మొత్తానికి స్టార్ మాటీవీలో సూపర్ సింగర్ పేరిట, సినిమా పాటల పోటీ పేరిట ఓ వినోద కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్‌గా క్లైమాక్సు దశకు తీసుకొచ్చారు… ఆరుగురు ఫైనలిస్టులను షార్ట్ లిస్టు చేసేసి, ఫినాలేకు తమన్‌ను పిలిచారు… మొదటి నుంచీ అద్భుతంగా పాడుతున్న ప్రవస్తి ఈ షో గెలుస్తుందా లేదా ఫినాలేలో తేలుతుంది… ఆమె చిన్నప్పటి నుంచీ పాడుతోంది… ఆమె శిక్షణ పొందిన శాస్త్రీయ గాయని కూడా…
పర్లేదు, ఆ ఆరుగురూ మెరిట్ ఉన్నవాళ్లే… చెప్పదలుచుకున్నదేమిటంటే… మొదటి నుంచీ సూపర్ సింగర్ షో పాపులర్… కాకపోతే ఇప్పుడు దాన్ని ఒక ఎంటర్ టెయిన్ మెంట్ షోగా మార్చేశారు… మరీ డీజే శ్రీముఖి హోస్టింగ్… నలుగురు జడ్జిలు… శ్వేతా మోహన్, రాహుల్ సిప్లిగంజ్, అనంత శ్రీరాం, మంగ్లి… వాళ్లు కూడా డాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ కంటెస్టెంట్లను మించిన వినోదాన్ని అందించారు…
చెప్పుకోదగిన అంశం ఏమిటంటే..? మంగ్లి, రాహుల్ నడుమ కెమిస్ట్రీ… ఎహె, జడ్జిల మధ్య కెమిస్ట్రీ అంటారా..? ఒకరి మీద ఒకరు జోకులు వేస్తూ, ఆట పట్టించుకుంటూ మొదటి ఎపిసోడ్ నుంచీ షోను తమదైన శైలిలో రక్తికట్టించారు… అఫ్ కోర్స్, రాహుల్ పంచులు కాస్త ఎక్కువ… ఫినాలేలో శ్రీముఖి ఇద్దరినీ ఆటపట్టించింది… ఇద్దరితో డాన్సులు చేయించింది… సరే, తను డ్రమ్మర్ పవన్‌తో స్టెప్పులు వేసింది, అది వేరే సంగతి… సరదాగా… (నో డౌట్, పవన్ చేతిలో ఆర్ట్ ఉంది…) రాహుల్, మంగ్లి అల్లరి సరదాగా బాగానే ఉంది…
Ads
ఫినాలేలో విశేషంగా కనిపిస్తున్నది మంగ్లి శాస్త్రీయ నృత్య ప్రదర్శన… శ్యాంసింగరాయ్‌లోని పాటకు డాన్స్ చేసింది… ఆమె సంగీతంలో కొంత శిక్షణ పొందిందని తెలుసు గానీ శాస్త్రీయ నృత్యంలో ప్రవేశం ఉందో లేదో తెలియదు… కాకపోతే ఈ పాటకు తగిన స్టెప్పులు ప్రాక్టీస్ చేసి ఉంటుంది… బట్ కొత్తగా ఉంది, బాగుంది… తను, తనతోపాటు చెల్లె ఇంద్రావతి కలిసి ప్రైవేటు వీడియోల్లో పాటలు పాడుతూ స్టెప్పులు వేయడం తెలుసు, బట్ ఈ క్లాసికల్ డాన్స్ డిఫరెంట్, కొత్తది…
అనంత శ్రీరామ్‌లో ఓ కోతి దాగి ఉన్న సంగతి తనకు తెలుసంటూ తమన్ చేసిన వ్యాఖ్య నిజమే అనిపించింది… అంతకుముందు ఏదో సంగీతం షోలో నానా వేషాలూ వేస్తూ, స్టెప్పులు వేస్తూ, కుప్పిగంతులు వేస్తూ నానా రచ్చ చేశాడు కదా… ఎందుకోగానీ బాగనిపించలేదు… ఈ షోలో ఇంకాస్త తన వేషాలకు పదును పెట్టాడు… ఫినాలేలో ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు చిత్రమైన స్టెప్పులు కూడా వేశాడు… ముందే చెప్పుకున్నాం కదా… పేరుకే ఇది మ్యూజిక్ షో… సినిమా సాంగ్స్ కంపిటీషన్… నిజానికి షో నిండా జడ్జిలే కంటెస్టెంట్లను మించి సకల కళాపోషణ చేశారు, అంటే… వినోదాన్ని పండించారు అని..!!
Share this Article