అప్పట్లో మోహన్‌బాబు సినిమా ఏదో వచ్చింది… అందులో తనతోపాటు మీనా, శ్రీకాంత్, ప్రజ్ఞా జైస్వాల్, తనికెళ్ల భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్విరాజ్, రఘుబాబు, సునీల్, రాజారవీంద్ర, బండ్ల గణేష్, రవిప్రకాష్, నరేష్, పోసాని, రాజీవ్ కనకాల నటీనటులు… చిరంజీవి వాయిస్ ఓవర్…
సో, ఎలా ఉండాలి…? కానీ సూపర్ బంపర్ డిజాస్టర్… నటీనటులను అలా పిలిచి ఏదో నటింపజేసి, మిగతా సీన్లకు వెనుక నుంచి ఎవరినో చూపిస్తూ, ఏదో ప్రయోగం అన్నట్టు బిల్డప్ ఇస్తూ, ఏదేదో ఎడిటింగ్ చేసేసి జనంలోకి వదిలారని బోలెడంత విమర్శ కూడా వచ్చింది… చివరకు ఏమైంది..? ప్రేక్షకులు గతంలోలా లేరు… ఏది చూపిస్తే అది చూసి, చప్పట్లు కొట్టి, పర్సులు ఖాళీ చేసుకునే టైప్ కాదు ఇప్పటి జనం…
మనం ఇప్పుడు వ్యూహం, శపథం, రాజధాని ఫైల్స్ గట్రా దారుణమైన ఫెయిల్యూర్స్ చూస్తున్నాం గానీ ఆ మోహన్‌బాబు సినిమా అంతకు మించి… అంతెందుకు..? ఆమధ్య నాగార్జున హీరోగా చేసిన ఆఫీసర్ కూడా…! మరో ఉదాహరణ… ఆమధ్య ఒక హీరోకు నిర్మాతకూ నడుమ షూటింగ్ నడుమలో విభేదాలు… హీరో చేయిచ్చాడు… నిర్మాతకు మండి, అప్పటివరకూ షూటింగ్ జరిగిన ఫీడ్‌నే ఎలాగోలా ఎడిటింగ్ చేయించి, అబ్‌రప్ట్‌గా సినిమాను ఎండ్ చేసి విడుదల చేశాడు… ఫలితం తెలుసు కదా… ఎపిక్ డిజాస్టర్…
Ads
ఇవి ఎందుకు చెప్పుకోవడం అంటే..? ఇప్పటి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేయడం కష్టం… తాజాగా… ఆమధ్య రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య లాల్ సలాం అని ఓ సినిమా తీసింది… పేరుకు రజినీ గెస్ట్ రోల్… నిజానికి తనే ఆ సినిమాకు డ్రైవింగ్ ఫోర్స్… కానీ ఏమైంది..? డిజాస్టర్… అదేమిటి..? రజినీక పేరుతో కొన్నాళ్లు ఆడాలి అంటారా..? లేదు… నువ్వు రజినీవి అయితే ఏమిటి, ఇదేం చెత్త సినిమా అనేశారు ప్రేక్షకులు…
అబ్బే, ప్రేక్షకుల కాన్సంట్రేషన్ రజినీకాంత్ మీద ఉండటంతో సినిమా రక్తికట్టలేదు అని ఓ పిచ్చి సమర్థనకు దిగింది రజినీ బిడ్డ… తరువాత నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఇలాగే ఉంటుంది మరి అనేసింది… ఇప్పుడు తాజాగా ‘సినిమా వికటన్’ మీడియాతో ఏం చెప్పిందో తెలుసా..? 20 కెమెరాలతో జరిపిన 21 రోజుల షూటింగ్ తాలూకు ఒరిజినల్ ఫుటేజీ మొత్తం ఎక్కడో ఎగిరిపోయిందట… అందులో 10 కెమెరాలతో చిత్రీకరించిన ఓ క్రికెట్ మ్యాచ్ కూడా ఉందట… ఒక రియల్ మ్యాచ్ చూస్తున్న ఫీల్ కలిగేలా చిత్రీకరించారట…
పోతేపోయింది, ఇక అదంతా మళ్లీ షూట్ చేయాలని అనుకున్నారట, కానీ కుదరలేదట… దీంతో పోగా మిగిలిన ఫుటేజీనే అటూ ఇటూ తిప్పి, ఏదేదో చేసి, ఎడిటింగ్ మాయ చేసేసి, జనం మీదకు వదిలారు… ఆ సీన్ల మధ్య క్రోనాలజీ, సీక్వెన్స్, లింక్ మిస్సయి ప్రేక్షకులు తలలుపట్టుకుని వచ్చేశారు… కెమెరాలకు వాడినవి ఓల్డ్ డ్రైవ్స్, కొన్ని కరప్టెడ్ అని చెబుతోంది అమ్మగారు… మనకు తెలిసి ఏరోజు షూటింగ్ ఆరోజు అయిపోయాక విడిగా వేరే డ్రైవ్స్‌లో స్టోర్ చేస్తారు ఒరిజినల్ ఫుటేజీ… మరి ఇక్కడ ఏం జరిగిందో అర్థం కాదు…
అది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందో, లేక కుట్ర ఏమైనా జరిగిందో తెలియదు గానీ… రజినీకాంత్ సినిమాను ఇలా అడ్డదిడ్డంగా జనం మీదకు వదలడం, తన పరువును నిండా ముంచేయడమే… అదీ తన బిడ్డే చేయడం మరీ క్షమార్హం కాదు… బిడ్డ సొంత సినిమా కాబట్టి రజినీకాంత్ రీషూట్‌కు అభ్యంతరం చెప్పేవాడు కాదు, తను తప్ప మిగతావాళ్లంతా ఓ మోస్తరు నటులే… సో, రీషూట్ చేసి ఉండాల్సింది… కానీ ప్రేక్షకులు పిచ్చోళ్లు, నాన్న మొహం చూస్తే చాలు సినిమా కలెక్షన్లు కురిపిస్తారు అని తప్పు అంచనా వేసుకుంది బిడ్డ… జనం మాత్రం ఛీపోవమ్మా అనేశారు..!!
Share this Article