నీతా అంబానీ గురించి పరిచయం అక్కర్లేదు కదా… ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ భార్య, రిచ్చెస్ట్ వైఫ్ ఇన్ ఇండియా, రిలయెన్స్ ఫౌండేషన్ చెయిర్ పర్సన్, Nita Mukesh Ambani Cultural Centre (NMACC) ఫౌండర్ చెయిర్ పర్సన్, Dhirubhai Ambani International School (DAIS) ఫౌండర్ చెయిర్ పర్సన్… ఇలా ఎన్నెన్నో… అడుగు తీసి అడుగేస్తే రాజభోగం… మొన్ననే తన కొడుకు అనంత్ అంబానీ ప్రివెడ్ ఫంక్షన్‌కు 1000 కోట్లు ఖర్చు పెడితే, వరల్డ్ రేంజ్ సెలబ్రిటీలు వరుసకట్టారు, డాన్సులు చేశారు…
నీతా అంబానీ ఫంక్షన్లలో ఇద్దరు ప్రముఖంగా అన్నీ తామై ఇద్దరు కనిపిస్తారు… ఒకరు ఆమె చెల్లెలు, అనగా ముఖేష్ మరదలు మమతా దలాల్… రెండు ఆమె తల్లి పూర్ణిమా దలాల్… అందరికీ తెలిసిందే కదా, నీతా అంబానీ ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది… డాన్సర్ అయిన ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ముఖేష్… నీతా తండ్రి రవీంద్ర భాయ్ దలాల్ ఆదిత్య బిర్లా కంపెనీలో ఓ సీనియర్ మేనేజర్… 2014లోనే మరణించాడు ఆయన…
Ads
ఒకే తల్లి కడుపున పుట్టారు కదా నీతా అంబానీ, మమతా దలాల్… ఇద్దరివీ పూర్తి కంట్రాస్టు జీవితాలు… నీతాది రాజవైభోగం,,. అపరిమితమైన సంపద… కానీ మమతా దలాల్..? సోదరి నీతా అంబానీ నడిపించే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో టీచర్… స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలో మెంబర్ కూడా…
అక్కడా ఇక్కడా పనిచేయడం వద్దు, ఇక్కడే పనిచేయి అని నీతా ఆమెను తన దగ్గరే అకామిడేట్ చేసుకుంది… ఎంత జీతం ఇస్తుందని అడక్కండి… ఆ స్కూల్‌లో వరల్డ్ రేంజ్ ఫీజులు ఉంటాయి, పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు అత్యంత సెక్యూర్డ్, హైఫై రేంజులో చదువుకునే స్కూల్ కాబట్టి టీచర్ జీతం కూడా తక్కువేమీ ఉండదు… ఆమె పిల్లలతో వర్క్ షాపులు, క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉంటుంది…
పెళ్లికి ముందు నీతా అంబానీ కూడా టీచరే… తరువాత కొన్నాళ్లు చేసి మానేసింది… సచిన్ పిల్లలు, షారూక్ ఖాన్ పిల్లలకు ఈ మమతా దలాలే స్కూల్ టీచర్‌గా పాఠాలు చెప్పింది… నీతా, మమతల తాత గారు ఫ్రెంచిలో ప్రొఫెసర్… ఆ కుటుంబంలో ‘చదువు వాతావరణమే’ ఉండేది… కవర్ ఫోటో చూశారు కదా… నీతా, మమత సేమ్ పోలికలు, కవల పిల్లల్లా ఉంటారు… చెల్లెను నీతా ఎంత ప్రేమిస్తుందీ అంటే… కుటుంబ ఫంక్షన్లలో నీతా నగల్ని కూడా మమత స్వేచ్ఛగా వాడుకుంటుంది…
మరి వీళ్ల తల్లి… అవును, నీతా అంబానీ ఐపీఎల్ టీం తెలుసు కదా… ముంబై ఇండియన్స్… ఈ జట్టు ఆడే మ్యాచుల్లో టీవీల్లో తరచూ ఈమె కనిపిస్తూ ఉంటుంది… చేతులు జోడించి ఏదో ప్రార్థిస్తూ..! ఆ టీం ప్లేయర్స్ సరదాగా ఆమెను ‘ప్రేయర్ ఆంటీ’ అంటుంటారు… నీతాకు ఎంత సంపద సమకూరినా సరే, చెల్లెను, తల్లిని పెళ్లికి ముందులాగే ప్రేమించడం గుడ్… ఒకే తల్లి కడుపున పుట్టినా సరే ఇద్దరి జీవితాల్లో ఇంత తేడా అనేది డెస్టినీ..!! ఇంతకీ మమత దలాల్ పెళ్లి, భర్తా వివరాలు ఏమిటీ అంటారా..? తెలియవు..!!
Share this Article