ చేసి జీవాడు ఏమైపోవాలి చెప్పు..?!
Share this Article