నటుడు విష్వక్సేన్ నోటిదురుసు వ్యాఖ్యలు గతంలో కూడా కొన్నిసార్లు వివాదాస్పదమయ్యాయి… నిగ్రహం, సంయమనం కాస్త తక్కువే… ఎప్పుడో ఆరేళ్ల క్రితం స్టార్ట్ చేసి, ఇటీవల రిలీజైన తన గామి చిత్రంలో కొన్ని టెక్నికల్ వాల్యూస్ బాగుండటంతో మంచి రివ్యూలే వచ్చాయి… ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి… బ్రేక్ ఈవెన్ అని కూడా అన్నారు… గుడ్, కానీ వెంటనే బాగా కలెక్షన్ల డ్రాప్ ఉందనీ అంటున్నారు…
నిజానికి అందులో కొన్ని సీన్లు సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా లేవు… ఆ విమర్శలు వచ్చాయి… దానిపై ఎక్కడో మాట్లాడుతూ ‘అదేమైనా రాకెట్ సైన్సా? ఏకాగ్రతతో చూస్తే అవే అర్థమవుతాయి’ అన్నాడు తేలికగా విష్వక్సేన్… సరే, ప్రస్తుతం మనం చెప్పుకునేది దాని గురించి కాదు… రీసెంటుగా మలయాళంలో సూపర్ హిట్టయి, తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్న ప్రేమలు సినిమా గురించి…
రాజమౌళి, కీరవాణి, మహేశ్ బాబు తదితరులు ఆ సినిమాను మెచ్చుకున్నారు… అంతే, మరి సినిమా పెద్దలు నా గామి సినిమాను చూసి, నాలుగు మంచి మాటలు చెప్పరేం అంటున్నాడు విష్వక్సేన్… ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రావు అని తనే సర్టిఫికెట్ కూడా ఇచ్చేసుకున్నాడు, సరే, తన సినిమా కాబట్టి తనెలాగూ ఓన్ చేసుకుంటాడు… కానీ వేరేవాళ్లను నా సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలంటూ, అలా చేయకపోవడం తప్పనే రీతిలో కామెంట్లు దేనికి..?
Ads
ఏ సినిమా చూడాలో, దేన్ని మెచ్చుకోవాలో ఆయా వ్యక్తుల ఇష్టం… నీ సినిమా నీకు బంగారం కావచ్చు, వేరే వాళ్లకు అలా అనిపించకపోవచ్చు, దాన్నెలా తప్పుపడతావ్..? పైగా సినిమాలోని కొన్ని సీన్లు మరీ సంక్లిష్టంగా ఉన్నాయనే నెగెటివ్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి కదా… ఐనా తెలుగులో చాలా సినిమాలు వస్తుంటయ్, పోతుంటయ్, అన్నింటి మీదా మంచి వ్యాఖ్యలు చేయాలా పెద్దలు…? ఇలా నిర్దేశించడం ఏమిటి..?
మళ్లీ తనే అంటాడు… ‘ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూనే ఉంటాను, ఇలాంటి కథే, ఇలాంటి సినిమాయే హాలీవుడ్‌లో వచ్చి ఉంటే మనవాళ్లు అంగీలు చింపుకునేవాళ్లు…’ గుడ్, ఇదే స్పిరిట్… ఎవరో మెచ్చుకోవాలని కాదు, ప్రేక్షకులు మెచ్చుకోవాలనే తీయాలి… కానీ ఇలా మహేశ్ బాబు వంటి హీరోలపై పడి విమర్శలు చేయాల్సిన పనే లేదు…!!
Share this Article