ఒక ఇండియన్‌కు ప్రపంచంలో ఎక్కడైనా మంచి పోస్టు, పొజిషన్ దొరికితే మనకు ఆనందం… అదీ తెలుగువాడైతే మరీ ఆనందం… ఇది అలాంటిదే… అమెరికాలో కీలకమైన బోలెడు పోస్టుల్లో ఇండియన్స్ ఉన్నారు… అంతెందుకు..? కొత్తగా కొలువు దీరిన అధ్యక్షుడు జో బైడెన్ టీంలోనే మనవాళ్లు బోలెడు… ఇప్పుడు తాజాగా ఏమిటంటే..? కాలిఫోర్నియా ఎనర్జీ కమిషన్ హెడ్‌గా మన శ్రీకాకుళానికి చెందిన గుండ శివగంగాధర్ నియమితుడయ్యాడు… ఓ సాయంకాల పత్రికలో పబ్లిషైన ఆ వార్త వాట్సపులో కనిపించింది… శివ తండ్రి మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ… తల్లి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి… అభినందనలు శివా…
మెకానికల్ ఇంజనీరింగులో ఎంఎస్, పీహెచ్డీ చేసిన శివ (42 ఏళ్లు) ఎనర్జీ కమిషన్‌లోనే డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు… డేవిస్‌లో ఉంటాడు తను… తన తల్లిదండ్రుల విషయానికొస్తే… గుండ అప్పలసూర్యనారాయణ ఒక విలక్షణమైన రాజకీయ నేత… మాజీ మంత్రిగా పనిచేసినా ఒక్క అవినీతి ఆరోపణా లేని వ్యక్తిత్వం… కోపంగా మాట్లాడతారనే ఒకే ఒక్క కారణం తప్పించి… వేలెత్తి చూపలేని కెరీర్... అరసవల్లికి చెందిన గుండ అప్పలసూర్యనారాయణ శ్రీకాకుళం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఎన్టీఆర్ మంత్రివర్గంలో సాంఘిక, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు… అనంతరం ధర్మాన ప్రసాదరావుపై వరుసగా రెండు సార్లు ఓడిపోయారు…
Ads
ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటానని ప్రకటించడంతో, గుండ భార్య మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ గుండ లక్ష్మీదేవి టిడిపి టికెట్‌పై 2014లో ధర్మాన ప్రసాదరావుపై పోటీ చేసి గెలుపొందారు… 2019 ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు… ఇదీ శివ తల్లిదండ్రుల గురించి..! అవునూ… ఓ తెలుగువాడికి మంచి పోస్టు లభిస్తే, మంచి పొజిషన్ దొరికితే, మంచి బాధ్యతల్లో నియమితుడైతే… మన మెయిన్ స్ట్రీమ్ పత్రికల సైట్లకు ఎందుకు వార్త కాలేకపోయింది..? టీవీల్లో ఓ చిన్న వార్తకు కూడా స్పేస్ దొరకదా..? మనోళ్ల ఆనందాన్ని కాస్త ప్రజలతో షేర్ చేసుకోవచ్చు కదా…!!
Share this Article