Subramanyam Dogiparthi….. మనసు కవి ఆత్రేయ వ్రాసిన సైంటిఫిక్ ఫిక్షన్ కధ . చేయని నేరం తన మీద పడితే , తప్పించుకోవటానికి సైంటిస్ట్ అయిన మేనమామ కనిపెట్టిన అదృశ్యమయ్యే ద్రావకం తాగుతాడు హీరో కృష్ణ . దీన్ని ఆసరాగా తీసుకొని విలన్ సత్యనారాయణ హీరో పేరుతో నేరాలు చేస్తుంంటాడు . విరుగుడు ద్రావకం తాగి , విలన్ ఆట కట్టించటమే ఈ సినిమా కధ .
బాగానే ఆడింది . ఇలాంటి కధాంశంతో హిందీలోనో , ఇంగ్లిషులోనో సినిమా చూసా . పేరు గుర్తుకు రావటం లేదు . ఎవరికయినా గుర్తున్నాయా ? కృష్ణను మెచ్చుకోవాలి . తేనె మనసులు నుండి నాలుగేళ్ళలో సుమారు 25 సినిమాలు నటించారు . సాహసంతో పాటు కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు . హేట్సాఫ్ .
జి విశ్వనాధం దర్శకత్వంలో 1969 లో వచ్చిన ఈ శభాష్ సత్యం సినిమాలో కృష్ణ , రాజశ్రీ , మణిమాల , ధూళిపాళ , విజయలలిత , మాలతి , నాగభూషణం , సత్యనారాయణ , రాజబాబు , విజయభాను ప్రభృతులు నటించారు . విజయా కృష్ణమూర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ థియేటర్లో బాగానే ఉంటాయి . బయట పాపులర్ కాలేదు .
ఇలాంటి కధాంశంతో 2000 లో Hallow Man అనే ఇంగ్లీషు సినిమా వచ్చింది . ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవలసింది ఏమిటంటే 1969 లోనే అలాంటి కధను మన మనసు కవి వ్రాసేసారు . కృష్ణతో రాజశ్రీ హీరోయిన్ గా నటించిన చాలా తక్కువ సినిమాల్లో ఇదొకటి .
మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . చిన్నవాళ్ళంగా ఉన్నప్పుడు ఇలాంటి ఫిక్షన్ సినిమాలు , మాయల మంత్రాల సినిమాలు భలేగా ఉండేవి . సినిమా యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు చూడవచ్చు . చూడబులే .
Share this Article
Ads