లాస్య నందిత… చిన్న వయస్సులోనే ఓ మహిళా ఎమ్మెల్యే ఓఆర్ఆర్ మీద జరిగిన కారు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరం… అందరినీ బాధపెట్టిన ప్రమాదం… తండ్రి సాయన్న మరణిస్తే అధికారిక అంత్యక్రియలు జరిపించలేదు కేసీయార్, కానీ ప్రస్తుత సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా సరే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం మెచ్చుకోదగిన నిర్ణయం… సరే, ఆ వివాదాన్ని కాసేపు పక్కన పెడితే…
అసలు అది ప్రమాదమేనా..? నిజానికి ఆ కారు ప్రమాదానంతరం ఉన్న స్థితి చూశాక ప్రమాదమే అని అందరూ నమ్మేలా ఉంది… కానీ స్వయంగా ఆమె సోదరి నివేదిత కంప్లయింట్ చేసింది… ఆమెకు ఆ మృతి మీద సందేహాలున్నయ్… ఉదయం 5.15 గంటలకు లాస్య పీఏ ఆకాశ్ ఫోన్ చేసి, ఇద్దరికీ దెబ్బలు తగిలాయని ఫోన్ చేశాడట… లొకేషన్ కూడా షేర్ చేశాడట… కానీ అక్కడికి వెళ్లేసరికి పరిస్థితి చాలా తీవ్రంగా కనిపించిందట… నిజానికి ఈ సంఘటనలో ఆ పీఏ ఆకాశ్ కాళ్లు కూడా విరిగినట్టు పోలీసులు చెబుతున్నారు…
కానీ కొద్దిరోజుల ముందే ఇదే లాస్య ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురైంది… బహుశా అప్పుడూ ఇదే పీఏ వాహనం నడిపిస్తూ ఉన్నాడు… బీజేపీ నేత సంజయ్ కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరినట్టు వార్త చదివినట్టు గుర్తు… పోలీసులు 304 ఏ సెక్షన్ కింద ఆ పీఏపైనే కేసు నమోదు చేశారు… ఏమో, ఇది ప్రమాదమేనేమో, మరణంపై సందేహాలు నిరాధారమేనేమో అనిపిస్తున్నా… సోషల్ మీడియాలో ఓ పోస్టు చదివాక మనకూ సందేహాలు తలెత్తుతున్నాయి… ఆ పోస్టు ఇదీ…
Ads
Lathareddy Singireddy…. 10tv లో దర్గాకు వెళ్లి పూజలు చేసి వస్తుంటే జరిగింది అంటున్నారు… లాస్య నందిత అక్కగారేమో బాసరలో పూజ చేయించుకొని వస్తుంటే జరిగింది అని చెప్తున్నారు… లాస్య నందిత కజిన్ టీవీ 9వాళ్ళతో గెట్ టూ గెదర్ పార్టీకి వెళ్లి వస్తుంటే జరిగింది అని చెప్తున్నారు… నందిత ఏజ్ 37సం.లు… ఇంకా పెళ్లి కాలేదా? సామాన్యంగా ఆడపిల్లకు 25 రాగానే పెళ్లి చేసేస్తారు. ఈ అమ్మాయి ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదు? పెళ్ళయితే హజ్బెండ్ ఎక్కడ? వాళ్ల అమ్మ గారు తల కొరివి పెట్టడం ఏంటి?
Share this Article