Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫీల్ గుడ్ మూవీ… బీపీ ఉన్నవాళ్లు చూస్తే ఓ పది పాయింట్లు తగ్గడం ఖాయం…

February 20, 2024 by M S R

Subramanyam Dogiparthi…. ఆత్మీయతనంతా రంగరించి పోసిన సినిమా 1969 లో వచ్చిన ANR – వాణిశ్రీల మొదటి జంట సినిమా . ఈ ఇద్దరి జంట తెలుగు సినిమా రంగంలో ఒక ఊపు ఊపింది . NTR తో సక్సెసులు ఉన్నా , అంతగా పేరు వాణిశ్రీకి రాలేదు . ANR తో నటించిన ప్రేమ నగర్ , దసరా బుల్లోడు , బంగారు బాబు , సెక్రటరీ వగైరా సినిమాలలో వాణిశ్రీకి కన్నాంబ , సావిత్రిలంత పేరు వచ్చింది .

ఇంక ఈ సినిమాతో నవలా చిత్రాల పరంపర ప్రారంభమయింది . యద్దనపూడి సులోచనారాణి , ఆ తర్వాత యండమూరి వీరేంద్రనాధ్ నవలలే ఎక్కువగా సినిమాలుగా వచ్చాయి , సక్సెస్ అయ్యాయి .

Excellent Feel Good Movie ఆత్మీయులు . నాకెంతో ఇష్టమైన సినిమా . మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో ఆడింది . ఓ నాలుగయిదు సార్లు చూసి ఉంటా . ఇప్పటికీ టివిలో వస్తే చూస్తుంటాను . మనందరి జీవితాల్లో ఇలాంటి మంచి వాళ్ళూ ఉంటారు . బడాయికి పోయి , గాలిలో మేడలు కట్టి , చిన్న చిన్న అబధ్ధాలతో ప్రారంభించి అన్ని రకాల నేరాలూ చేసేవరకు దిగజారే చెడ్డ – మంచి వారూ ఉంటారు .

ముఖ్యంగా విజయనిర్మల , చంద్రమోహన్ , పద్మనాభం పాత్రలు ఈ కోవకు సంబంధించినవే . సూరేకాంతం , ప్రభాకరరెడ్డి వంటి ఆజన్మ నేర స్వభావం కలవారూ ఉంటారు . ANR , వాణిశ్రీ , గుమ్మడి , నాగభూషణం , చంద్రకళ , భానుప్రకాష్ పాత్రల వంటి మంచి మనసున్న వారూ ఉంటారు . నేను నవల చదవలేదు . దుక్కిపాటి వారి స్క్రీన్ ప్లే , వి మధుసూధనరావు దర్శకత్వం అద్భుతం . సినిమాలో అనవసరమయన సీన్ ఒక్కటి కూడా లేదనే చెప్పవచ్చు .

ఈ సినిమా సక్సెస్ కు మరో కారణం యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం . ఈరోజుకీ సూపర్ హిట్ సాంగ్సే . అన్నయ్య కలలే పండెనూ , కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, ఓ చామంతీ ఏమిటే ఈ వింత , మదిలో వీణలు మోగె , అమ్మ బాబు నమ్మరాదు , చిలిపి నవ్వుల నిను చూడగానే , స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారూ , ఏం పిల్లో తత్తరబిత్తరగున్నావు చాలా శ్రావ్యంగా ఉంటాయి . చిలిపి నవ్వుల నిను చూడగానే పాటను బాల సుబ్రహ్మణ్యమే పాడింది .

రెండవ ఉత్తమ చిత్రంగా నంది అవార్డుని గెలుచుకుంది . 1981 లో తమిళంలో రీమేక్ అయింది . యూట్యూబులో ఉంది . తప్పక చూడవలసిన సంగీతభరిత , ఆత్మీయ కుటుంబ కధా చిత్రం . సినిమా చూసాక BP ఉన్నవారికి BP కనీసం ఓ పది పాయింట్లయినా తగ్గుతుంది . నాదీ గ్యారంటీ .

#తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • అవతలి వైపు వచ్చిన ప్రశ్న – ఎన్‌కౌంటర్ కథ తెలియదా? ఫీల్డ్‌కు కొత్తా..?
  • అచ్చం కరోనా పుట్టుకలాగే..? బయోవెపన్ తయారీ దశలో ప్రమాదం..?
  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కాడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!
  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!
  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!
  • “ఖాన్‌తో గేమ్స్ ఆడకు… శాల్తీలు లేచిపోతాయ్”
  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions