Pardha Saradhi Potluri …… అదానీ డిఫెన్స్ – ADANI DEFENCE! అదానీ ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ఇండియా లిమిటెడ్ (Adani-Ellbit Advanced Systems India Ltd.)
Elbit Advanced Systems అనేది డిఫెన్స్ రంగానికి చెందిన సంస్థ!
ఎల్బీట్ సిస్టమ్స్ ఎయిర్ ఫోర్స్, నావీ, హోమ్ లాండ్ సెక్యూరిటీ కి సంబంధిచిన హై టెక్ ఎక్విప్మెంట్ ను తయారు చేస్తుంది.
Ads
మన Su-30 MKI ఎయిర్ సుపీరియాటీ ఫైటర్ జెట్ కి ఎలెక్ట్రానిక్ వార్ ఫేర్ (EWS) ను ఇచ్చింది!
******************,
ఫిబ్రవరి 25,2024
1. అదానీ ఎల్బిట్ 20 హెర్మెస్ 900(Hermes 900) milatary డ్రోన్స్ ను ఇజ్రాయెల్ కి సరఫరా చేసింది.
2. ప్రస్తుతం IDF గాజాలో హమాస్ ఉగ్రవాదులను మట్టు పెట్టే పనిలో ఉన్నదన్న సంగతి తెలిసిందే!
3. ఇప్పటి వరకూ IDF గాజాలో హెర్మేస్ 900 డ్రోన్ల మీదనే ఎక్కువ ఆధారపడుతున్నది!
4. ఇజ్రాయెల్ దగ్గర హెలికాప్టర్ గన్షిప్స్ ఎక్కువగా లేవు. హమాస్ దగ్గర రష్యా తయారీ స్టింగర్ మిస్సైల్స్ ఉన్న కారణంగా హెలికాప్టర్స్ ను ఉపయోగించడం లేదు.
5. గత అక్టోబర్ 10 న అమెరికా 10 అపాచీ హెలికాప్టర్లను టెల్ అవీవ్ విమానాశ్రయంలో దించింది IDF గాజాలో ఉపయోగించడానికి.
6. కానీ ఇంతవరకు అపాచీ హెలికాప్టర్లను వాడలేదు IDF.
7. గాజా మీద బాంబింగ్ కోసం F-16 లని వాడింది IDF.
8. అయితే గాజా, వెస్ట్ బ్యాంక్, లెబనాన్ ల మీద నిఘా, దాడుల కోసం IDF ఎక్కువగా హర్మేస్900 ద్రొన్లనే వాడింది, ఇప్పటికీ వీటినే వాడుతున్నది IDF.
ఈ హెర్మెస్ 900 డ్రోన్ ప్రత్యేకతలు ఏమిటీ?
8.Hermes 900 డ్రోన్ (MALE) Medium Altitude Long Endurance.
అంటే మధ్య స్థాయి ఎత్తులో ఎగురుతూ ఎక్కువ సేపు గాలిలొ ఉంటూ నిఘా మరియు దాడి చేయగలదు.
9. హెర్మెస్ 900 కి ప్రత్యేక సెన్సర్లు అమర్చడం వల్ల రాత్రి, పగలు భూమి, సముద్రం మీద నిఘా పెడుతూ అవసరము అయితే టార్గెట్ ల మీద దాడి చేయగలదు.
10. elbit సిస్టమ్స్ చెపుతున్న ప్రకారం హెర్మెస్ 900 దాడి చేయడం కోసం 370 కిలోల పే లోడ్ ను మోసుకెళ్లగలదు.
******************
2018 లో అదానీ డిఫెన్స్ & ఏరో స్పేస్ తో కలిసి ఎల్బిట్ సిస్టమ్స్ $15 మిలియన్ డాలర్ల పెట్టుబడి తో ప్రారంభించిన 5 ఏళ్ళలోపే Hermes 900 UAV లని ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే స్థాయికి రావడం మామూలు విషయం కాదు.
ముఖ్యంగా కాంపోజిట్ కార్బన్ AERO స్ట్రక్చర్ తో తయారు చేయడం కీలక పరిణామం!
తేజస్ LCA ను కూడా కాంపోజిట్ మెటీరియల్ తో తయారు చేస్తున్నా ఫైటర్ జెట్ కి వాడే కాంబినేషన్ వేరు UAV కి వాడే కాంబినేషన్ వేరు వేరుగా ఉంటాయి.
So! మనకి ఏరో స్పేస్ కి కావాల్సిన కాంపోజీట్ కార్బన్ మిశ్రమం ఎలా తయారు చేయాలో ఇజ్రాయెల్ ద్వారా దొరికింది.
పోను పోను మిగిలిన కాంబినేషన్స్ మీద పట్టు దొరుకుతుంది తద్వారా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి!
***************
అదానీ ఏమిటీ డిఫెన్స్ రంగానికి సంబంధము ఏమిటీ అని విమర్శించిన వాళ్ళకి జవాబు చెప్పినట్టయింది కదా?
అదానీ స్థలం కొనడం, skilled మాన్ పవర్ ను రిక్రూట్ చేసుకోవడం, నిర్వహణ చేయడం చేస్తాడు.
మిగతాది ఇజ్రాయెల్ వంతు గా ఉంటుంది.
ముఖ్యంగా అదానీ గ్రూపు లో HR డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది!
ఎవరెవరిని రిక్రూట్ చేసుకుంటే పని ఆగకుండా జరుగుతుందీ అనేదే కీలకం!
ట్రైనింగ్ ఇజ్రాయెల్ ఇంజినీర్లు ఇస్తారు మొదటి దశలో!
*****************
2023 లో Hermes 900 UAV లని భారత ఆర్మీ లో ప్రవేశ పెట్టడం అవి ఉత్తర సరిహద్దులలో పహారా కాయడం జరిగిపోతున్నది!
********************
ఇక మెటీరియల్ సైన్స్ లో ఇంజినీరింగ్ మీద ఒక చిన్న విశ్లేషణ!
రాబోయే 20 ఏళ్లలో మెటీరియల్ సైన్స్ లో ఇంజినీరింగ్ చేసిన వాళ్లకి డిమాండ్ ఉంటుంది!
విమాన తయారీ రంగంలో, ఎలక్ట్రిక్ కార్ల రంగంలో, అంతరిక్ష పరిశోధనా రంగంలో కాంపోజీట్ మెటీరియల్ కోసము ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి.
ఇప్పటికే మెటీరియల్ సైన్స్ లో ఇంజినీరింగ్ చేసిన వాళ్ల కొరత బాగా ఉంది.
వచ్చే అయిదేళ్ల లో ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవాళ్లు చాలా మంది రిటైర్ అయిపోతారు.
కొత్త వాళ్లకి అనుభవం రావడానికి సమయం పడుతుంది.
ముఖ్యంగా మెటీరియల్ సైన్స్ కి సంబంధించి R&D విభాగం లో కొరత బాగా ఉంది!
మెటీరియల్ సైన్స్ లో Ph.D చేసిన వాళ్లకి డిమాండ్ విపరీతంగా ఉంది కానీ అభ్యర్థులు లేరు.
కనుక ఇప్పటికే సాచురేషన్ పాయింట్ కి చేరుకున్న కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలెక్ట్రానిక్ లాంటి కోర్సులు చేయకుండా మెటీరియల్ సైన్స్ మీద దృష్టి పెడితే మంచిది!
మెటీరియల్ సైన్స్ కి సంబంధించి ఉద్యోగ అవకాశాలు మన దేశంలోనే ఎక్కువగా ఉంటాయి!
Share this Article