మొత్తానికి ఓంకార్ ఈటీవీకి చుక్కలు చూపిస్తున్నాడు… అదేదో షోలో ‘వన్ సెకండ్’ అంటూ టిపికల్ ఉచ్ఛరణ, గొంతుతో కనిపించేవాడు గుర్తుంది కదా… ఎస్, ఆ ఓంకారుడే… మాటీవీకి భలే దొరికాడు… డాన్స్ ప్లస్ అనే షోకు తనే యాంకర్… మొన్నామధ్య ఈటీవీ వాళ్ల ఢీ డాన్స్ షోను రేటింగుల్లో కొట్టేశాడు… ఇన్నాళ్లూ ఢీ పేరిట ఈటీవీ డాన్స్ జానర్లో నంబర్ వన్‌గా చెలామణీలో ఉంది కదా… దాన్ని బ్రేక్ చేసేశాడు ఓంకార్… ఈవారం కూడా ఈటీవీ ఢీ షో కేవలం 4.99 రేటింగ్స్ సాధించగా, ఓంకార్ నిర్వహించే డాన్స్ ప్లస్ షో 5.17 (హైదరాబాద్ బార్క్ కేటగిరీ) రేటింగ్స్ సాధించి షాక్ ఇచ్చింది… స్టారాధిస్టార్లు సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది, ఆల్ రౌండర్ శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణి, రష్మి… ఇంతమంది ఉన్నా ఢీ షో… ఓంకార్ విసిరిన డాన్స్ ప్లస్ ముందు ఓడిపోయింది… సో, టీవీ చానెళ్ల పర్ఫామెన్స్లో నాన్-ఫిక్షన్ అనే కేటగిరీ కూడా ముఖ్యమే… అందులో రియాలిటీ షోల పాత్ర ప్రధానం… (ఈటీవీకి న్యూస్ కూడా కలిసొచ్చేదే)… ఈ రియాలిటీ షోలలో, రకరకాల జానర్లలో ఇన్నాళ్లూ ఈటీవీదే ఇన్నాళ్లూ ఫుల్లు డామినేషన్… అందులో డాన్స్ జానర్లో ఓంకార్ ఈటీవీని తాజాగా ఇలా కొట్టేస్తున్నాడు కదా… ఇదే తొలిసారి… మరో జానర్ మరీ ఆసక్తికరం…
కామెడీ… జబర్దస్త్ షో మీద ఎన్ని విమర్శలున్నా సరే… ఎంత బూతు దట్టించి, వెకిలి ప్రోగ్రాంగా మార్చినా సరే… దాని రేటింగ్స్ ఎక్కువ… అందుకే కక్కుర్తితో పాత స్కిట్లను కూడా ఇంకా ప్రసారం చేస్తూ టీఆర్పీలు సాధిస్తున్నది ఈటీవీ… జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ సరేసరి… మూడు భాగాలు… ఇవి చాలవన్నట్టు ప్రతి ఆదివారం మధ్యాహ్నం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కొత్త షో స్టార్ట్ చేసింది… ప్రధానంగా కామెడీ బేస్డ్… మొన్నటి నెలాఖరున ఆరంభం… దీనికి కూడా మాటీవీ పోటీగా కామెడీ స్టార్స్ అని తనూ అదే టైంలో షో మొదలుపెట్టింది… అదీ ఓంకార్ ప్రోగ్రామే, తను తెర మీద కనిపించడు కానీ ప్రోగ్రాం తనదే… ఆ మొదటిరోజు రెండు ప్రోగ్రాములను చూసిన ప్రేక్షకులు ఈటీవీ వాళ్ల శ్రీదేవి డ్రామా కంపెనీ పట్ల పెదవి విరిచారు… అసలే జబర్దస్త్ స్కిట్లు రోజురోజుకూ మరీ నాసిరకం అయిపోతున్నాయి కదా… ఇది మరింత నాసిరకం… మరీ ఇమాన్యుయెల్, వర్ష లవ్వాయణం అతి అయిపోతోంది… సుధీర్-రష్మి జోడిని కొట్టడం అంత ఈజీ కాదు గానీ, ఈటీవీ ఈ ఇమాన్-వర్ష లవ్వుకు మరీ అంత హైప్ ఇవ్వడం మానేస్తే బెటర్… ఎందుకంటే..?
Ads
ఆ అతి, ఆ ఓవరాక్షన్ ప్రేక్షకుడికి నచ్చడం లేదు… పైగా అర్జున్ యాంకరింగ్ పేలవం… కామెడీతోపాటు ఓ సాంగ్, ఓ డాన్స్, ఓ అసాధారణ ప్రతిభ… ఇలా అన్నీ కలగలిపి కిచిడీ చేశారు దాన్ని… దీంతో ‘ఫోకస్’ లేకుండా పోయింది… కానీ మాటీవీలో వచ్చే కామెడీ స్టార్స్‌లో నిజంగానే కామెడీ స్టార్లు… చమ్మక్ చంద్ర, అవినాష్, హరి, యాదమ్మరాజు, సద్దాం తదితరులు ఇరగదీస్తున్నారు… దీంతో ఈటీవీ వారి డ్రామా కంపెనీ ఢమాల్ అనేసింది… ఎంత ఘోరంగా అంటే… కామెడీ స్టార్స్ 6.25 రేటింగ్స్ సాధిస్తే… ఫాఫం, శ్రీదేవి డ్రామా కంపెనీ మరీ 2.81 రేటింగ్స్ సాధించి ఉసూరుమంది… చతికిలపడింది… అంటే ఓంకార్ ఆల్రెడీ డాన్స్ జానర్లో ఈటీవీ డామినేషన్ బ్రేక్ చేయగా, ఇప్పుడు కామెడీ జానర్‌ను కూడా కబళించడం స్టార్ట్ చేసినట్టు లెక్క… ఈలెక్కన ఓంకార్ గనుక జబర్దస్త్ తరహాలో ఓ కామెడీ షో కొత్తగా స్టార్ట్ చేస్తే… ఈటీవీ ప్రధానమైన మరో బలాన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది… ఇప్పటి జబర్దస్త్ నాణ్యత చూస్తే, ఓంకార్ ఆ పుణ్యం కట్టుకుంటే బెటర్ అన్నట్టుగా ఉంది…!!
ఇదీ తాజాగా మాటీవీ వాడు ప్రచారం చేసుకుంటున్న అంశం… ఇదీ తప్పే… అంటే రేటింగులు తప్పు అని కాదు… కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌ను జబర్దస్త్ తో పోల్చి, మేం గెలిచామోచ్, మేమే తాజా తోపులం అన్నట్టుగా డప్పు కొట్టుకోవడం వేస్ట్… అబ్సర్డ్… నిజానికి కామెడీ స్టార్స్‌ను శ్రీదేవి డ్రామా కంపెనీతో పోల్చుకోవాలి… దాంతో పోల్చి ఉంటే తేడా మరింత ప్రస్ఫుటంగా ఉండేది… పైగా జబర్దస్త్ మూడు పార్టులు వస్తుంది… అన్నీ కలిస్తే రేటింగ్స్ చాలా ఎక్కువ ఉంటయ్… జబర్దస్త్ తరహాలోనే కామెడీ స్టార్స్ స్కిట్లు ఉండవచ్చగాక… కానీ ప్రసారసమయం, దేంతో పోటీయో కూడా చూడాలి కదా… ఎనీవే… కామెడీ జానర్లో ఏం చేయాలో, ఏం చేయకూడదో జీటీవీ వాడికి తెలిసొచ్చి ఉంటుంది… ఆల్రెడీ నాగబాబును నమ్ముకుని మునిగిపోయాడు కదా…!!
Share this Article