కన్నూర్ స్క్వాడ్, కాథల్ ది కోర్, భ్రమయుగం వంటి సినిమాల హిట్లతో మమ్ముట్టి జోరు మీదున్నాడు… ఒక గే పాత్ర, ఓ పాతకాలం మంత్రగాడి పాత్ర… ఇలా ఏదైనా చేసేస్తూ, తన అనుభవాన్ని మొత్తం రంగరిస్తూ, భిన్నమైన పాత్రల్ని ఫాల్స్ ఇమేజీని కాదని పోషిస్తున్న తీరు అందరి ప్రశంసలనూ పొందుతోంది… తన ప్రస్తుత యాత్ర ఇలా సాగుతోంది కదా…
ఎహె, ఎప్పుడూ ప్రయోగాలేనా..? ఒకసారి ఓ రొటీన్ కమర్షియల్ సినిమా చేద్దాం, చాన్నాళ్లయింది అనుకున్నట్టున్నాడు… కాస్త యాక్షన్, కాస్త కామెడీ, కాస్త థ్రిల్ కలగలిపి ఉండే ఓ పాత్రతో టర్బో అనే సినిమా చేస్తున్నాడు… దాదాపు షూట్ పూర్తయినట్టుంది… ఫస్ట్ లుక్ తను జీపు నుంచి దిగుతున్న ఓ యాక్షన్ హీరో ఫోజు కాగా, ఇప్పుడు సెకండ్ లుక్‌లో ఓ పోలీస్ స్టేషన్‌లో చొక్కా విప్పేయించబడి, తోటి నిందితులతో ఓ మూలన కూర్చోబెట్టబడ్డాడు…
ఇంట్రస్టింగు… పొక్కిరి రాజా, మధుర రాజా వంటి సినిమాలు తనతో తీసిన వైశాఖ్ ఈ టర్బో సినిమాకు దర్శకుడు… ఆ పాత తన సినిమాలు తెలుసు కాబట్టే, ఇక ఇది ప్రయోగం అయి ఉండదనీ, ఓ రెగ్యులర్ తరమా మూవీయేనని మాలీవుడ్ అంచనా వేస్తోంది… ఈ సినిమా నిర్మాతల్లో మమ్ముట్టి కూడా ఒకరు…
Ads
దీన్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఇందులో మన కామెడీ ఆర్టిస్టు సునీల్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నాడు… హీరో అనే భ్రమల నుంచి బయటపడ్డాక సునీల్ బిజీ అయిపోయాడు… పుష్ప జాతీయ స్థాయిలో హిట్ కావడంతో, అందులో విలన్ పాత్ర పోషించిన తనకు ఇతర భాషల సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నట్టున్నాయి… తమిళంలో కూడా కొన్ని ఇంట్రస్టింగు చాన్సులు కొట్టేసిన తను అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నట్టే…
ఇందులో రాజ్ బి శెట్టి కూడా ఉన్నాడు… తను కన్నడంలో పాపులర్… సో, టర్బోకు పాన్ ఇండియా టచ్ ఇస్తున్నారన్నమాట… ఇవన్నీ ఎలా ఉన్నా, ఇందులో హీరోయిన్ (లేదా ఓ ప్రధాన పాత్ర)గా చేస్తున్న అంజన జయప్రకాష్ గురించీ చెప్పుకోవాలి ఓసారి… దుబయ్‌లో పుట్టి పెరిగి, బీటెక్ కోసం కోయంబత్తూరు వచ్చిన ఈమె తరువాత మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగు, షార్ట్ ఫిలిమ్స్‌తో పాపులర్ అయిపోయింది…
2015 నుంచీ సినిమాల్లో ఉన్నా సరే, ఆమె ఇప్పటివరకు చేసినవి కేవలం నాలుగు సినిమాలు మాత్రమే… రెండు తమిళం, రెండు మలయాళం… ఇప్పుడు ఏకంగా మమ్ముట్టి సినిమాలోనే మంచి పాత్ర కొట్టేసింది… చెప్పనే లేదు కదూ… ప్రస్తుతం ఈ టర్బో గాకుండా మమ్ముట్టి మరో రెండు సినిమాలు చేస్తున్నాడు… అన్నీ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నయ్…
వీటిల్లో ఒకటి కడుగన్నవ ఒరు యాత్రకురిప్పు… మొన్న మోహన్‌లాల్‌తో ఓ నాసిరకం చిత్రాన్ని చేయించిన లిజో జోస్ దీనికి దర్శకుడు… మోహన్‌లాల్‌కు అంత షాక్ ఇచ్చిన తను ఇక మమ్ముట్టికి ఏం ఇవ్వబోతున్నాడో అంటారా..? వెయిట్ చేయాలి… ఓ ప్రఖ్యాత రచయిత తన సవతి చెల్లిని వెతుకుతూ శ్రీలంక వెళ్లినప్పటి అనుభవాల కథే ఈ సినిమాకు ఆధారం అట… ఇంట్రస్టింగు… మమ్ముట్టికి మరో భిన్నమైన పాత్ర… కీప్ గోయింగ్ నాయకా…!!
Share this Article