‘‘నేను మలాలా యూసఫ్ జాయ్ ని కాదు. నేను నా దేశంలో స్వేచ్ఛగా మరియు సురక్షితంగా ఉన్నాను. భారత్ లో భాగమైన నా స్వస్థలం కాశ్మీర్. నేను నా మాతృభూమిని వదిలి పారిపోయి, ఆమెలాగా మీ దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదు. మలాలా యూసఫ్ జాయ్ అణచివేతకు గురైన నా దేశాన్ని, నా పురోగమిస్తున్న మాతృభూమిని కించపరచడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను.
టూల్ కిట్ ముఠాలు, విదేశీ మీడియా సభ్యులందరూ కశ్మీర్‌ను సందర్శించడానికి ఇష్టపడకుండా, అక్కడ అణచివేత కథనాలను ప్రసారం చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. మతం ప్రాతిపదికన భారతీయులను పోలరైజ్ చేయడాన్ని ఆపాలని నేను మీ అందరినీ కోరుతున్నాను, ఎందుకంటే మేము మమ్మల్ని విచ్ఛిన్నం చేయనివ్వము…’’
… ఈ మాటలు ఇప్పుడు వైరల్… ఇవి యానా మీర్ అనే కశ్మీరీ జర్నలిస్టు మాటలు… ఎక్కడ..? బ్రిటన్ పార్లమెంటు భవనంలో..! సాహసి… ఎందుకు ఈ మాట అంటున్నానంటే… ఒక లేడీ కశ్మీరీ జర్నలిస్టు అంత ధైర్యంగా వేర్పాటువాదులకు భయపడకుండా ఓ అంతర్జాతీయ వేదిక మీద ఈ వ్యాఖ్యలు చేసినందుకు… పదే పదే ఇండియా మీద విషం కక్కే ఆ మలాలానే ఉదాహరణగా తీసుకుని మరీ ఈ వ్యాఖ్యలు చేసినందుకు..!
Ads
https://twitter.com/TimesAlgebraIND/status/1760691415900955069
మలాలా తెలుసు కదా… బాలికల విద్యాహక్కు మీద మాట్లాడి, ఉగ్రవాదుల తూటాలకు గురై, చిన్నతనంలోనే నోబెల్ ప్రయిజ్ పొందిన మహిళ… ఆమె తన అనుభవాలతో Iam Malala అని ఓ పుస్తకం కూడా రాసింది… ఇప్పుడు అదే టోన్‌లో Iam not a Malala అని కశ్మీరీ జర్నలిస్టు ఆమెను ఆ వేదిక మీద తూర్పారపట్టడం ఆసక్తికరం… అందుకే ఆమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి…
అసలు ఇంతకీ ఎవరీమె..? యానా మీర్ శ్రీనగర్ కు చెందిన జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్… కశ్మీర్ రాజకీయ వాస్తవాలను గ్రౌండ్ జీరో నుంచి బయటి సమాజానికి తెలియజెప్పే తొలి మహిళా యూట్యూబ్ వ్లాగర్ కూడా… కశ్మీర్ లో తొలిసారిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఓ ఫ్యాషన్ షోను ఆమె నిర్వహించినట్లు సమాచారం… ఆమె పోలోవ్ శ్రీనగర్ కు చెందిన టెడ్ ఎక్స్ స్పీకర్… యూట్యూబ్ లో యానా మీర్ కు భారీ సంఖ్యలోనే సబ్ స్క్రైబర్లు ఉన్నారు… దాదాపు రెండు లక్షలకు పైగానే…
‘తండ్రిని కోల్పోయిన తర్వాత డిప్రెషన్ లో ఉన్నప్పుడు నన్ను ఇక్కడికి రమ్మని ఒత్తిడి చేసినందుకు థ్యాంక్స్ సాజిద్’ అంటూ తన కథనాన్ని షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ కు యానా మీర్ కృతజ్ఞతలు తెలిపింది… ‘‘నువ్వు లేకపోతే నేను ఇక్కడికి వచ్చేదానినే కాదు… అలాగే ఈ మలాలా సిద్ధాంతాన్ని నా సోదరి నాకు ఇచ్చింది… అవును, కుటుంబం మద్దతు లేకుండా ఎవరూ ఏమీ కాలేరు…’ అంటున్నది ఆ గొంతు…!
Share this Article