నిన్న హీరో గోపీచంద్ మీద ఒక స్టోరీ చెప్పుకున్నాం మనమే… ఇప్పుడున్న దర్శకుల్లో ఎందరు ప్రజా సమస్యల మీద అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారని తను చేసిన వ్యాఖ్యల మీద… ఇన్నేళ్లు టీ కృష్ణ కొడుకుగా నువ్వు చేసిన పీపుల్స్ మూవీ ఒక్కటైనా ఉందా అని అడిగాం, అవి తీసే నిర్మాతలు ఎవరున్నారని అడిగాం…
దీనికి నిర్మాత, రచయిత, దర్శకుడు Dr ప్రభాకర్ జైని మరో కోణంలో ఆన్సర్ ఇచ్చాడు… అసలు ఆ సినిమాలు తీస్తే చూసేవారు ఎవరు అని అడుగుతున్నాడు… తన మాటల్లో చెప్పాలంటే…
“సార్! దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
(1) తెలుగులో థియేటర్లలో సినిమాలు చూసే వారి వయసు 15 నుండి 35 సంవత్సరాలు. వీళ్ళే ప్రస్తుత తెలుగు సినిమా నిర్మాతల, దర్శకుల targetted audience. వీళ్ళకు సమాజం పట్ల బాధ్యత లేదు. సామాజిక సమస్యల గురించి వారికి తెలియదు.
(2) ఎందుకంటే, ఇప్పుడు యువతీయువకుల దృష్టి అంతా సంపాదన మీద, సుఖాల మీద, కార్ల మీద, బైకుల మీదా ఉంది. అందుకే, నానా కష్టపడి, ఐటీ ఉద్యోగం సంపాదించుకుని, అమెరికాలో పడడం, లేదా హైటెక్ సిటీలో పడడం.
(3) ఇందుకు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది.
(4) 20, 25 ఏళ్ళ వయసులో నెలకు, లక్షల్లో జీతాలు రావడంతో సుఖాలకు, డ్రగ్సుకు, పబ్బులకు అలవాటు పడుతున్నారు. వీళ్ళకు ఐదు రోజులు పని, రెండ్రోజుల లగ్జరీ.
(5) హైదరాబాదు నగరంలోనే కొన్ని లక్షల మంది యువతీయువకులు సహజీవనం చేస్తున్నారు.
(6) ఇటువంటి యువత, సమాజ శ్రేయస్సు కోసం తీసే సినిమాలు, ఏడుపులు, దరిద్రం తాండవించే సినిమాలు, దేశభక్తిని పెంపొందించే సినిమాలు చూస్తారా?
(7) మొన్నటికి మొన్న ‘సలార్’ సినిమా విడుదలయిన సమయంలోనే ‘సామ్ బహదూర్’ అని జనరల్ మానెక్ షా జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా వచ్చింది. సలార్ వేల కోట్లకు పరిగెడుతుంటే, ‘సామ్’ సినిమాకు వంద కోట్లు రాయడానికే గగనమయింది.
(8) ఇది సమాజంలో వస్తున్న విపరీత పోకడలకు నిదర్శనం. మన యువతీయువకులు అత్యధికంగా ఫోన్లో చూసేవి బూతు సినిమాలే. (తిన్నామా, తాగామా, పన్నామా, తెల్లారిందా…)
(9) సినిమా హీరోహీరోయిన్లే డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతుంటే, వాళ్ళను ఆదర్శంగా తీసుకుని, మన రాష్ట్రం ‘ఉడ్తా పంజాబ్’ లాగా ‘ఉడ్తా తెలంగాణా’; ‘ఉడ్తా ఏపీ’ లుగా మారాయి. గ్రామగ్రామానికి డ్రగ్స్ చేరిపోయాయి. మొన్న హైదరాబాదు సీపీ ప్రెస్ మీటులో మాట్లాడుతూ గత సంవత్సరమే, తెలంగాణా రాష్ట్రంలో 28000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్టు చెప్పారు. దొరకనివి అంతకు వంద రెట్లు ఉంటాయి.
ఇప్పుడు చెప్పండి, గోపీచంద్ లేదా మరో హీరో దేశభక్తి సినిమాలు గానీ, సామాజిక సమస్యల సినిమాలు గానీ తీస్తే, ఈ మాత్రం కూడా చూడరు.
నిజమే, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలన్నీ అభూత కల్పనలే. అబద్ధాల పుట్టలే.
ఇటువంటి సినిమాలు ఓ ఇరవై కోట్లలో తీస్తారు. హీరో, డైరెక్టర్ కలిసి పది కోట్లు పంచుకుంటారు. సినిమా దరిద్రంగా ఉన్నా థియేటర్లు, ఆడియో కంపెనీలు, ottలు, టీవీ ఛానెళ్ళకు అమ్ముకోవడం వల్ల ఓ ఐదు కోట్ల వరకైనా లాభం వస్తుంది. చాలు కదా? దేశం, సమాజం సంకనాకిపోతే ఎవరికేంటి?”
Ads
Share this Article