Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి తెలుగు దిగ్దర్శకుడికీ ఎన్టీయార్‌తో డిజాస్టర్ తప్పలేదు…

February 17, 2024 by M S R

Subramanyam Dogiparthi…   టైం బాగుండకపోతే బంగారం పట్టుకున్నా మట్టి అవుతుంది . జీవితంలో గెలవటానికి కూడా సుడి ఉండాలి . సుడి ఉండటం లేకపోవటం వివరిస్తానికి మంచి ఉదాహరణ పేకాట . Card show count పడుద్ది . ఒక్క డైమండ్ రెండే కావాలి షో తిప్పటానికి . సుడి లేనోడికి డీల్ లోనే 12 అయి పడుతుంది . కేవలం extension కావాలి . పేకలోకి వెళతాడు . డైమండ్ రెండు వస్తుంది . కోపం నషాళానికి అంటి , ఈడ్చి డిస్కార్డ్ చేస్తాడు . కిందోడు card show count తిప్పుతాడు . జీవితమంతా ఇంతే . జీవితమంటేనే ఇంత .

పాతాళభైరవి , మాయాబజార్ , జగదేకవీరుని కధ , శ్రీకృష్ణార్జున యుధ్ధం వంటి వందేళ్ళ సినిమాలు తీసిన కె వి రెడ్డి గారేనా ఈ ఉమ చండీ గౌరీ శంకరుల కధ సినిమా తీసిందని ఎవరయినా ఆశ్చర్యపోతారు . ఈ సినిమా కధ ఆయనకు ఎవరు చెప్పారో , ఏ పురాణంలో ఉందో ఆ భగవంతునికే తెలవాలి . ఈ సినిమా వలన తెలిసింది ఏమిటంటే భృగు మహర్షి భార్య పేరు పులమాదేవి అని .

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . అప్పుడు అర్థం కాలేదు . కోపంతో ఈ సినిమాను ఉప్మా చట్నీ గారె సాంబారు కాఫీ అని అక్కసు కక్కేవాళ్ళం . తర్వాత టి విలో వచ్చినప్పుడల్లా చూస్తుంటా . అర్థం అయ్యేది కాదు . పట్టు వదలని విక్రమార్కుని లాగా చూడంగా చూడంగా ఈమధ్యనే కాస్త అర్థం అయింది . మీకూ అర్థం కావాలంటే యూట్యూబులో ఉంది . చూడవచ్చు .

Ads

NTR శివ తాండవం చాలా గొప్పగా ఉంటుంది . నర్తనశాల , దక్షయజ్ఞం ఈ సినిమా … చాలామంది డాన్స్ హీరోల కన్నా గొప్పగా తాండవిస్తారు . బి సరోజాదేవి , రుష్యేంద్రమణి , ముక్కామల , రేలంగి , రమణారెడ్డి , ఛాయాదేవి , ధూళిపాళ , బాలకృష్ణ ప్రభృతులు నటించారు . ఈ భృగు , దూర్వాస , విశ్వామిత్ర మహర్షులకు రజో గుణం , తమో గుణం ఎక్కువ అనుకుంటా !!!

పింగళి వారు వ్రాసినా పాటలు హిట్ కాలేదు . పెండ్యాల వారి సంగీత దర్శకత్వం కూడా so so నే . ఒకటి రెండు పాటలు హిట్ అయ్యాయి . కల గంటివా చెలీ కలగంటివా , థిల్లానా పాటలు శ్రావ్యంగా ఉంటాయి . అంతటి హేమాహేమీలు ఉండి కూడా ఈ సినిమా డిజాస్టర్ కావటం చాలా బాధాకరం .

This is a case study for every career oriented person . అందువలనే ఈ సినిమాని కూడా గుర్తు చేస్తున్నా . #తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!
  • చైల్డ్ ఆర్టిస్టు కాదు… డబుల్ రోల్‌లో మహేశ్ బాబే అసలు హీరో…
  • … ఫాఫం అంబానీ..! కంటెంట్ రైటర్ల పారితోషికాలకూ డబ్బుల్లేవ్..!!
  • తల్లి చెప్పింది… ‘సింహంలా పోరాడు… అంతేగానీ పిరికివాడివై తిరిగిరాకు’
  • రోగ్ ప్లానెట్ కాదు… దుష్ట గ్రహమూ కాదు… అదొక ఒంటరి జర్నీ… అంతే…
  • 1500 కోట్ల పణం..! ప్రేక్షకుడు ఎందుకెక్కువ చెల్లించాలి…? మళ్లీ అదే ప్రశ్న..!!
  • వెనెజులా..! ఇప్పుడు ట్రంపు దాడి… ఎప్పటి నుంచో ‘ఉచితాల’ దాడి..!!
  • ఈ బీరువా తలుపులు తెరవగానే… నా బాల్యం నన్ను నిండా కమ్మేస్తుంది…
  • కుహనా సెక్యులర్ పార్టీల బ్లాక్ మెయిల్ పాలిటిక్స్‌కు ఎదురుదెబ్బ..!!
  • అడుగడుగునా అల్లరల్లరి… జంధ్యాల మార్క్ మరో కామెడీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions