John Kora…. తీగల, పట్నం ఫ్యామిలీలు కరెక్ట్‌గా పని చేస్తే చేవెళ్లలో ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉంటాయి.
భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువ. కానీ సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు.
ఖమ్మంపై పెద్దగా చర్చ అవసరం లేదు. రేణుకను ఎట్లాగో తప్పించారు. తుమ్మల కూడా కొడుకు యుగంధర్‌ను పోటీ నుంచి దూరం పెట్టాడు. సోనియా వచ్చే అవకాశాలు ఎలాగూ లేవు, ఆ చర్చే క్లోజ్. ఆమె రాజ్యసభకు వెళ్లిపోయింది. భట్టి, పొంగులేటి ఒక అవగాహనకు వస్తే చాలు.
Ads
మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌కే మెరుగైన అవకాశం ఉంది. వరంగల్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది.
పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయానికి అభ్యర్థి ఎంపికే ముఖ్యం. కరీంనగర్‌లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ. ప్రస్తుతానికి బండికే మొగ్గు ఉంది. నిజామాబాద్‌లో కవితక్కకు మరోసారి పరాభవం తప్పదు. (పోటీ చేస్తేనే సుమా). ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ బలం పెరుగుతున్నట్టు కనిపిస్తున్నా.. ఇంకా బీజేపీదే పై చేయి.
మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే తప్ప.. బీఆర్ఎస్ గెలవడం కొంచెం కష్టం. జహీరాబాద్‌ను కాంగ్రెస్ ఖాతాలో వెయ్యొచ్చు.
సికింద్రాబాద్‌లో ఈ సారి కిషన్ రెడ్డి గట్టి పోటీ ఎదుర్కోవాలి. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అభ్యర్థి ఎంపిక నిర్ణయిస్తుంది. మహబూబ్‌నగర్‌లో త్రిముఖ పోటీ తప్పదు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి కాంగ్రెస్ డబుల్ డిజిట్ వరకు రావొచ్చు. బీఆర్ఎస్ భారీగా నష్టపోతది. బీజేపీ బలం మరింతగా పెరుగుతది.
బీఆర్ఎస్ కనుక తాత్కాలిక ప్రయోజనం కోసం బీజేపీతో పొత్తుకు వెళ్తే అది ఆత్మహత్యాసదృశ్యమే…!
PS: నేను రాసిన దానికి క్రెడిబుల్, మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. భిన్నాభిప్రాయాలను, ఇతర అంచనాలను కూడా నేను అంగీకరిస్తా.. #భాయ్‌జాన్
(రాజకీయాలు డైనమిక్, ఇప్పుడున్నట్టే రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడు తెలంగాణలో లోకసభ ఎన్నికలకు సంబంధించి పార్టీల స్థితిగతులపై రకరకాల ఫీడ్ బ్యాక్ ఆధారంగా వేసిన ఒక అంచనా ఇది… ముచ్చట)
Share this Article