‘‘బీజేపీ హిందూ జాతీయవాద భావజాలం, మతపరమైన మైనారిటీలపై హింసను ప్రయోగించడం, అసమ్మతిని అణచివేయడం వంటి కారణాల వల్ల కొందరు నిపుణులు ఫాసిస్టు విధానాలను మోదీ అమలు చేస్తున్నారని ఆరోపిస్తుంటారు…’’
…. ఈ మాట అన్నది ఎవరో తెలుసా..? సీతారాం ఏచూరి కాదు, అసదుద్దీన్ ఒవైసీ కాదు, సీపీఐ రాజా కాదు, అసలు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఆప్ కేజ్రీవాల్ కానే కాదు… ఓ యంత్రం… ఆర్టిఫిషియల్ మంత్రం నేర్చుకున్న యంత్రం… అదే గూగుల్ జెమిని… అదే ఈరకంగా మోడీ కేరక్టర్‌ను తేల్చిపారేసింది…
ఎవరో అడిగారు జెమినిని… ‘‘మోడీ ఫాసిస్టా..?’ అని… దానికి సదరు కృత్రిమ మేధస్సు ఉన్న యంత్ర మేధావి ఇచ్చిన ఆన్సర్ అదన్నమాట… ఇంకేముంది..? ట్విట్టర్‌లో ఈ పోస్టు కాస్తా వైరల్… మోడీ వ్యతిరేక సెక్షన్లన్నీ తెగ సంబరపడిపోయాయి… దీనితో కేంద్ర ప్రభుత్వానికి చిర్రెత్తింది… నీయబ్బ, నీకెంత ధైర్యమే, మా మోడీని పట్టుకుని ఫాసిస్ట్ అని తీర్మానించేస్తావా..? అని తిట్టేసుకుని గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది…
Ads
‘ఒకవేళ గూగుల్ నుంచి సరైన ఆన్సర్ గనుక రాకపోతే ప్రాసిక్యూషన్‌కు సిద్ధం కావల్సి ఉంటుంది’ అని ఐటీ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు… ఇదీ వార్త…
https://twitter.com/TimesAlgebraIND/status/1761024671947051161?t=I6P0CXQQRNkwTQG1YVOXUQ&s=08
నిజానికి అది కాదు వార్త… మీడియాలో కనిపించే రకరకాల విమర్శలు, విశ్లేషణల ఆధారంగా సదరు జెమిని అనే యంత్రభూతం, సారీ యంత్రం ఆ కంక్లూజన్‌కు వచ్చి ఉండవచ్చు… కానీ నవ్వొచ్చేదేమిటంటే… మోడీ వ్యతిరేకులంతా తెగ మెచ్చేసుకుని ఆరాధించే చైనా నియంత జిన్ పింగ్ మాత్రం ఫాసిస్ట్ కాదట… అవును, అదే యంత్రం తేల్చిచెప్పింది అలా… మోడీని తిట్టినందుకు కాదు, జిన్ పింగ్‌ను మెచ్చుకున్నందుకు మోడీ వ్యతిరేక సెక్షన్లు మరింత సంబరపడిపోతున్నయ్…
అసలు యంత్రాల తప్పేముంది..? అదే ప్రశ్న మరొకరు వేస్తే మరోరకమైన సమాధానం రావచ్చు, కానీ ఇలాంటి ప్రశ్నలు వేయడం, ప్రచారంలోకి తీసుకురావడం మీద కూడా నియంత్రణ అవసరం… పనిగట్టుకుని ఇండియాను ద్వేషించే శక్తులు కావాలని సదరు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌కు తప్పుడు ఇన్‌పుట్స్ ఇచ్చి ఉంటారు అని కొందరు కామెంట్లలో అభిప్రాయపడగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలన్నీ అదేరకంగా తగలడ్డాయని, వాటిని దేశం బయటకు తరిమేయాల్సిందేనని మరికొందరు రుసరుసలాడారు… అదండీ సంగతి…
ఇదే ప్రశ్న chat gpt కి వేసినప్పుడు కాస్త మెచ్యూర్డ్ జవాబు కనిపించింది… ‘‘మోడీ ఫాసిస్టా కాదానేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది… తన పాలసీలు ఈ దేశ సుస్థిరతకు, డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడేవని మోడీ అనుకూల సెక్షన్ బలంగా వాదిస్తే, 370 ఆర్టికల్ ఎత్తివేత, సీఏఏ, ఎన్‌ఆర్సీ వంటివి మైనారిటీల్లో అభద్రతకు పెంచినట్టు మోడీ వ్యతిరేక సెక్షన్ వాదన… పలు సంక్లిష్టతల ఆధారంగా ఓ కంక్లూజన్ కష్టం అనే అర్థమొచ్చేలా జవాబు ఇచ్చింది… సో, ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్‌కు నోటీసులు అవసరం లేదు… సర్, గూగుల్ పిచాయ్ సాబ్, వాటీజ్ దిస్..?
Share this Article